కరీంనగర్

చదువులమ్మ ఒడిలో..ట్రింగ్.. ట్రింగ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 29: ప్రశాంత వాతావరణంలో ఏకాగ్రతతో విద్యా బోధన చేయాల్సిన చదువులమ్మ ఒడిలో నేడు అనునిత్యం ట్రింగ్.. ట్రింగ్‌లు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు, బోధకుల ఏకాగ్రత దెబ్బతిని, బోధన నామమాత్రంగా మారి, ఈప్రభావం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌పై పడుతుందని ఇటీవలే సుప్రీంకోర్టు పాఠశాల విద్యాశాఖను తీవ్రంగా మందలించింది. పాఠశాల ఆవరణలో చరవాణి వాడటంపై నిషేధం ఉన్నా దీనిని అమలు చేయటంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ చురకలు పెట్టింది. సెల్‌ఫోన్ వినియోగంతో విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై ఓవిద్యాభిమాని కోర్టునాశ్రయించగా, పనివేళల్లో ఫోన్‌లకు దూరంగా ఉండేలా, ఫోన్ వినియోగంపై నిషేధం అమలుచేయాలంటూ సూచించింది. అయినా, ఆచరణ మాత్రం లేకపోవటంతో పాఠశాలల్లో తరగతి గదుల్లోనే ఆచార్యులు విచ్చలవిడిగా ఫోన్‌లు వినియోగిస్తున్నారు. దీనిపై మరోసారి కోర్టుగుమ్మం ఎక్కటంతో కోర్టు ఆదేశాలు పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం సీరియస్ కావటంతో జిల్లాల్లో కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. సెల్‌ఫోన్ వినియోగంతో కలుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగించవద్దని, సెల్‌ఫోన్‌లను ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల వద్దే డిపాజిట్ చేసి, తరగతుల్లోకి వెళ్ళేలా హెచ్‌ఎంలకు సూచనలు జారీ చేయాలంటూ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం జిల్లాలోని పాఠశాలలకు పాఠశాల విద్యా శాఖనుంచి వచ్చిన ఉత్తర్వులను యథాతథంగా పంపుతూ, వీటి అమలు పట్ల నిత్యం పర్యవేక్షణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో అప్రమత్తమైన పాఠశాలల హెచ్‌ఎంలు సెల్‌ఫోన్ వినియోగంపై ఇప్పటికే ఆంక్షలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో సెల్‌ఫోన్ వినియోగిస్తూ పట్టుబడితే ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు తిప్పలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తుండగా, ఎంకి పెళ్ళి సుబ్బిచావుకొచ్చినట్లవుతుందేమోననే భయంతో సెల్‌ఫోన్‌లు తమవద్దే డిపాజిట్ చేసి తరగతి గదుల్లోకి వెళ్ళాలంటూ పంతుళ్ళకు హెచ్‌ఎంలు సూచిస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటుండటం గమనార్హం.