భక్తి కథలు

కాశీ ఖండం..3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా గణేశ్వరీ ప్రేషణం, గణేశ్వర మాయా ప్రపంచం, డుంఠి ప్రాదుర్భావం, విష్ణుమాయా ప్రపంచం, దివోదాస సముచ్ఛాటనం, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవం, వైష్ణవతీర్థ మహాత్మ్యం, మందరాచలం నుంచి ఇందువౌళి వారణాసీ పురానికేతెంచుట, జైగీషవ్యోపాఖ్యానం, కృత్తివాసస్సముత్పత్తి, దుర్గామహాత్మ్యం, ఓంకార మాహాత్మ్యం, త్రిలోచక సముద్భవం, కేదారేశ, ధర్మేశ మాహాత్మ్యాలు, పక్షి కథ విశ్వభుజాఖ్యానం, దుర్దమ కథ, విశే్వశ్వరాఖ్యానం, కామేశ్వర విశ్వకర్మేశ్వర సతీశ్వరామేశ్వర వర్ణనలు, వ్యాసభుజాస్తంభనం, క్షేత్రతీర్థ కదంబ వర్ణనం, ముక్తిమంటపవర్ణనం, విశే్వశ్వరావిర్భావం, దేవతా యాత్రా విధానం- అని పుణ్యాఖ్యానాలు నూటొక్కటి కలిగి- అనేక ఉపాఖ్యానాలనే శాఖోపశాఖా శోభచే సముచిత అభ్యుదయం కలది అయి స్కాంద పురాణ జలధి జాతమయి, పరమేశ్వరారాధన లబ్ద మోక్ష ఫలమై అఖండ వైభవంతో కాశీ ఖండం, ఆశాస్యాలని (ప్రార్థనీయ శుభాలని) సమకూరుస్తుంది. పూర్వఖండంలో బ్రహ్మర్షి నారదుడు తీర్థయాత్రలు కావించాడని సూతుడు శౌనకాది మహామునులకి వివరించాడు. తదుపరి ఆ మునీశ్వరులు ప్రశ్నింపగా కాశీ వృత్తాంతాన్ని ఈ విధంగా వచింప మొదలుపెట్టాడు. వ్యాసమహర్షి ప్రియ ఛాత్రుడయిన సూత మహర్షికి తదనంతర కథాక్రమం ఈ విధంగా వాకొన్నాడు.
నారదుడు వింధ్యకు ఏతెంచుట
ఈ కరణి పవిత్ర తీర్థముల్లో స్నానమాడి నర్మదా తరంగిణిలో స్నానం ఒనర్పదలచి, గోదావరి నదీ తటాన్ని అనుసరించి దండకాటవీ మార్గమధ్యాన్ని దరిసి, నారదుడు తన ముందట ఉన్నతాలైన గండశిలాగ్ర భాగాలనుంచి ఎగసిపడుతున్న సెలయేటి జాలముల సమూహంతో వనధితో చేతులు కలుపుతున్నదీ, సింహముల కంఠ గర్జనలవల్ల అణగిపోతున్న కరుల దర్పాంధ్యము కలవిన్నీ, మేరుపర్వతం వడువున ఉన్నత గర్వశిఖరం చేత అవంధ్యం అయిన వింధ్యాచలాన్ని కనుగొన్నాడు. నర్మదా తరంగిణీ తరంగ శీకరాలచే శిశిరాలైన మంద వాయువుల చేత నలువంకల కదల్పబడుతున్న జటాభారం కలవాడయి నారద మహర్షి వింధ్య పర్వతాన్ని అల్లన చేరుకొన్నాడు. తపస్యులలో అగ్రేసరుడైన ఆ నాదర ముని శ్రీపాద జలజ యుగళి ముద్రలచే అలంకరింపబడిన పావన శిలాఫలకాలతో ఆ వింధ్యము విలసిల్లింది. నారదుడి తన వీణ మహతిని మీటుతూ సంగీతం అభ్యసిస్తూ ఒక తరుణీ అతని వెంట చనుదెంచింది. అందమైన గైరిక పరాగం చెదరిపడి ఆ తరుణి ముంగురులకి ఒక వింత అందాన్ని సంతరించి పెడుతోంది. ఎడం లేక పరస్పరం ఒరసికొంటున్న స్తనద్వయం బరువువల్ల నిరుపేద నడుము జవ్వు జవ్వులాడుతోంది. తొలుకారు మేఘపు మెరపు తీగల్ని పోలు కనుగవ వడదెబ్బకు కొంచెం వాడిపోయింది. స్వేదబిందువులకి తడిసిన చెందేరపు బొట్టు బురదలాగు నొసట వ్యాపించింది. బంగారు మొలనూలు జఘన చక్రం నుంచి జారిపడుతోంది. నీవి నాభీస్థలి నుంచి వీడిపోతోంది. ఆ విధంగా ఆ తరుణి నారదుడి వెంట నడిచి వచ్చింది.
వింధ్య పర్వత వర్ణన
కర్పూర కదళికావనాలపై నుంచి వీస్తూ శైత్యం చెందిన మందవాయువులు అధ్వనీకుల బడలికలు తీరుస్తున్నాయి. కమియ పండిన మారేడు ఫలాలు చెంచితల కుచశ్రీలని పరిహసిస్తున్నాయి. తమలపాకు తీగల గాఢ పరీరంభణాలు పోకమ్రాకులకి సుఖాన్ని పురులు కొనచేస్తున్నది. పాటలీ చంపక వకుళ కుసుమ పరిమళంతో మల్లికా సుమాల పరిమళం వియ్యం అందుకొంటున్నది.

-ఇంకా ఉంది