భక్తి కథలు

కాశీ ఖండం.. 177

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుకోసుల ఆవలి ప్రదేశంలో కాశీనగర ప్రాకారాలు, స్వర్ణకలశాలు కనవచ్చే చోట తక్కిన తిథుల్లో నివసించు. పుణ్యతీర్థాలని నిందింపకు. శపించతలపోయకు. బుద్ధిమంతుడవై బ్రతుకు. పో!’’ అని పలుకుతూ భవానితో భవుడు అంతర్హితుడు అయిపోయాడు. వ్యాస మహర్షి కూడా విశే్వశ్వరుడు ఆనతిచ్చిన విధంగా కాశినగరానికి దవ్వుగా వున్న అడవిలో నివసించసాగాడు.
అని వివరం చెప్పగా అగస్త్య మహర్షి కార్తికేయుడికి అభివాదం ఒనర్చి కాశీలో వున్న తీర్థాలూ, లింగాలూ నాకు తెలుపుమని ప్రార్థించాడు. అపుడు కుమారస్వామి లోపాముద్రాస్వామికి ఈ విధంగా చెప్పపూనుకున్నాడు.
క్షేత్ర తీర్థ కదంబ వర్ణనము
‘‘అనఘాత్మా! మహర్షీ! మా తల్లి మా తండ్రి అయిన శంభుదేవుడిని హస్తాలు ముకుళించి అడిగింది. ఆ విధంగా అడుగగా మా తల్లి విశాలాక్షికి కరుణతో లేత శశికళావౌళి ఈ భంగి వచించాడు.
‘‘విశాలాక్షీ! మోక్షలక్ష్మికి జన్మస్థలం అయిన కాశీ పట్టణానికి విశే్వశ్వర నామధేయుణ్ణి అయినా నా చుట్టూ పంచక్రోశ మధ్యభాగంలో బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు ఆది దేవతా నమస్కరణీయాలై రహస్యంగా వున్నవి, బయలుపడి వున్నవి,
రహస్యమైనవీ బయట పడినవీ అయిన దివ్య లింగాలు లెక్కపెట్టి చెప్పడానికి శక్యం కాదు- పుణ్యతీర్థాలు, పవిత్ర వాపీ కూపతటాకాలు లెక్కకు అందవు. గుర్తువచ్చినవీ, గుర్తువున్నవీ చెప్పుతాను. సావధానమతితో వినవలసింది- పద్మలోచనా! సారస్వతేశ్వర నామక లింగం సారస్వతాన్ని ప్రసాదిస్తావు. గోప్రేక్ష లింగేశ్వరుడు దయాసముద్రుడు. నగరాజకుమారీ! దధీచీశ్వర లింగం పాపాల నుంచి విడిపించుతాడు. అత్రీశ్వర లింగ దేవుడు ఐహికాముష్మిక ఫల ప్రదాత. విజ్వరేశ్వరుడు గున్న కల్పతరువు. వేదేశ్వరుడు కరుణాజలధి. ఆదికేశవేశ్వరుడు సకల ఆపద నివారకుడు. సంగమేశ్వరుడు కెలకులనున్న తంగేటి జున్ను. చతుర్ముఖేశ్వరుడు భయం నుంచి రక్షిస్తాడు. శాంతీశ్వరుడు చింతామణి కాంతీశ్వరుడు సంతాన కారకుడు.
కాపిల హ్రదం గర్వజనితాలైన వ్యాధులకి చికిత్స చేస్తుంది. అనసూయేశ్వరుడు కొంగు బంగారం. సిద్ధి వినాయకుడు కోరికల్ని పితికే ధేనువు. హిరణ్యకశిపు లింగం ముంగి పెన్నిధి. మందాసురేశ్వరుడు స్కందేశ్వరుడు, ప్రసన్న వదనేశ్వరుడు- వీరు సుస్థిర ఐశ్వర్యం అనుగ్రహిస్తారు.
ప్రసన్నోద కుండం పాపాలు హరిస్తుంది. అష్టాదశేశ్వరుడు పాప తీరాలు దాటించేవాడు. మిత్రావరుణేశ్వరుడు, వృద్ధవశిష్టేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, యాజ్ఞవల్క్యేశ్వరుడు, ప్రహ్లాదేశ్వరుడు, వైరోచనేశ్వరులు సమస్త అభీష్టాలు నెరవేరుస్తారు. బాణ చంద్రేశ్వరుడు, విద్యేశ్వరుడు అశుభాలు పారద్రోలువాడు. వికటాదేవి జంబూ నదీకాలువ- వీరేశ్వరుడు వారణాసీ నగరంలోని పంచముద్ర మహా పీఠానికి పట్ట్భాషిక్తుడు అయిన దేవుడు. వాలి, హనుమదాశ్వినేశ్వరుల లింగాలు మంగళప్రదాలు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి