భక్తి కథలు

కాశీ ఖండం.. 178

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు, భద్రకుండం చుళికీకృత సకల దోషం. భద్రేశ్వర మహాదేవుడు ఆ భద్ర కుండంలో వసిస్తాడు. ఆ తీర్థం ఈశాన్య విదిక్కులో చక్ర కుండం వుంది. చక్రేశుడు చక్ర కుండంలో వుంటాడు. ఆ చక్రేశుడి సేవ సంసార చక్ర బాధల్ని ధిక్కరిస్తుంది. దానికి నైరృతి దిశ శని త్రికూటేశ్వర లింగం వుంటుంది. దాని చేరువనే శూలకుండం. శూలతీర్థంలో స్నానపానాలు చెయ్యడంవల్ల దురితాలు పటాపంచలవుతాయి. ఆ హ్రదం అగ్రభాగంలో నారదేశ్వరుడు. కోటీశ్వరలింగం వున్నవి. కోటి తీర్థమూ అక్కడనే.
అంగారకేశ్వర లింగం, దుర్గ, చాముండి, భార్గవేశ్వర లింగం, కపిలేశ్వర లింగం, ఓంకారతీర్థం, మత్స్యోదరీ తీర్థరాజం, శంకు కర్ణేశ్వరుడు, అఘోరనాధేశ్వరుడు, రుద్రదాసహ్రదమూ, మహాపాతక రూపాలైన ఉపద్రవ విద్రావణ ప్రౌఢి చేత రౌద్రోదయ స్ఫూర్తులై వుంటారు.
ఆ సమీపంలో కౌస్త్భుశ్వరుడు, సిద్ధేశ్వరుడు వుంటారు. కానుకుండతీర్థం, లక్ష్మీశ్వర, సత్యేశ్వర, అమృతేశ్వరులు వసిస్తారు. చంద్ర కుండం, ఇంద్రేశ్వరుడు, చంద్రేశ్వరుడు, అగ్నీశ్వరుడు, బాలచంద్రేశ్వరుడు, వృద్ధకాళేశ్వర లింగం, దక్షేశ్వర లింగం, ఐరావతేశ్వర లింగం, ధన్వంతరీ శానలింగం, తుంగనాధేశ లింగం, శ్రీ భైరవాధీశ లింగం- సందర్శించే మనుష్యుడు మృత్యువువల్ల జనించిన భయాన్ని పోగొట్టుకుంటాడు.
వ్యాసేశ్వర లింగం, వ్యాస కుండం పంచచూడాసరోవరం, మధ్యమేశ్వర లింగం, మందాకినీ తీర్థం, రామభద్రేశ్వర లింగం, జంబుకేశ్వర మతంగేశ్వర లింగాలు, సిద్ధకూపం, సిద్ధేశ్వర లింగం, వ్యాఘ్రలింగం, శాతాతపేశ్వర లింగం, హరితేశ్వర లింగం, కణాదేశ్వర లింగం, ఆషాఢనాధేశ్వర లింగం, భారభూతేశ్వర లింగం, శ్రీగుభస్తీశ్వర లింగం, మంగళేశ్వర లింగం, త్వష్ట్వనాథేశ్వర లింగం, దైవదైత్యేశ్వర లింగం, శ్రీఘ్రచండీశ్వర లింగం, చిత్రగుప్తేశ్వర లింగం, నిర్జరేశ్వర లింగం, నిమ్నగేశ్వర లింగం, శుక్రేశ్వర లింగం, శక్రకూపం, శ్రీదాదికేశ్వర లింగం, మంగళాదేవి, మయూఖార్కేశ్వర లింగం, వ్యాఘ్ర పాదేశ్వర లింగం, శ్రీవిభాండేశ్వర లింగం దర్శనీయాలు.
సిద్ధేశ్వర లింగం- లక్షలు, కోట్లు, అర్బుదాలు, న్యర్బుదాలు- అసంఖ్యక లింగాలు ఆకాశ గంగా తీరంలో కాశికాక్షేత్ర సీమలో- సరిహద్దులో- కళ్యాణీ! కాత్యాయనీ! దేవీ! నారాయణీ! శ్రీవిశాలక్షీ! భోగం, మోక్షం, సేవించేవాళ్లకి ఒసగ సమర్థాలు. ఇదే సత్యం. సత్యం. సత్యం- ముమ్మాటికీ సత్యం!
అవిముక్తేక్షేత్రం అయిన కాశీలోని శివలింగనామ మాలని శివుడి సన్నిధిలోను, విష్ణుమూర్తి హరిముందర పఠించినా, ఆలకించినా మానవుల పాప సంఘాతాలు నశిస్తాయి.
శంఖసంకాశ కంఠీ! కాశీనగరంలో ఒకే పేరుగల శివలింగాలు పెక్కులు వున్నాయి. ఒకే నామంగల తీర్థకుండాలు అనేకం వున్నాయి. ఒకే పేరుకల ఉపవనాలు అనేకం వున్నవి.
పద్మలోచనా! కాశీపురంలోని నూతుల సంఖ్య లెక్కపెట్ట శక్యం కాదు. తీర్థకుండాల సంఖ్య గణనాతీతం.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి