భక్తి కథలు

కాశీ ఖండం.. 181

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకన్నా విశేషించి మధుకైటభుల్ని సంహరించిన విష్ణుమూర్తిని గౌరవం అతిశయించే విధంగా ఆదరించాడు. పదపడి ఈ గతి ఆజ్ఞ ఒసగాడు.
ఓ రాజీవాక్షా! నీ కారణంవలనే కదా మరల నాకు ఆనంద కాననం చేజిక్కినది! దేవతాద్వేషి అయిన దివోదాస నృపతిని కాశీ నుంచి వెడలగొట్టడం వేరొకరివల్ల అయే పనియేనా? నీకు ఏది ప్రియం? దానినే వరంగా ప్రసాదిస్తాను అని గౌరీనాధుడు లక్ష్మీ నాథుడితో పలికాడు. ఈ ముజ్జగాలలోను ప్రియమైనది నాకు మరొకటి లేదు. నీలగ్రీవా! నాకు ప్రియమైనది ఒక్కటియే వుంది. ఈ కాశీనగరంతో నీ పొరుగున నాకొక నివేశన స్థానాన్ని కరుణతో అనుగ్రహించవలసింది.
విశే్వశ్వర లింగ మహాత్మ్యము
అని వేడగా శంకరుడు ‘‘ఆ విధంగానే అవుతుంది. విశ్వంభరా! విష్ణుదేవా! నా చెంతనే వసించునది. మొదట నిన్ను ఆరాధించి పిమ్మట ప్రజలు నన్ను ఆరాధిస్తారు. ఇదుగో చూడు- నాకు దక్షిణ మంటపం అయిన ఈ ముక్తి మంటపంలో కాశీ మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పే పుణ్యకథలు ఆకర్ణించు. మణికర్ణికా తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత ముక్తి మంటపంలో పురాణ ప్రవచనం ఆలించడం కర్తవ్యం. ఓ శారపాణీ! కాశీలో ఎన్ని అయినా అసంఖ్యాకంగా తీర్థాలు వుండనీ! చక్రపుష్కరిణీ తీర్థమే- లేక మణి కర్ణికా తీర్థమే తీర్థం! గరుడవాహనా! కాశీ పురంలో ఎన్ని లింగాలైనా వుండనీ! విశే్వశ్వరుణ్ణి అయిన నేనే లింగాన్ని!
పద్మనాభా! ఇదుగో ఈ కానవచ్చేది కళ్యాణ మంటపం, నాకు విహారభూమి. మోక్షలక్ష్మి అనే కాంతకి అంతఃపురం. కాశీపురానికి కంఠహారం అనే ఆభరణం.
ఈ ముక్తి మంటపానికి రాబోవు ద్వాపర యుగములో ‘కుక్కుట మంటపం’ అనే మరొక పేరు కలుగుతుంది. ఆ వృత్తాంతాన్ని విశదపరుస్తాను వినవలసింది. ఈ ఆనంద కాననంలో మహానందుడు అనే బ్రాహ్మణుడు ఋగ్వేదం అధ్యయనం కావించినవాడు. అతడు చిననాటనే తండ్రిని కోల్పోయాడు. అవినయాలకి నెలవైన వన ప్రాయంలో ఇంద్రియ సుఖాలయందు చిక్కుకొని మన్మథ బాణాల చేత పీడితుడయి- ఉత్తమ సాధ్వి అయిన ప్రక్క యింటి బ్రాహ్మణుడి భార్యని అపహరించుకొనిపోయి త్రాగకూడని పానీయం త్రాగడం, భక్షింపకూడని దానిని తినడం, పొందకూడని స్ర్తిలని పొందడం, ఆచరింపదగనివాటినే ఆచరించడం కృత్యాలుగా ప్రవర్తించసాగారు.
ఒక సమయంలో శైవుడు అయి సమస్తావయవాల్లోను విభూతి, రుద్రిక్షమాలలు ధరిస్తాడు. ఒక్కొక్క వేళ పరమ వైష్ణవ భాగవతుడై ప్రపత్తిని పొంది శ్రీగుణ రత్నకోశాన్ని (శ్రీగీతని) పఠిస్తాడు. ఒకప్పుడు నుదుటిపైన బండారు పసుపు తాల్చి గొరగజాతివాడై మైలారదేవరని కొనియాడుతాడు. ఒకనాడు సమగ్ర భక్తిగరిమతో బవినీడు అయి ఏకవీరాదేవిని ప్రస్తుతిస్తాడు. ఒక వేళ బౌద్ధుడు, మరొక మారు కాపాలికుడు, ఇంకొకసారి జైనుడు అయి, ఆయా మత చిహ్నాలు ధరించి అర్థకాంక్షతో ఆ మహానందభూసురుడు తిరుగాడుతూ వుంటాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి