భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా- 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హూ! ఒకడి పీడ వైతొలగిపోయింది! ఇక ఆ దానవుడిని కూడా వధించివేస్తాను’’ అనుకుంటూ పంచాగ్నుల మధ్య నిలిచివున్న రంభుడిమీద తన మాయలన్నీ ప్రయోగించాడు ఇంద్రుడు! అతను కల్పించిన ఝంఝామారుతాలుగానీ, తుపానులుగానీ, అప్సరసల నాట్యగానాలు కానీ రంభుని మీద ప్రభావం చూపలేకపోవడంతో కోపంతో ఊగిపోతూ వరుణుని తలచుకున్నాడు ఇంద్రుడు!
‘‘దేవరాజా! నన్ను తలచిన కారణం?’’ అని అడుగుతూ ఇంద్రుని చెంత ప్రత్యక్షమైనాడు వరుణుడు!
‘‘వరుణదేవా! ఆ రాక్షసుడు నీ మంత్రానే్న జపిస్తూ ఎంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడో చూసావా? నా మాయలేవీ అతని తపస్సును భంగం చేయలేకపోయాయి!’’ అసహనంగా అంటున్న ఇంద్రునివైపు చిరునవ్తు చూస్తూ, ‘‘నిజమే దేవేంద్రా! అతని తపస్సు నాకూ ఆనందం కలిగిస్తున్నది! అతని కోరిక తీర్చడానికి వివశుడిని చేస్తున్నది!’’ అన్నాడు వరుణుడు!
‘‘అందుకే హెచ్చరిస్తున్నాను! నీవు ఆనందంలో అతను కోరినది అనుగ్రహించే ముందు మన దేవతలకే నష్టమూ జరుగకుండా ఆలోచించి వరం ప్రసాదించు’’ అని చెప్పి వెళ్లిపోయాడు ఇంద్రుడు!
‘‘రంభాసురా! నీ తపస్సుకు ప్రసన్నుడినైనాను! ఇలా చూడు! నీ అభీష్టం ఏమిటో తెలుపు, తీరుస్తాను’’ అన్నాడు వరుణుడు రంభుని ఎదుట నిలిచి!
కళ్లు తెరిచి అగ్నిజ్వాలమధ్యనుండి వెలికివచ్చి నమస్కరించాడు రంభుడు!
‘‘వరుణదేవా! నాకు బలపరాక్రమవంతుడు, ముల్లోకాలను పాలించగల ప్రతిభావంతుడైన పుత్రుడిని ప్రసాదించు! ఇదే నా కోరిక!’’ అన్నాడు రంభుడు!
‘‘అలాగే! నీవు మొదటగా ఎవరితో సంభోగిస్తావో, వారివల్ల అంతటి బలవంతుడైన పుత్రుని పొందగలవు’’ అని వరం ప్రసాదించి అదృశ్యుడైనాడు వరుణదేవుడు!
‘‘నా తపస్సు ఫలించింది! ఇక నా పత్నిని కలుసుకుని, ఆమెను సంతోషపెట్టి, మా వరాల పుత్రుడు జన్మించే శుభ సమయం కోసం ఎదురుచూస్తుంటాను!’’ అని వూహలలో తేలిపోతూ ముందుకు సాగాడు రంభుడు!
***
‘‘ఈ ప్రాంతం ఎంత రమణీయంగా కన్నుల పండుగ చేస్తున్నదో! పచ్చని పచ్చిక బీడులు, పూల మొక్కలతో మనస్సుకు హాయి కలిగిస్తున్నది! కాసేపిక్కడ విశ్రమించి వెళ్తాను!’’ అరణ్యమార్గంలో సాగిపోతున్న రంభుడు మధ్యలో కనిపించిన పచ్చని పరిసరాలు చూసి ముగ్ధుడై ఆగి చుట్టూ చూశాడు. అతని దృష్టిని కొద్ది దూరంలో పచ్చికమేస్తూ తిరుగుతున్న మహిషాలు ఆకర్షించాయి. వాటిలో తనవైపు చూసిన ఒక మహిషి మీద రంభని మనస్సు లగ్నమైంది! అప్రయత్నంగా దానివైపు అడుగులు వేశాడు!
***
‘‘హ.. హ.. హ! హ..హ..హ!’’ పెద్దగా నవ్వుకుంటున్న ఇంద్రుని సమీపించి ‘‘ఏమిటి అంతగా నవ్వుకుంటున్నావు ఇంద్రా? ఎవరి తపస్సు భంగం కావించావు?’’ అడిగాడు నారద మహర్షి! ‘‘సమయానికి దయచేశారు మునీంద్రా! రంభ కరంభులనే దానవులవల్ల నాకు ప్రమాదం ఉందని ఇంతకుపూర్వం వచ్చినపుడు చెప్పారు గదా! ఆ ఇద్దరినీ అంతం కావించాను! రంభుడు వరుణునివల్ల వరం పొందినా ఉపాయంతో అతడిని అంతం చేశాను! తనలోకం చేరి పత్నిని చేరకుండానే మార్గంలో ఒక మహిషిమీద మోహం కలిగించి దానితో సుఖిస్తూ గడిపేలా చేశాను! మహిష రూపంలో ఆ మహిషితో సుఖిస్తున్న ఆ దానవుడిని మరో మహిష ఎదుర్కొని వాడి కొమ్ములతో చీల్చి చంపివేసింది! ఇక అతనికి పుత్రుడు కలిగే అవకాశం లేదు గదా నారదా! అది తలచుకునే నవ్వుతున్నాను’’ అన్నాడు ఇంద్రుడు, తాను చేసిన ఘనకార్యానికి తానే ఆనందిసూ ‘‘ఆ! ఆ! అంతవరకు బాగానే వుంది గానీ తరువాత జరిగింది నేను చెబుతాను విను!

-ఇంకా ఉంది