భక్తి కథలు

కాశీ ఖండం..38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆతర్వాత తీర్థయాత్రా పరాయణుడు అయి, ఇల్లు బయల్వెడలి, రెండు మూడు పయనాలు చేసి మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు నీడను బడలికను తీర్చుకోవడం కొరకు విశ్రమించి, పిమ్మట అంతరంగంలో ఈ కరణి పరి పరివిధాలుగా విత్కరించాడు.
‘‘మానవుల ఆయుర్దాయం ఏనుగు చెవి అంచులాగు మిక్కిలి చంచలం, ఆత్మ శరత్కాల మేఘమాలలోని మెరుపు వడువున విలోలం అయినది. వనాల నీటి అలల కరణి అస్థిరాలు, నేల నాలుగు చెరగులందూ వున్న తీర్థాలు అన్నిటినీ సేవించడం సాధ్యమా? అయినా నేను ముక్తికారణాలైన సప్తపురాలనూ మొదట వీక్షిస్తాను.
సప్తపురీ ప్రశంస
అవంతి లేక ఉజ్జయిని, కాశి, మాయ, అయోధ్య, కాంచి, మధుర, ద్వారక అనే సప్తపురాలున్ను మహితమైన మోక్ష సంపదకి నిలయాలై కీర్తి సంపదను వహిస్తాయి అని నిశ్చయించుకొని
సాకేతం లేక అయోధ్యకు ఏగి సరయూ నదిలో స్నానం ఒనరించాడు. నలుపు తెలుపూ రంగుల యమునా గంగానదుల సంగమస్థానం అయిన ప్రయాగ తీర్థంలో దేహాన్ని ముంచాడు. గంగానదిలో వున్న మణికర్ణికాఘట్టంలో సంకల్ప పూర్వకంగా క్రుంకుపెట్టాడు. ముక్తి కల్యాణానికి ఘంటాపథం అయిన ఆనందకాననాన్ని లేక కాశీతీర్థాన్ని ఆశ్రయించాడు. పవిత్ర చారనిరతుడయిన ఆ శివకర్మ తీర్థదైవతాలని ప్రార్థించాడు. అఖిల తీర్థంగాలనూ ఆచరించి, ఆయా పుణ్యతీర్థాలలో వెలసిన శ్రీమన్మహాదేవుణ్ణి కొలిచాడు.
బ్రహ్మలోకసౌధానికి నిచ్చెనవంటిదిన్నీ, సంసార భీతికి అభయహస్తమున్ను, కలుషకంఠచ్ఛేదానికి నిశిత ఖడ్గమున్ను, కైవల్యానికి కట్టాణిముత్యమున్ను, మహర్షి వాసిత తీర భూమిన్నీ, నయనోత్సవానికి మంచి గంథపు పూతయున్ను, మనఃప్రసాదలక్ష్మి విహరించే స్థలమున్ను కల్పాంతకాలందాకా వున్న పురాణియున్ను, పరమ శుభప్రదయున్ను, త్రివేణులు- సరస్వతీ గంగా యమునా తరంగిణులు కలదిన్నీ, చంద్రకళాధరుడి గారాబు పట్టమహిషి అయిన కాశిని సత్యవాక్కు అయిన ఆ శివవర్మ మిక్కిలి వేడ్కతో తేలియాడి కైవల్య శుభపరంపరని ఆలంబము చేసుకొన్నాడు.
పుణ్య సంపాదనా కాంక్షి అయి ఆ విప్ర పుంగవుడు శివశర్మ సకల తీర్థములనూ సేవించి పుణ్యలక్ష్ములను చూరగొన్నాడు. విశేషించి గంగా ప్రయాగ తీర్థంలో అధిక నియతితో మునుగసాగాడు.
రవి మకర రాశిలో ప్రవేశించిన పుణ్యకాలంలో తెల్లవారగట్ల ప్రయాగలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహ ఏతెంచి తీర్థస్నానం ఆచరించాడు. గోమాతృకలు గోలోకం నుంచి చనుదెంచి నిశ్చల బుద్ధితో తీర్థం ఆడుతారు. కాశీపురం నుంచి నీలకంఠుడు దిన దినమూ ఏంతెంచి క్రుంకులిడతాడు. క్రమంగా అష్టదిక్కుల నుంచి అష్టదిక్పాలకులు అరుగుదెంచి తీర్థమాడుతారు. నిర్జరులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, మునులు, గరుడులు, యక్షులు, కిన్నరులు, రాక్షసులు, పిశాచములు, భూతాలు ఏతెంచి స్నానమాచరిస్తారు.
అది ప్రయాగా క్షేత్రం బ్రహ్మక్షేత్రం. యాగాలకన్నా ప్రృష్టం అవడంవల్ల ఆ క్షేత్రానికి ప్రయాగ ఆజ్య సార్థకమై చెల్లుతుంది. సూర్యుడు మకరరాశిలో వుండగా మాఖమాసంలో ఇంద్ర నీలమణి శకలాలా అనేటట్లు నల్లని యమునా జలాలతో కలిసి తెల్లని గంగా జలాలు కలిసి సితాసితవర్ణాలతో ఆ మహాతీర్థరాజం ముక్తి లక్ష్మి కరుణా కఠాక్షం మాదిరిగానే వుంటుంది. ఆ మహాతీర్థరాజంలో క్రుంకులాడి శివశర్మ ధన్యుడయాడు.
శివశర్మ కాశీక్షేత్రానికి ఏతెంచుతాడు. మరల ప్రయాగకి ఏగుతాడు. తిరిగి కాశీకి చనుదెంచుతాడు.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి