భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యప్ప పర్యవేక్షణలో క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి! సైనికులలో తిరిగి క్రమశిక్షణ నెలకొన్నది! అంతవరకు ఉదయనుడి ప్రతినిధులకు భయపడుతూ వాళ్లకు సేవలు చేస్తూ బ్రతుకుతున్న ప్రజలలో అయ్యప్ప రాకతో ధైర్యం, ఉత్సాహం చోటుచేసుకున్నాయి! ‘‘మనం ఎదురుచూస్తున్న మన దైవం అయ్యప్ప తిరిగి అవతరించి మన మధ్యకు వచ్చాడు! ఇక ఉదయనుడి అంతం దగ్గరపడినట్లే’’ అని సంతోషపడుతూ అయ్యప్పకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన నేతృత్వంలో అందరూ మంచి పౌరులుగా మసలుకోసాగారు!
దృఢకాయులైన యువకులను సైన్యంలో చేర్చుకుని తగిన శిక్షణ ఇప్పించి సైన్యాన్ని బలవత్తరం కావించాడు! అయ్యప్ప రాకతో రాజ్యంలో దుర్భిక్షం అరాచకం స్థానే సుఖ శాంతులు నెలకొన్నాయి. ప్రజలందరిలో అయ్యప్ప పాలనలో ఉదయనుడి ప్రతినిధులు కూడా మనస్సులు మారి అయ్యప్ప సేవలో క్రమశిక్షణ పాటిస్తూ మసలుకోసాగారు!
****
పందల రాజ్యంలో పరిస్థితులు సరిదిద్దుతున్న అయ్యప్ప మరొక ప్రమాదకరమైన సముద్రపు దొంగను ఎదుర్కొనవలసి వచ్చింది.
ఆ దొంగ పేరు వావరు! మంత్ర తంత్రాల్లో ఆరితేరినవాడు!
‘‘నాయనా! సముద్ర దొంగ వావర్ ఉదయనుడికన్నా బలవంతుడు! మంత్ర తంత్రాలు తెలిసినవాడు! కాలభైరవోపాసకుడు! సముద్రం మీద ప్రయాణించే వర్తకుల ఓడలను అడ్డగించి వాటిని కొల్లగొడుతూండే వావరు దృష్టి ఇప్పుడు తీర ప్రాంత రాజ్యాలమీద పడిందట! తన సేనతో తీర ప్రాంతాలపై దాడులు చేస్తున్నాడు! ఇటువైపునకు ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును! అతడిని ఎదిరించడం మన సేనలవల్ల కాకపోవచ్చు! అంటూ రణతుంగుడు తెచ్చిన ఆ వార్త విని చిన్నగా నవ్వాడు అయ్యప్ప!
‘‘మనసేనంతా ఎందుకు? నీవు, నేను చాలమా?’’ అడిగాడు హాస్య ధోరణిలో! రణతుంగుడు ఆందోళనగా చూశాడు!
‘‘నాయకా! వావరు శక్తి సామర్థ్యాల గూర్చి తెలిసి వున్నవాడిని గనుక మీకు చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. తన మంత్ర బలంతో ఎదుటి పక్షంవారిని పక్షులుగా, జంతువులుగా మార్చేసి వాటితో వినోదిస్తుంటాడు! కొందరి తలలు నరికి తాను ఉపాసించే కాలభైరవుడికి బలిగా సమర్పిస్తాడు! రక్తం నివేదన చేసి ఆ రక్తాన్ని పాత్రలనిండా తాను త్రాగేసేంతటి కఠినాత్ముడు! ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాయకా!’’ అంటూ రణతుంగుడు చేసిన హెచ్చరిక ఏమార్పూ తేలేదు అయ్యప్పలో!
‘‘కాలభైరవుడంటే కాశీ పట్టణాన్ని కాపాడుతుండేవాడు, ఏకాదశ రుద్రులలో ఒకడు! ఆ స్వామి భక్తుడిని చూడాలన్న కోరిక నాలో మరింత దృఢమైంది గానీ, భయంతో వెనుకంజ వేయాలనిపించడంలేదు! రేపే మనం బయలుదేరుతున్నాం’’ అంటూ సభను చాలించి లేచాడు అయ్యప్ప!
కాలభైరవ స్తోత్రం
‘దేవరాజ సేవ్యమాన పాదనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం!
నారదాది యోగి బృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజేహం!
భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీలకంఠ మీప్యితార్థ దాయకంత్రి లోచనం
కాలకాల మంబుజాక్ష మస్త శూన్యమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజేహం!
ప్రతిరోజూలాగే నిలువెత్తు కాలభైరవుని విగ్రహానికి పూజాదికాలు నిర్వర్తిస్తున్నాడు సముద్ర దొంగ వావరు! ఇతరులను చంపి వారి ధనపురాశులను దోచుకోవడం వృత్తి అయిన వావరు కాలభైరవుని ఉపాసన మాత్రం భక్తితో నిష్ఠగా జరుపుతాడు! పూజ చేస్తున్నంతసేపు ఇతరపు ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు! తాంత్రిక పూజ కావిస్తాడు! పూజానంతరం తన మామూలు కార్యక్రమాలలో ప్రవేశిస్తాడు!
ఆ రోజు పంబల రాజ్య తీరం వైపు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకుని అందుకు సిద్ధవౌతున్నాడు వావర్!
అంతలో..
‘‘వత్సా! ఈవేళ నీవు వెళ్లవలసిన అవసరం లేకుండా నీ దగ్గరకే ఒక వ్యక్తి రాబోతున్నాడు! అతని రాకతో నీ జీవన విధానమే మారిపోతుంది! వేచి వుండు!’’ అన్న అశరీరవాణి పలుకులు వినరావడంతో ఆశ్చర్యంగా ఆలోచనామగ్నుడైనాడు వావరు!
‘‘ఆ పలుకులు తను ఉపాసించే కాలభైరవునివే! ఎవరి విషయంగా తనను సావధాన పరుస్తున్నాడు? ఎవరా వస్తున్న వ్యక్తి? అనుకుంటుండగానే భటుడొకడు పరుగు పరుగునవచ్చాడు!
‘‘నాయకా! మన స్థావరం వైపు ఎవరో గజారూఢుడైన వ్యక్తి వస్తున్నాడు! అతనిని ఆపడం మనవాళ్ళ సాధ్యం కాలేదుట!’’ అంటూ భటుడు తెచ్చిన వర్తమానం విని కనుబొమ్మలు ముడివడగా ‘‘ఎవరింతటి సాహసం చేసి మన స్థావరంలోకి ప్రవేశించారు? వెంటనే నా రథాన్ని సిద్ధం చేయండి’’ అంటూ లేచి బయటకు వచ్చాడు వావరు!
రథం కొద్ది దూరం వెళ్లగానే మందగమనంతో సాగివస్తున్న తెల్లని ఏనుగు మీద ఆసీనుడై వస్తున్న అయ్యప్ప దర్శనమిచ్చాడు! ఆవైపే చూస్తూ వుండిపోయాడు వావరు తనను తానే మరిచి!
‘ఆహా! ఎంతటి దివ్య మంగళరూపం! కరుణ ఆ కళ్ళలోనుండి జాలువారుతున్నది! చిరునవ్వుతో తనవైపే చూస్తున్న ఆ కళ్లు నన్ను గుర్తించలేదా? అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి! సందేహం లేదు!

-ఇంకా ఉంది