భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలభైరవస్వామి తనను సావధానపరిచింది ఈ దివ్య మంగళ మూర్తి గురించే! చూస్తుంటే అతనికి నా సర్వస్వాన్ని అర్పించివేయాలనిపిస్తున్నది! దొంగతనాలు, దోపిడీలు ఏవీ వద్దు! వెళ్లి ఆ దివ్య పురుషుని పాదాలనాశ్రయిస్తాను! అనుకుంటూ రథం దిగి ఎదురువెళ్లాడు ముకుళిత హస్తాలతో!
‘‘నామీద దయతో నా గృహానికి వచ్చిన దివ్య పురుషా! నీకు నా సాదర ప్రణామాలు! నీ దర్శనంతో నేను ధన్యుడినైనాను! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను! స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో’’ అంటూ తదేకంగా స్వామి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు!
‘‘యుద్ధంలో నిపుణుడివని విన్నాను! నాతో తలపడకుండా శరణు కోరుతున్నావే! నేనెవరినో గుర్తెరిగావా?’’ చిరునవ్వుతో అడిగాడు అయ్యప్ప ఏనుగుమీద నుండి దిగుతూ!
‘‘పంబల రాజకుమారుడిగా నిన్ను గుర్తించాను! ఆ రాజ్యాన్ని ఉదయనుడి పాలననుండి విడుదల చేసి సైన్యాలను సమీకరించి అతనిపై యుద్ధం ప్రకటించబోతున్నావని విన్నాను! అందుకే ముందుగా నీ రాజ్యంవైపే రావాలని నిశ్చయించుకున్నాను గానీ నీవే నన్ను కలుసుకోవడానికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది! నీవు సామాన్యుడవు కావని, కారణజన్ముడివని గ్రహించాను! ఓ దివ్య ప్రభావ సంపన్నుడా! నీతో యుద్ధాన్ని కాదు మిత్రత్వాన్ని వాంఛిస్తున్నాను’’ అన్నాడు వావరు భక్తిపూరితమైన హృదయంతో!
సాదరంగా అతని చేయందుకుని భుజంమీద తట్టాడు అయ్యప్ప!
‘‘అలాగా! ఇకపై నీవు నా మంచి మిత్రునిగా నాతోనే ఉండవచ్చును!
నీవు పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ బాధ్యత అప్పగించాడు అయ్యప్ప!
‘‘అలనాడు మహిషిని సంహరించడానికి అవతరించిన అయ్యప్ప నేడు కలి ప్రభావంతో విజృంభించిన దుష్టులను అంతం కావించడానికి తిరిగి మన మధ్యకు రావడం మన భాగ్య విశేషం! అయ్యప్పకు, వారి మిత్రులకు పాండ్యరాజ్యం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది!’’
మిత్రులతో సభాప్రవేశం చేసిన అయ్యప్పకు పుష్పమాల వేసి సాదరంగా ఉచితాసనంమీద ఆసీనుడిని కావించి అతిథి సత్కారాలు జరిపాడు పాండ్యరాజు వీరపాండ్యుడు!
వావరును మిత్రునిగా చేసుకున్న అయ్యప్ప కొచ్చుకడత్త, కరప్ప, విల్లన్, మల్లన్ అనే బలశాలులైన మరి నలుగురు దుండగులను తన ప్రభావంతో మంచివారిగా మార్చి తనమిత్రులుగా చేసుకున్నాడు! వారు కూడా అయ్యప్ప సైన్యంలో చేరి సైనికులకు తగిన శిక్షణ ఇచ్చే బాధ్యత స్వీకరించారు. ఉదయనుడు తప్ప సముద్రపు దొంగ వావరు, ఇతరులు అయ్యప్పకు మిత్రులవడం పంబల రాజ్యానికి పొరుగునవున్న పాండ్యరాజు వీరపాండ్యుడు విని తాను కూడా అయ్యప్పతో స్నేహ బాంధవ్యాలు పెట్టుకోవాలని ఆశించాడు! అతని ఆశయం నెరవేర్చడానికన్నట్లుగా మిత్రులు వెంటరాగా పాండ్యరాజ్యానికి వచ్చాడు అయ్యప్ప! తన కోరిక నెరవేడంతో ఆనందోత్సాహాలు చోటుచేసుకున్నాయి పాండ్య రాజులో! అందుకే అయ్యప్పకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకావించాడు!
‘‘పాండ్యరాజా! మీ ఆదరానికి, అభిమానానికి కృతజ్ఞులం! ప్రస్తుతం నేను ఉదయనుడిని ఎదుర్కొనడానికి వెళ్లనున్నాను! మీరు మీ సేనాసమేతంగా మా వెంట రావచ్చును!’’ అని చెప్పాడు అయ్యప్ప!
‘‘తప్పకుండా! మా కోరికా అదే! ఇంతకుక్రితం అతని చేతిలో అపజయం చవి చూసినా ఇప్పుడు మీవెంట వచ్చి మా శాయశక్తులా పోరాడి అతడిని ఓడించాలని కోరుకుంటున్నాము! మాకూ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞులం!’’ ఉత్సాహంగా సేనతో అయ్యప్ప వెంట బయలుదేరాడు వీరపాండ్యుడు!
దండయాత్ర ప్రారంభమైంది! జయభేరి మ్రోగించి ఉదయనుని స్థావరాన్ని చుట్టుముట్టాయి అయ్యప్ప సేనలు, పాండ్య సేనలు!
‘‘నాకు స్నేహితులు కావలసిన సముద్ర దొంగ వావరు, మరికొందరు ఆ అయ్యప్పకు మిత్రులైపోయి నామీదే దండెత్తి వస్తున్నారా? వాళ్లందరినీ నా కత్తికి బలి యిస్తాను! ఈ ఉదయనుడి శక్తి ఏమిటో తెలిసేలా చేస్తాను!’’ అని కోపంతో పళ్లు పటపటలాడిస్తూ తన సేనలతో వాళ్ళను ఎదుర్కొన్నాడు ఉదయనుడు!
‘‘పిరికిపందలారా! నన్ను శరణనకుండా ఆ రాకుమారుడి వెనుక నిలబడ్డారా? ఇప్పుడే నా కత్తికి బలి ఇస్తాను, చూడండి’’ తన కళ్లకు సామాన్య రాకుమారుడిలాగా కనిపిస్తున్న అయ్యప్ప వైపు తేలికగా చూస్తూ అతని వైపు దూసుకువెళ్లాడు!
‘‘నీ ముచ్చట తీరుస్తాను! రా కత్తితో కాదుగా నీ ద్వంద్వ యుద్ధానికి వస్తావా?’’ అని కవ్విస్తూ ఏ ఆయుధం లేకుండా ఉదయనుడిని ఎదుర్కొన్నాడు అయ్యప్ప!
ఇద్దరిమధ్యా కొంతసేపు తీవ్రంగా జరిగింది ద్వంద్వ యుద్ధం! అందరూ ఆందోళనగా చూడసాగారు!
‘‘నాయకా! వాడిని కరుణించవద్దు!’’ అంటూ హెచ్చరించారు మిత్రులందరూ! వాళ్ళ వైపు చిరునవ్వుతో చూసి ‘‘మీరందరూ చెబుతున్నారు గనక ఈ లీలా వినోదాన్ని ఇక చాలిస్తాను!’’ అంటూ ఉదయనుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిర త్రిప్పి పైకి విసిరేశాడు! రక్తం కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందపడ్డ అతని శరీరంమీద నిలిచి తాండవం చేసాడు! ఆ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిలిచి చూస్తున్న వాళ్లందరికీ అయ్యప్పలో మహిషి మర్దవం కావిస్తున్న మణికంఠుడు దర్శనమిచ్చాడు!

-ఇంకా ఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం