భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘స్వామియే శరణం అయ్యప్పా!’’ అంటూ ముక్తకంఠంతో స్తుతించారు!
‘‘అయ్యప్పా! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని, ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం? తండ్రీ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి!’’ అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ!
‘‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి! మీకు సన్మార్గాన్ని చూపడానికి, కలి పురుషునీ, శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది, గుర్తుంచుకోండి’’ అని చెప్పాడు మేఘ గంభీరస్వరంతో!
అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు!
అయ్యప్ప లేచి ‘‘సెలవు భక్తులారా!’’ అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు! ఒక దివ్య జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది! ‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా ‘స్వామియే శరణం అయ్యప్ప! శరణం అయ్యప్పా! మా నమ్మకం నిజమని నిరూపించావు! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు! నీకు కోటి కోటి ప్రణామాలు!’’ అంటూ నమస్కరించారు!
అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం!
స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)-
అభిషేకాలు - వాటి ఫలితాలు
పాలాభిషేకం - యశోవృద్ధి
పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం, మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
తేనె అభిషేకం - సిరిసంపదలు, తరగని ఐశ్వర్యం కలుగుతాయి
చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
పంచామృత అభిషేకం (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్త్భివం మనస్సులో స్థిరవౌతాయి!
ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి!
గంథంతో అభిషేకం - పుత్రలాభం, స్వర్గ్భోగాలు లభిస్తాయి
భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి, ఆరోగ్యాభివృద్ధి
సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి, శతృవులపై విజయం
శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి, సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం, పాపనివృత్తి లభిస్తాయి.
నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ, శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
అయ్యప్పస్వామి భజన
పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే-
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వమికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా- అయ్యప్పా స్వామియే!!
భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ- మంగళ హారతి గానం చేశారు!

-ఇంకా ఉంది