భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీబాయి, నేను మీ వెనుకనే వచ్చాను. నేను లోపలికి వచ్చేసరికి బాబా కూర్చుని ఉన్నారు. నాకు అనిపించింది. ఇప్పుడు లేరుకదా అప్పుడే ఎలా లోపలికి వచ్చారా అని. కాని నేను అంతగా అనుకోలేదు అంది.
నాకు ఇదేమి అర్థం కావడంలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వెంకన్న.
నందరామ్ అంతా విని ఏమీ లేదులే వెంకన్న మనం అనుకున్నట్టు ఈ బాబా సామన్యులు కారు. ఆయన దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి. అందరికీ ఆయన కనబడరు. ఆయన చూడాలి అనుకుంటేనే దర్శనం ఇస్తారు. మనమీద ఆయనకు దయ ఉంది. అందుకే మనతోనే ఉన్నారు. ఆయనెవరో ఆయన్ను చూడకూడదని బాబా అనుకున్నట్టు ఉన్నారు. అలా కన్ను తప్పించి వెళ్లి ఉంటారులే. అంతగా ఆలోచించకు అన్నాడు నందరామ్.
నిజమే ఏమో నందరామ్ నేను బాబా దగ్గరకు వెళ్తాను అని చెప్పి వెళ్లాడు వెంకన్న.
***
ఒకరోజు ఎప్పటిలాగే బాబా పూలుకోసుకోవడానికి వెళ్తున్నారు. అంతలోనే ఈ సంఘటన.
‘‘ఏయ్ బాబా నువ్వు ఎవరు? అందరూ నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు. నీవలన నా దగ్గరకు వచ్చి తాయెత్తులు కట్టించుకునేవారు రావడంలేదు’’ అన్నాడు మొహుద్దీన్.
నాకు ఏమి తెలుసు మొహిద్దీన్ అన్నాడు బాబా.
కాని ఆ మొహుద్దీన్ అంతటితో ఊరుకోలేదు. ఇంకా ముందుకు వచ్చాడు.
ఇదంతా నాకు తెలీదు. నీవల్లే నా మహిమను గుర్తించడంలేదు వీళ్లు. వీళ్లనంతా నీవు మాయ చేస్తున్నావు. నేను చూస్తూ ఊరుకోను ఏమనుకున్నావో అన్నాడు మొహిద్దీన్.
అక్కడకు చేరిన తాత్య, మహిల్సాపతి వీరంతా మొహద్దీన్, దీనికి బాబా ఏం చేస్తారు. ఆయన ఎప్పుడూ ఎవరికీ తాయెత్తు ఇవ్వగా మేము చూడలేదు. ఆ పని నీవే చేస్తున్నావు. ఒక్కనాడైనా బాబా నీ గురించి మాతో ఏం చెప్పలేదు. నీవెందుకు అనవసరంగా కయ్యానికి దిగుతున్నావు అన్నారు.
కాని మొహుద్దీన్ మీకు ఏమీ తెలియదు. అసలు ఈ బాబా నాకన్నా చాలా తక్కువవాడు. నా దగ్గర ఉన్నన్ని శక్తులు ఈయన దగ్గర ఏమీ లేవు. కావాలంటే నాతో పోటీకి రమ్మనండి, చూస్తాను. ఆయన ఎక్కువ నేను ఎక్కువో నిరూపిస్తాను అన్నాడు.
బాబా నేను నీతో ఏ విధమైన పోటీకి రాను. నీవే నాకన్నా చాలా ఎక్కువ. నాతో నీకేమి భయమక్కర్లేదు. ఎప్పటిలాగా ప్రజలందరూ నీ దగ్గర తాయెత్తులు తీసుకుంటారు. కాని వారిని నీవు మోసం చేయకు అన్నారు.
అదేంటి నేను మోసం చేసేవాడిలాగా కనిపిస్తున్నానా. చూడు నా తడాఖా చూపిస్తాను అంటూ కుస్తీ పోటీకి నీవు రావాల్సిందే. అదీ ఇప్పుడే రావాలి అంటూ బాబాపైకి వచ్చాడు. ఇక చేసేది ఏమీ లేక బాబా కూడా ఆ తంబూలి మొహుద్దీన్‌తో తలపడ్డాడు. కాని బాబా ఓడిపోయాడు.
చూశారా నా బలమెంతో నీకు తెలిసింది కదా. ఇక ఈ శిరీడీలో నేను ఉంటాను. మీరు ఉండడానికి వీల్లేదు. కావాలంటే ఇక్కడనుంచి వెళ్లి లిండి ఒడ్డున ఉండండి. నేను దయ తలుస్తున్నాను అన్నాడు మొహుద్దీన్.
సరే అలానే నువ్వు ఏమి చేయమంటే నేను అలానే చేస్తాను. నీవే నాకన్నా గొప్పవాడివి. అయినా నాలో ఏమి గొప్పతనం ఉంది. నేను ఎప్పుడైనా గొప్పవాడినని ఎవరితోనైనా చెప్పడం నీవు చూశావా, విన్నావా. అయినా ఈ గర్వం మానుకుంటే భగవంతుడు మెచ్చుతాడు నిన్ను అన్నాడు బాబా.
అది నీవు మాకు చెప్పక్కర్లేదు. ఇప్పటినుంచి ఈ ప్రజలందరి బాగోగులు నేను చూస్తాను అని అన్నాడు.
ఇక అప్పటినుం బాబా లిండి తీరంలో ఉన్న చెట్ల తోపుల మధ్య ఉండసాగాడు.
మహిల్సాపతి, హేమాదిపంతు, తాత్యా వీరంతా బాబా దగ్గరకు వెళ్లి ఆ పిచ్చి మొహుద్దీన్ అన్నాడని మీరు ఇక్కడ ఉండడం ఏమిటి బాబా, శిరిడీలోకి రండి ఎప్పటిలాగా మీరు మసీదులోనే ఉండండి అని చాలాసార్లు పిలిచారు. కాని బాబా వీరిమాటలేవీ వినలేదు. పైగా ఎక్కడ ఉంటే ఏముంది. నేను చేయవలసింది చేస్తే చాలు కదా. మీరంతా మీమీ పనులు చేసుకోండి. మీరు ఎప్పుడు తలచుకుంటే నేను మీ దగ్గరకు వస్తాను. దీనికోసం మీరు మొహుద్దీన్‌తో మాట్లాడకండి అని చెప్పేవాడు. ఇలా ఉంటుండగా-
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743