భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనినంతా చూస్తున్న ప్రజలు బాబాలో ఎంతో ఓర్పు శాంతి గుణాలు ఉన్నాయో కదా అని అనుకొన్నారు. క అప్పట్నుంచి జహ్వర్ గొడవలు లేకుండా వారితో కలిసి మెలిసి ఉండిపోయాడు.
***
దేవీదాసు వేదాంత విషయాలను చెప్పడమే కాకుండా అందరికీ ఆయుర్వేద వైద్యం చేసేవాడు. పక్క గ్రామాలనుంచి కూడా జనం వచ్చి దేవీదాసు దగ్గర మందులు తీసుకొని వెళ్ళేవారు. ఒక్కోసారి దేవీదాసు రోగుల ఇంటికి వెళ్లి వైద్యం చేసేవాడు.
అలాంటి ఒకరోజు ఓ ధనవంతుని ఇంటినుంచి వస్తున్న దేవీదాసును బాబా చూశారు. ‘‘దేవీ.. నీవు ఇక ఎవరింటికి వెళ్లకు అనవసరంగా లేనిపోని గొడవలు నిన్ను చుట్టుకునే ప్రమాదం ఉంది’’ అని చెప్పాడు.
‘‘రోగులైన వారే వచ్చి నన్ను బలవంతంగా తీసుకొని వెళ్తారు. బాబా నేనే ఏమీ ఇష్టపడి ఎక్కడికీ వెళ్లను’’ అని చెప్పాడు దేవీదాసు.
‘‘ఈసారి వారు పిలిచినా నీవు వెళ్లకు’’ అని చెప్పి బాబా అక్కడినుంచి వెళ్లిపోయారు.
కాని కొన్ని రోజులకు ఓ రాములమ్మ అనే ధనవంతురాలు శిరిడీ వచ్చింది. దేవీదాసు గురించి తెలుసుకొంది.
ఆ తరువాత తనకు బాగాలేదు వైద్యం చేయాలని దేవిదాసు దగ్గరకు తన నౌఖరును పంపి పిలిపించుకుంది. దేవీదాసు రానని చెప్పినా కూడా బలవంతంగా ఇంటికి పిలిపించుకునేది.
కొన్నాళ్ల తరువాత దేవీదాసును ఇంటికి పిలిచి నేను చెప్పినట్లు నీవు వినకపోతే నీ గురించి చెడు ప్రచారం చేస్తానని దేవీదాసును బెదిరించింది.
అపుడు దేవీదాసుకు ఇంతకుముందు బాబా చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. కాని ఇపుడు చేసేది ఏమీ లేదు. ఈమె అనుకొన్నంత పని చేస్తుంది. ఇక నాకు ఈ బాధ తప్పదు అనుకొని శిరిడీనుంచి ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్లిపోయాడు దేవీదాసు.
ఈ సంగతి తెలుసుకుని జానకీదాసు లాంటివారు మరింత జాగ్రత్తగా సాయి చెప్పిన మాటలు వినసాగారు.
***
సాయి దగ్గర ఎప్పుడూ నలుగురు కూర్చుని మాట్లాడతూ ఉండేవారు. వారి మాటలు వింటూ సాయి కూడా అప్పుడప్పుడూ వారి మాటల్లో భాగం పంచుకుంటూ వుండేవారు.
అట్లానే ఓ రోజు-
మహిల్సాపతి, హేమాదిపంతు కూర్చుని మాట్లాడుకునేటపుడు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను రాగానే సాయిబాబాకు నమస్కరించాడు. బాబా అతనిని చూడనట్లే కూర్చుని ఉన్నాడు. అతడు ఏం చేయాలో తెలియనట్టుగా అటు ఇటు చూశాడు. ఆ తరువాత వచ్చి వీరి దగ్గర కూర్చున్నాడు. మనసులో ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.
అతడిని పలుకరిద్దామని అనుకొని మహిల్సాపతి ఆయనవంక చూశాడు. కాని ఆయనేమో కళ్లు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటే వీరు ఊరక చూస్తూ కూర్చున్నారు.
కొద్దిసేపటికి అతడు కళ్లు తెరిచి బాబాను చూశాడు. అప్పుడు కూడా బాబా నవ్వుతూ చూస్తున్నారు కాని వచ్చిన కొత్త వ్యక్తివైపు చూడనే చూడటంలేదు. అతడు హేమాదిపంతు వైపు తిరిగి ఇక్కడ ఇంకా ఏమేమి చూడదగిన ప్రదేశాలున్నాయి అని అడిగాడు.
అతడు ఏదో చెప్పబోయేంతలో అసలు మనం ఇక్కడకు ఎక్కడనుంచి వచ్చామో చెప్పుకోవాలి కదా అన్నాడు బాబా.
వచ్చిన అతని గురించి చెబుతున్నాడులా ఉంది అనుకొన్నారు హేమాదిపంతు వాళ్ళు. కాని వాళ్లు జవాబేమివ్వాలో తెలియక ఊరక కూర్చున్నారు.
మళ్లీ కొద్దిసేపటికే బాబా ‘దున్నపోతునెక్కి నానాఘాట్ వెళ్లాలనుకొంటే అక్కడ ఉన్న పర్వత కనుమను దాటాల్సి వచ్చింది. అబ్బా అట్లా దున్నపోతునెక్కి ప్రయాణం చేసేసరికి నా ఒళ్లంతా హూనమైంది. ఏం చేయను. మా గురువుగారు ఏమో నాకు నిశ్చలదాసు వ్రాసిన ‘విచార సాగరం’ అన్న గ్రంథాన్ని చదవమని చెప్పారు. నేను చదవాలనే అనుకొన్నాను. కానీ నాకా గ్రంథం ఇంకా దొరకలేదు. నేను చదవాలనే ఇప్పుడు కూడా అనుకొంటున్నాను. నాకు మాత్రం అంతా అప్పా చెప్పినట్లే జరుగుతోంది. ఇక్కడకు వచ్చేముందే ఈ శిరీడీ గురించి చాలామంది నాకు చెప్పారు’’ అన్నారు.
ఇది విన్న హేమాదిపంతుకు, మహిల్సాపతికి ఏమీ అర్థం కాలేదు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743