భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిల్సాపతి‘‘అట్లా ఏమీ బాధపడకు నానా! బాబా భూత వర్తమాన భవిష్యత్తులు తెలిసున్నవారు కదా. ఎపుడు ఏమీ జరుగుతుందో నని నీకు ముందు జాగ్రత్తగా చెప్పారేమో. అదీకాక ఒక్కోసారి బాబా ఇంకెవరికైనా చెప్పాలని అనుకొన్నా ఆ విషయానే్న ఎదుటి వాళ్లకు చెబుతూ ఉంటారు. దీని గురించి అంతగా ఆలోచించకు ’అని అన్నాడు.
ఆ తర్వాత నానా బొంబాయి వెళ్లిపోయాడు. రోజులు సాఫీగా జరిగిపోతున్నాయి.
ఆరునెలల తరువాత మళ్లీ నానా వచ్చాడు. అపుడు అక్కడ మహిల్సాపతి, కుశాభావు, శ్యామా, లక్ష్మీబాయి, హేమాదిపంతు ఇలా చాలామంది బాబాభక్తులు కూర్చుని ఉన్నారు.
నానా రాగానే బాబా కాళ్లమీద పడి నమస్కారం చేశాడు.
‘‘బాబా బాగున్నారా’’అని అడిగాడు. బాబా నేను బొంబాయినుంచి కమలాలు మీకోసం తెచ్చాను తీసుకోండి ’’ అని రెండు గంపలనిండా కమలాపండ్లు పెట్టాడు. బాబా అక్కడ నుంచి దూరంగా వెళ్లారు. కాని ఆ పండ్లను కనె్నత్తి కూడా చూడలేదు.
చాలా సేపు అందరూ వౌనంగా కూర్చుని ఉన్నారు.
కాసేపటికి బాబా వచ్చి ‘‘మహీ! కాసిని అరటిపండ్లు తీసుకొని వచ్చి వీరందరికీ ప్రసాదంగా ఇవ్వచ్చు కదా’’అన్నారు.
వెంటనే ‘‘అదేంటి బాబా! నేను మీరు అందరికీ ప్రసాదంగా ఇస్తారనే నేను ఈ పండ్లు తెచ్చాను. వీటిని ఇవ్వకుండా మళ్లీ తెప్పిస్తారని అంటున్నారే’’అన్నాడు నానా.
బాబా దానికి సమాధానం ఇవ్వకుండానే ‘‘ఏమి మహీ నువ్వు తెస్తావా లేక నన్ను వెళ్లి తెచ్చుకోమంటావా’’అన్నారు.
‘‘బాబా నీవు నన్ను ఎందుకు చూడడం లేదు. నాతో ఎందుకు మాట్లాడడం లేదు. అసలునేను చేసిన తప్పు ఏమిటి నేను ఏదైనా అజ్ఞానంతో తప్పు చేస్తే నీవు నన్ను మందలించవచ్చు కదా. అయినా నేను అన్నీ నీకే చెప్పి చేస్తా కదా. మరి ఈరోజు నాతో ఎందుకు మాట్లాడడం లేదు. నేను తెచ్చినవి నీవు ఎందుకు తీసుకోవడం లేదు’’అని అడిగాడు.
బాబా వౌనంగా కూర్చున్నారు. ఇక ఆగలేక నానా కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుంది కదా. నేను ఇంటికి వస్తే మెడపట్టి బయటకు గెంటేయడం ఎందుకు ’’అన్నాడు బాబా.
‘‘బాబా! మీరు ఏమి చెబుతున్నారు. నేను మీరు వస్తే ఇలా ఇలా చేస్తానా కలలో కూడా అట్లా చేయను. మీరు ఏదో అంటున్నారు అంతే’’అన్నాడు.
‘‘అబద్ధాలు చెబుతున్నానా నేను ఏమి మాట్లాడుతున్నావు. నేను వచ్చినపుడు ఒక రూపాయి ఇచ్చావు కదా. నేను పదిరూపాయలు ఇవ్వమని ఎంత ప్రాథేయ పడ్డాను. కాని నీవు నీ నౌఖరును పంపి నన్ను బయటకు తోయలేదు నిన్న బాగా గుర్తు తెచ్చుకో’’అన్నారు.
ఒక్క నిముషం నానా ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఆ వెంటనే బాబా నేను బయటకు పంపించమని చెప్పింది బిచ్చగత్తెను అన్నాడు.
‘అంటే బిచ్చగత్తె లో పరమాత్మ ఉండడా ’అన్నారు బాబా
‘‘ తప్పు జరిగిపోయింది. ఈసారి నన్ను క్షమించండి బాబా ఇంకెప్పుడు అలా చేయను. ’’అని నానా పదేపదే అడిగారు.
బాబా ‘‘సరే ఇక వదిలేయి. ఎపుడు ఆలోచించి పనిచేయి. నీకు ఏదో వత్తిడి ఉంటే అది ఇతరుల పైన చూపించకు’’అన్నారు.
‘బాబా మీరు నన్ను క్షమించారా.. ఇంక నాతో మాట్లాడుతారా. నేను తెచ్చినవి మీరు తింటారు కదా’ అంటూనే కన్నీళ్లు కారిపోతుండగా ఓ కమలాపండు తొక్కతీసి బాబా నోటికి అందించాడు నానా.
బాబా దాన్ని నోట్లో పెట్టుకుని తింటూనే వేరొక పండు ను తీసి నానా నోటికి అందించారు.
అక్కడి వాళ్లందరూ ఆహా! ఎంత బంధం నానాకు బాబాకు. బాబా మనలను ఎంతగా ప్రేమిస్తారో కదా. మనమూ బాబా పలుకలను ఆచరించాల్సిందే అని ఎవరికి వారు అనుకొన్నారు. అందరూ కలసి బాబా భజన చేసారు.
***

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743