భక్తి కథలు

కాశీ ఖండం..53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు చెప్పిన మాట విని చేస్తున్నాడా? తల్లి దండ్రుల మాట జవదాటకుండా చెప్పిన విధముగా చెయ్యడమే కొడుకుకి ఉత్తమోత్తమ ధర్మం. సుతుడికి ధర్మమన్నా దైవమన్నా అర్థం అన్నా గురువైనా ధనమైనా తల్లిదండ్రులే! జననీ జనకుల్ని కొలువడమే తనయుడికి ముఖ్య ధర్మం. తల్లిదండ్రులను సేవించుటకంటే నందనుడికి అత్యథిక ధర్మం వేరొకటి లేదు.
గర్భంలో నవమాసాలు నిండేదాకా ధరించడం ఏలాగు? దుస్సహము, దుర్భరము అయిన ప్రసవ సమయంలోని ప్రాణ సంకట స్థితిని సహించడం ఏలాగు? దేహం నుంచి బయల్వెడలే మల మూత్రాలలా శే్లష్మాలకి రోయకుండ వుండగల్గడం ఏలాగు? స్తనములు, వ్రేలాడిపోవ స్తన్యాన్ని క్రోలనివ్వడం ఏలాగు? పంచకరపాట్లు పడి పసితనంనుంచీ తన్ను పెంచి, విసిగి ఆపదలనుండి కాపాడి, సాకు తల్లిని దేవత అని ఎంచి కొలిచే కుమారుడి వంశం తామరతంపర అవుతుంది.
ప్రాతస్సమయం కాగానే సుతుడు తల్లి పాదాలకి మ్రొక్కి ఆమె చరణాలు కడిగి, ఆ జలాన్ని ఆపోశనంగా గ్రహిస్తే ఆ సుతుడికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. పవిత్రురాలయిన జనని పాదజలం సర్వ పుణ్యతీర్థ జలాలకంటే అధికం అయినది. ఓ సదాచార పరాయణా! అందరు దేవతలకన్నా సుతుడికి జనయిత్రియే మిన్న! అని వాకొని తదుపరి గృహమేథిని కాంచి ‘‘అన్నా! వైశ్వానరా! చేర రమ్మని పిలిచి, ఒడిలో కూర్చండపెట్టుకొని, కుడి చేయి చూచి హస్త లక్షణంబులు పరిశీలించి, అంతతో ఆగలేదు.
సకల సాముద్రిక శాస్త్ర పరిజ్ఞాతయున్ను, సకల విద్యా విశారదుడున్ను, బ్రహ్మమానస పుత్రుడున్ను అయిన నారద మహర్షి కుంకుమ ద్రవంలో ముంచి తడిపిన సన్నని దారంతో ఆ వైశ్వానరుడి నఖ శిఖ పర్యంతం- అంగాలను (కాళ్లు, చేతులు, తల, కంఠం ఆదులు) కన్ను, చెవి, ముక్కు మొదలైన ఉపాంగాలు, చేతి వ్రేళ్లు, కాలివ్రేళ్లు మొదలైన ప్రత్యంగాలు కొలతలు కొలిచి కొలిచి ఆయా మెడలు తప్పక అరసి అరసి అంగుళకముల కొసలతో పెక్కుమార్లు అంటి అంటి నడిపించి నిలుచుండజేసి కూర్చుండ నియమించి శుభాశుభాలకు ఆలంబాలు అయిన లక్షణాలను నిశ్చయించాడు. ఆ విధంగా ఆయా లక్షణాలు నిర్ణయించి, ఏ మానవుడి శరీరం అడ్డం నిడవులు కొలిచి చూస్తే కొలత చేత నూట యెనిమిది అంగుళాలు వుంటుందో వాడు భాగ్యశాలిన్నీ, సమస్త ధరణీవలయ రాజ్యానికి పట్ట్భాషిక్తుడు కావడానికి యోగ్యుడున్ను అవుతాడు.
పురుషుడు అదృష్టవంతుడు కావాలంటే అతడి నాసిక, కన్నులు, చెక్కిళ్ళు, భుజాలు మోకాళ్ళు పొడవులయి వుండాలి. మెడ, పిక్కలు, మేహనం (మగసరి) పొట్టివి అయి వుండాలి.
నాభి రంధ్రం, నైజం, కంఠస్వరం మూడూ మిక్కిలి గంభీరంగా వుండి వ్రేళ్ళు, చర్మం, మూపుల సంధి ఎముకలు, పాదాలు, గుల్ఫాలు (చీలమండలు), ఈ అయిదున్నూ సూక్ష్మంగా వుంటే అట్టి పురుషుడు అదృష్టనిధి అవుతాడు. కరాలు, పొట్ట, నడుము, మూపులు, నొసలు ముఖం వున్నతాలై వుండాలి. అరచేతి రేఖలు, కంటి చివరలు, జిహ్వ, ఓష్ఠాలు, తాలువులు, నఖాలు ఎర్రనై వుంటే వాడు ధన్యుడు అవుతాడు.
ఓ మహానుభావా! విశ్వానరుడా! ఏ నరుడికి కటిస్థలమూ, రొమ్ము, ఫాలభాగం, విశాలాలు అయి వుంటాయో ఆ నరుడు విభుత్వాన్ని పొందుతాడు. అరికాలు మెత్తగాను, అరచేయి కఠినంగాను వుంటే ఐశ్వర్యం అబ్బుతుంది. ఓ ధన్య చరిత్రా! కనుబొమ్మల మధ్య భాగంలో వట్రువీ అయిన కుడి వైపు సుడి తిరిగిన రేఖ తాల్చి వుంటాడో వాడు ఏకచ్ఛత్రాధిపత్యంగా భూమండల రాజ్యాన్ని పాలిస్తాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి