భక్తి కథలు

కాశీ ఖండం.. 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంతమూ విశుద్ధమైన మనోవృత్తి గల్గిన ఆ గుణనిధి విమల విజ్ఞాన దీపమే ప్రకాశిస్తూ వుండగా శాంతి ధారల జలాలతో జలకం ఆడించి, భావప్రసూనాలతో నిర్మల చిత్తవృత్తితో భవుణ్ణి పూజించాడు.
పయిన పేర్కొన్న కరణి గుణనిధి సజాతీయ విజాతీయ భావాలతో సాంతత్యానువర్తన రూపం అయిన నిధిధ్యాసస్థితిలో గాలి లేక అల్లాడని దీపం బాగున పెద్దకాలం నీలకంఠుడి శుభంకర జ్యోతిర్లింగాన్ని అంతరంగాన ఆలింగనం కావించుకొని వుండ శంకరుడు ప్రసన్నుడై ‘‘వత్సా! వరం ఒసగుతాను వేడుకోవలసింది’’ అని అనుగ్రహించాడు. అరమూతలు పడ్డ కనుదోయి తెరచి గుణనిధి వీక్షించాడు. అంత నూరు వేల కోట్ల సూర్యప్రభా భాసురం అయిన తేజో మండలం మధ్య అహికుండలుడూ, అరుణజటాజూటంలో చెరివికొన్న చంద్రకళాధరుడూ, క్షీరధవళ భస్మాను లిప్తాంగుడూ, దివ్య శరీరుడూ అయిన ఆ దేవతా సమ్రాట్టు అర్థాంగ లక్ష్మి అయిన గిరిజతో కూడి ప్రత్యక్షము అయాడు. ధూమం లేని అగ్నిజ్వాలా దేదీప్యమైన దీప్తి మిరుమిట్లు గొల్పుతూ భయావహం అయి ప్రసరించింది.
అతడి తోచనేంద్రియ శక్తి అంతరించి, అంధుడై అంధకాసురు వైరి అయిన పరమశివుణ్ణి వారం వారం తలవకార ఛాందోగ్య, ఐతరేయ, ముండక, బృహధారణ్యక, శే్వతాశ్వతరాది ఉపనిషత్తులతో పంచబ్రహ్మ మంత్రాలతో, పంచాక్షర మంత్రంతో, ప్రణవకారంతో ఆరాధించాడు. పాలభాగాన అంజలి పుటాన్ని కీలించి, నిర్నిరోధమూ, అగాధమూ అయిన కరుణా పూర్ణాతరంగా! శరణు. సకల దేవతల మకుటమణి కిరణ రోచిఃప్రకాశిత చరణా నీకు శరణు. వేదాంత విద్యలనే సీమంతినుల సీమంతాల సింధూర పరాగ పాటలములూ, యముడి పండ్లు డుల్లగొట్టడమే అనేక క్రీడలో నిర్దయాలూ అయిన మీ పాద పద్మాలను సందర్శించే సామర్థ్యం నాకు దయసేయవయ్యా! స్వామీ! ఇదే నా కోరు వరం’’ అని ప్రార్థించాడు. అంత శివుడు చిరునవ్వ వెలుగురదనచ్ఛదాల పయి మోసులెత్త గుణనిధికి దివ్య దృష్టిని ప్రసాదించాడు.
దివ్య దృష్టి కలిగిన తొలి చూపునందే శివుడి వామపార్శ్వభాగమున నల్లకలువ పూరేకులలోని కమల కమనీయ కాంతితో, ముత్యాల హారకేయూర నూపుర ప్రముఖ రత్న భూషణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న రూపం కల పదహారేండ్ల ప్రాయం కల ఒక అంగనని ఆ గుణనిధి కనుగొన్నాడు. ఆ సమయంలో పొగడకాయల్ని పురుడీస్తూ వట్రువలయి మెరుగెక్కిన కొత్త ముత్యాల పేరు పయ్యెద లోపల నుంచి కొలదిగా మెరుస్తూ వుండే చెవితమ్మెలందు రత్నాలు ఖచించిన బంగారు తాటంకాలు కదలాడుతూ వుంటే మంద మంద గమనాలు అందియల మణుకుణధ్వనుల్ని, మొలనూలి చిరుగంటల సవ్వడుల్ని ప్రకటపరుస్తూ వుంటే నిత్య నూతన విలాసం సుస్పష్టం అయింది. ఆ విధంగా తెల్లం అవుతూ వుండగా పంచబాణుడైన అనంగుడికి పునస్సంజీవ నౌషధమున్ను అనురాగ జలధికి చంద్రోదయ ప్రారంభ వేళయున్ను సకల జగాల సౌభాగ్యానికీ పుట్టినిల్లున్ను అయిన ఆ గిరి రాజకుమారి శంకరుణ్ణి చేర ఏతెంచింది.
ఈ తెరగున సవిలాసంగా చనుదెంచి ఉచిత కాలంలో వికసించిన దిరిసెన పువ్వులలోని అకరువులను పోలి (కేసరాలను పోలి) అతి సుకుమారమున్ను కస్తూరి పూత కలదిన్ని అయిన తన భుజాన్ని సర్పకేయూరాలంకృతం అయిన ఫాలనేత్రుడి భుజాన్ని ఒరసికొనేటట్లు నిలిచింది. ఆ విధంగా నిలువ యాజ్ఞదత్తి తన డెందంలో ఈ విధంగా తలపోయసాగాడు.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి