భక్తి కథలు

కాశీ ఖండం.. 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగారకుడు పాలించే లోకానికి ఊర్థ్వమైన స్థానంలో వసించు’’ అని వరాలు అనుగ్రహించి నీలగ్రీవుడు దేవతా సమూహంతో పాటు బ్రహ్మదేవుణ్ణి కూడా తలచాడు.
స్మరణమాత్రం చేత ఏతెంచిన ఆ బ్రహ్మాది దేవతాతతి చేత ఆ బృహస్పతికి దేవతాచార్య పదవీ సామ్రాజ్యానికి పట్ట్భాషేకం చేయించాడు. అనంతరం చంద్రేశ్వరుడి దక్షిణ దిక్కున విశే్వశ్వరుడికి నిరృతి దిక్కున బృహస్పతి ప్రతిష్ఠ చేసిన బృహస్పతీశ్వర లింగంలో ప్రవేశించాడు.
శనైశ్చర లోక వృత్తాంతము
దివిజ గురువైన బృహస్పతి లోకాన్ని దాటి సూర్యనందనుడైన శనైశ్చరుడి లోకాన్ని కాంచి, ఆశ్చర్యపడి పుణ్యశీలుడైన శివశర్మ గోవిందభటులైన సుశీల పుణ్యశీలురతో సుస్పష్టంగా ఈ చందంగా పలికాడు.
‘‘ఓ పుండరీకాక్షుడి పార్శ్వవర్తులారా! మహానుభావులారా! సూర్య సమాన తేజస్సు కలదిన్నీ, ఉజ్జ్వల ప్రభా మండల మధ్యవర్తిన్నీ, సమగ్ర విలాస సమన్వితమున్ను అయిన రెండవ స్వర్గలోకమా అనే విధంగా చూపులకి పొడగట్టుతున్నది. ఇది ఎవ్వరిలోకం?’’ అని ప్రశ్నించాడు. శివశర్మ ప్రశ్నని ఆలకించి పుణ్యశీల సుశీలురిద్దరూ అతనితో ఈ రీతిని వాక్రుచ్చారు.
‘‘ఓ సువృత్తా! ఇది శనైశ్చరుడిలోకం. ఈ శనిగ్రహాలన్నింటిలోను మిక్కిలి బలిష్ఠుడు. ఈ మహాత్ముడి శుభచరిత్ర విశదంగా వివరిస్తాను. వినవలసింది.
‘‘శ్రీమన్నారాయణుడి నాభి పద్మం నుంచి బ్రహ్మ జనియించినాడు. ఆ బ్రహ్మకు మరీచి ఉదయించాడు. ఆ మరీచి సంయమ వరుడికి కశ్యపుడు కలిగాడు. ఆ కశ్యప ప్రజాపతికి అర్కుడు ప్రభవించాడు. ఆ భానుడు త్వష్ట కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వరించాడు. ఆ సంజ్ఞ భాస్కరుడివల్ల ముగ్గురు బిడ్డల్ని కన్నది. వారు మనువు, యముడు, అను తనయులు, యమున అనే తనయయున్ను. ఆ కాలంలో ఆ ఇల్లాలు అతి కోమల శరీర కావడంవల్ల ఆ రవి యొక్క మిక్కిలి వేడియైన తేజస్సును ఓర్వలేకపోయింది. సైపలేకపోయింది. అంత సంజ్ఞాదేవి తనతో సమానాకృతికల ‘్ఛయ’ అనే స్ర్తి రత్నాన్ని సృజించింది. తనకు ప్రతిచ్ఛాయ అయిన ఆమె సంజ్ఞాదేవి యెట్టయెదుట అంజలి ఘటించి నిలుచుంది.
అప్పుడు సంజ్ఞాదేవి సవర్ణ అయిన ఛాయాదేవితో ఈ భంగి పలికింది. ‘‘కల్యాణీ! నేను మా పుట్టింటికి వెళ్లి వస్తాను. నాకు మారుగా నువ్వు నా ఆజ్ఞ పాటించి, దివాకరుడికి పరిచర్యలు సల్పు. మనువు, యముడు, యమున అను ఈ మువ్వురినీ నీ సంతానంగానే భావించు. ఈ రహస్యాన్ని కేశపాశం పట్టుకొని శపించేదాకా ఎవరి ముందు బయట పెట్టకు’’ అని అపత్యత్రయాన్ని ఛాయకి ఒప్పగించి పుట్టినింటికి ఏగింది. ఇక్కడ సవర్ణ అయిన ఛాయాదేవి సూర్యుడివల్ల ‘సావర్ణి’ నాముడయిన అష్టమ మనువుని, శనైశ్చరుణ్ణి, భద్ర అనే కన్యను కన్నది. సూర్యుడు ఆమెని సంజ్ఞాదేవి అనియే భావించాడు.
ఆ ఛాయాదేవి సకల స్ర్తి జన స్వభావంబయిన సవతితనంవల్ల సంజ్ఞాదేవి సంతానాన్ని కంటె నిజ సంతతిని మిక్కిలి వాత్సల్యం పాటించి, భోజనం పెట్టడంలోను, అలంకరించడంలోను, బుజ్జవం సల్పడంలోను వైషమ్యంతో ప్రవర్తించసాగింది. ఆ విధంగా వుండగా ఒక రోజున భవితవ్యాన్ని బట్టియో, బాల్య చాపలంవల్లనో, మమతవల్ల ఏర్పడిన స్వేచ్ఛవల్లనో యముడు సంజ్ఞా స్వరూపిణి అయి వున్న ఛాయాదేవిపై అలిగి కాలితో తన్నదలచి పాదం ఎత్తాడు. సంజ్ఞాదేవి తన్ను మనమందు విశ్వసించి తన బిడ్డలను తన వద్దన్యాసంగా వుంచడం ఏ విధంగా విస్మరించిందో! పసిబిడ్డ అపరాధాన్ని పట్టి పాలార్చడం సముచితం కాదని ఏ విధంగా భావింపదయ్యెనో, తానేమి బిడ్డలను కన్నతల్లి కాదా?

-ఇంకా ఉంది