భక్తి కథలు

కాశీ ఖండం.. 83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశే్వశ్వర స్వామి ఒక రోజున పార్వతీ దేవితో మన యింత పెద్ద కుటుంబానికి ఒక దక్షుడైన హితుడు నిర్వాహకుడు కావలసి వుంది కదా అని మంతనం ఆడాడు.
ఆ విధంగా మంతనం ఆడి సదాశివుడు గిరిరాజ కుమారి ముఖాన్ని అరకంట చూశాడు. ఆ చూపున వర్షాకాల మేఘం వంటి నీలవర్ణుడైన ఒక ముద్దు కొడుకు ప్రభవించాడు.
ఆ బాలుణ్ణి కనుగొని లేత చంద్రధరుడు ‘పుండరీకాక్షా! పురుషోత్తమా! నెమిలి పింఛంతో కప్పబడిన చికురాలు కలవాడా! ఆజానుదీర్ఘ బాహుద్వయ యుగం (చతుర్భుజుడా) ఇంద్రనీలవర్ణ దేహా! సింహ సంహననా! పీతాంబర పరివేష్టి కటి మండలా! కోటి మన్మథుల విలాసం కలవాడా! కాశీనగరం అయిదు క్రోసుల మేరయున్ను మహిమాన్విత క్షేత్రం. ఈ కాశీ నాకు రాజ్య పదవి. పరమ పుణ్యాత్మా! ఏకాగ్రభావంతో కుటుంబ భారం నిర్వహించి భరించు అని వచించాడు. అంతేకాక ఆ బుద్ధి తత్వరూపి అయిన విష్ణువుని కాశికాపుర సామ్రాజ్యభారం వహింప నియోగించాడు- ఆ జనార్దనుడు.
కాశీపురంలో తన చక్రాయుధంతో త్రవ్వి ఒక పుష్కరిణిని నిర్మించాడు. ఆ సరస్సుని త్రవ్వే తరిలో ప్రయోసజనితం అయిన చెమటనీటితో విష్ణుమూర్తి ఆ గొప్ప మడుగుని నింపాడు.
పిమ్మట విష్ణుమూర్తి ఒక వేయి ఎనిమిది యేండ్లు దుస్సహతపం పరమేశ్వరుడి గురించి ఆ జలాశయ తీరాన్ని అతులిత భక్తితో ఆచరించాడు.
అనంతరం ఇందు కళాధరుడు, కాశీవల్లభుడు, విశే్వశ్వరుడు సాక్షాత్కారం చేసి విష్ణువు త్రవ్విన సరోవరాన్ని కాంచి, సంతసించి, బ్రహ్మ కలాపాల మాలలు ధ్వనించే రీతిగా జటాజూటాన్ని మెప్పుదల సూచనగా అల్లన ఆడించి బహుమాన పూర్వక ప్రశంస కావించాడు. సర్పభూషణుడైన పరమశివుడు విష్ణు నిర్మితమైన వాపిని స్తుతించుతూ ప్రశంసావాక్యాలు వెలువరింపగా త్రినేత్రుడి కుడి చెవిని వున్న మణికర్ణికాభరణం ఎగసిపడి ఆ కాసారంలో పడింది. పరమేశ్వరుడి మణికర్ణికా భూషణం పడిన చోటు కావడంవల్ల ఆ చక్రపుష్కరిణి మణికర్ణికా కుండం అను పేర విఖ్యాత చెందింది.
చక్రపుష్కరిణీ తీర్థ సవిధ ప్రదేశంలో శంఖ చక్రగదాయుధాల్ని పాణుల తాల్చిన విష్ణుమూర్తి కాశీ క్షేత్ర మహాత్మ్యాధికాన్ని తెలుపవలసిందని అడిగాడు.
కాశీ తీర్థ మహాత్మ్య కథనము
అంత శివుడు ఆ మహాత్మ్యం విశదపరుస్తాను, శ్రద్ధ్ధానుడివై ఆకర్ణించు. మణికర్ణికాతీర్థంలో నిర్వర్తించిన సంధ్యోపాసన, స్నానం, జపం, హోమం, వేదాధ్యయనం, వివిధ వ్రతోధ్యాపనాలు, గోవులను దానం చెయ్యడం, వృషభాలను అచ్చొత్తి వదలడం, శివలింగ స్థాపనం, అక్షయాలైన మోక్ష ఫలాలు ఒసగుతాయి. ఈ మణికర్ణికా తీర్థంలో భూతకాలంలో వున్నవి, భవిష్యత్కాలంలో రాబోయేవీ, వర్తమాన కాలంలో వున్నవీ అయిన తీర్థాలు సరిరావు.
సాంఖ్యయోగం, ఆత్మదర్శనం, వ్రతాలు, తపములు, దానాలు ఆ మరణికర్ణికా తీర్థ స్నానంలో సమానాలు కావు. కుందేళ్ళు, దోమలు, కీటకాలు పక్షులు, సర్పాదులు అయిదు క్రోసుల పరిమితి కల ఈ క్షేత్రంలో మరణించి మోక్షలక్ష్మిని చేపట్టుతాయి. ఈ కాశీ క్షేత్రంలో నిరంతరం ఉత్తరాయణ కాలమే ప్రవర్తిస్తూ వుంటుంది. ఈ పవిత్ర క్షేత్రంలో ఎల్లప్పుడూ కృతయుగమే అన్నివేళలా మహోదయ పుణ్యకాలమే. కాశిలో అయిదు రోజులు రాత్రింబవళ్లు వున్నట్లయితే చతుర్వేదాలు అధ్యయనం చేయగా లభించే పుణ్యం లభిస్తుంది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి