భక్తి కథలు

కాశీ ఖండం..21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమాట ఇప్పుడు వాస్తవం అయింది. నేను ఈ రీతిగా అశోక మనస్థితిలో వుండగా వూహించని విధంగా ఇదె గొప్ప విఘ్నములు కలిగాయి. విశే్వశ్వర స్వామి నా యెడ విముఖుడు అయాడు సుమా! అట్లు కాని పక్షంలో సకల జీవులకి మోక్ష సంపదకి నిలయం అయిన కాశీక్షేత్ర వియోగ రూప దుఃఖార్తి ఏ విధంగా సంభవిస్తుంది?
తన అరచేతి అన్నపు ముద్దను జారవిడిచి మోచేతిని నాకే వెంగలివిత్తు కూళ మాదిరిగా ఇహపర లోక భోగ మోక్షాలకి పుట్టిల్లు అయిన కాశీ క్షేత్రం వదలి నరుడు అన్య దేశం అరుగుతాడు?
ముందు ఆలోచన చెయ్యక దేవగురుడైన బృహస్పతి అంతటివాడితో తటుక్కున ఇయ్యకొన్నాను. ఇక వెడలక అడియాసలతో వుండడం వంచన అవుతుంది. ఓ పాప దైవమా! ఈ గతి నన్ను చిక్కులపాలు చేస్తావా? అనేక విధాలుగా ఎట్లు చెప్పినా- మోక్ష స్థానమైన కాశిని ఏ గతిని విడుశక్యం అవుతుంది? కట కటా!
హిమాలయ సానుతటాలనుంచి జాలువారుతున్న ఈ జాహ్నవిని విడిచిపోవగలనా? మందార ప్రసూన మధువు క్రోల సుడులు తిరిగే కన్నులు కల వటుకనాథుడిని మరువగలనా? విఘ్నాలనే అంధకారానికి అర్కుడైన, మండూక జఠరుడైన ఈ డుంఠి విఘ్నేశుని విడిచిపెట్టడం ఎలా? మధ్యాహ్నవేళ అయేసరికి కడుపు అరసి విశాలాక్షీ మహాదేవి తన అరుణ పాణి తలంలో వడ్డించే భిక్షని ఏ రీతిగా మానగలను? దేవతలు, మునులు కట్ట కట్టుకు వచ్చి అర్థింప మాట యిచ్చి ఇంతటి ఘనుడిని నేను పోకుండ ఎలా వుండగలను సకల పుణ్యాలకి రాశి, ప్రసిద్ధ గుణ రత్నాలకి పాలకడలి అయిన ఈ కాశిని పాసి నేను ఏ కరణి పోనేరుస్తాను?
కాశీక్షేత్రం అయిదు కోసుల మేర దాకా మోక్షలక్ష్మికి స్వగృహం లేక కాణాచి అని ఆక్రోశిస్తున్న వేదఘోష విని వుండిన్నీ దురదృష్టవంతులు దేశాంతరం ఏగ సమ్మతిస్తారు.
లోపాముద్రా నేను కాశిని వదలిపెడతానే అను- అయితే ఏమిటి? ఆంతరం అయిన అవిముక్తతీర్థాన్ని ఆశ్రయిస్తాను. అయితే ఆ ఆంతర విముక్త తీర్థం ఎది అని అడుగతావేమో? ‘వరణ’, ‘అసి’ రెండూ కలిసిన ‘వారణాసి’. భ్రుకుటి ద్వయనాసాగ్ర సంధిస్థానం అవిముక్త స్థానం. ఆ అవిముక్త స్థానం అభ్యంతర తీర్థం. తీర్థాలు బాహ్యాలు, అభ్యంతరాలు అనే భేదంవల్ల రెండు తెరగులు-
శశిబింబాభిరామ వదనా! అన్నీ బాహ్యతీర్థాలే. అరసి చూడ బాహ్యాలు అయినా అభ్యంతరములు కూడా అయినవి. కాశీతీర్థం మున్నయినవి కొన్ని వున్నాయి. వాటిని క్రమంగా వినిపిస్తాను. ఆలకించు.
బాహ్యాంభ్యంతర స్థితాలైన తీర్థస్థానాలని నిర్దేశించి వచిస్తున్నాడు. మల్లికార్జునస్వామి మనికి పట్టు అయిన శ్రీశైలం మన శీర్షం. మన లలాట ప్రదేశంలో మంచుమయం అయిన కేదారతీర్థం వుంది. కుచాగ్రాలలో కురుక్షేత్రం ప్రతిష్ఠ పొందింది. భ్రుకుటి ద్వయ మధ్యభాగంలో కాశీ క్షేత్రం నెలకొని వుంది. మన హదృయంలో ప్రయాగ తీర్థం ఆశ్రయించుకొని వుంది. ఈ మహాతీర్థాలు పార్వతీనాథుడికి విహార స్థలాలు. ఈ తీర్థాలు వేదప్రసిద్ధాలు. ఇవి వెలుపలి భూమి మీద వున్నట్లే మానవ శరీరంలోనూ వుంటాయి.
ఈ పేర్కొన్న బాహ్యాంభ్యంతర తీర్థాల్లో అవిముక్త తీర్థం ఉత్తమోత్తం. అటువంటి అవిముక్త తీర్థంలో వుండి పూర్ణమున్ను సచ్చిదానందాలు మూడున్ను ఏకమైన అఖండ రసస్వరూపం, అద్వితీయం, అర్థనారీశ్వర ఆదిరూపాలు కల సకల స్వరూపం అయిన విశే్వశ్వరుడిని ఉపాసించ వీలు చిక్కకుంది. ఇటమీద నేను భావ స్వరూపం అయిన ఆభ్యంతర తీర్థంలోనే ఆ భర్గుడిని ఉపాసిస్తాను.
-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి