భక్తి కథలు

కాశీ ఖండం.. 97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ అగ్గులం అయిన ప్రేమతో తామరసాక్షి అయిన ఆ సుశీల కొండమీది కార్చిచ్చు మంచి గంధపు కట్టెలతో రగుల్కొలిపి సువాసనలు విరజమ్ముతున్న పద్మములను మెడలో తాల్చి, మదిలో మున్ముందుగా విశే్వశ్వరుణ్ణి స్మరించుకొని, తల్లిదండ్రుల్ని తలచుకొంది. తర్వాత తన అంతరాత్మలో - నా ఇష్టదైవం విశే్వశ్వరుడికి ఏ విషయంలో అపరాధం చేశానో కాని వారణాసిలో అందరూ క్షేమంగా వుండగా ఈ దురవస్థ నాకు ప్రాప్తించింది.
జ్ఞానవాపీ తోయంతో స్నానమాచరించే తరిని చెలికత్తెలు నన్ను తలచుకొంటున్నారో లేదో? నా తల్లిదండ్రులు తమ హృదయాల్లో నా కోసమై పరితపిస్తూ వుంటారో? మా లేత గరిక పరికలు నోటికందిచ్చి పెట్టనిదే మేయని మా లేడి పిల్లని ఇక ఎవరు కనిపెట్టుకొని ఉంటారో? శ్రీ విశే్వశ్వరుడు నా చేత సేవ చేయించుకోవడానికి చిత్తగింపడు ఎందుకో? కాశీ! లోలార్కా! కేశవా! కాలనాధా! దండనాయకా! డుంఠి వినాయకా! ఓ జాహ్నవీ! భావి జన్మలో మిమ్మల్ని అందర్నీ కాంచ వస్తాను.
భర్తను పోగొట్టుకొని విధవనై బ్రదుకంతయు ఈడ్చలేను. ఒకనికి చేపడి ఇంకొకడిని వెదకలేను. ఈ విద్యాధరుడి తోడిదే లోకం అయి, ఒక నిమేష వేదనకు ఓర్చి ఇతడితో సహగమనం చేస్తాను. నేను ఒక్కతెనే ఒంటరిగా వుండగా చూసి ఇంకొకడు ఎవడైనా నన్ను పట్టుకొనతలపోస్తాడేమో? కోపంతో మహాకాననంలో నన్ను గజాలు, సింహాలు, అడవి పందులు, చిరుత పులులు సంకటంలో పెట్టుతాయో? మిక్కిలి క్రౌర్యంతో నన్ను ఇంతటి ఆపదలో పెట్టి వేదనపాలు కావించిన ఆ బ్రహ్మదేవుడు మీద ప్రయ్యిడి (నిందమోపి) శీఘ్రమే అగ్నిలో ప్రవేశిస్తాను. చితికాష్ఠలచే ప్రదీపితం చెయ్యబడిన అగ్విజ్వాల, పాపపు దైవం ఒనర్చిన ఈ పరాభవ వహ్ని జ్వాలకన్నా సంతాపం కలిగించకలదా? ఊరక ధైర్యాన్ని కోల్పోవడం ఎందుకు?
ధైర్యంలో హిమాలయగిరి సమానుడు, మన్మథుడికి జోడు అయినవాడు, అర్మిలితో నన్నిక్కడికి తీసికొనివచ్చిన ఈ విద్యాధరుడు నాకయి నా కన్నుల ముందర ఈ దుర్దశలో నుండగా అనగా మరణించగా- కాశీపతీ! అంబికా రమణా! విశే్వశ్వర స్వామి! నేను జీవించి వుండగలనా?’’ అని దుఃఖావేశంతో కొసరి కొసరి వసంతరుతువులో కోయిల పేరెలుంగుతో కూసిన రీతిగా దుస్సహ దుఃఖవేగంతో కాటుక కన్నులనీరు ఉసిరిక కాయలంతలు ధారలై వక్షమునుండి దిగజారిపడినట్లు విలపించింది. మలయ పర్వతం ఎక్కడ? కాశి ఎక్కడ? పాడు దైవం దుర్మార్గం చేసి నాకు ఈ ఎగ్గును కావిస్తాడా? అంటూ ఆమె అచ్చెరువంది, వెలవెలపోయిన చెక్కుటద్దాల మీద కమ్మ పంజులలలోని రత్నాల కాంతులు పర్వునట్లు తలఊచెను.
అనంతరం ఆ కన్య పచ్చకప్పురపు అరటిచెట్ల నుంచి స్రవించే చెట్టు జిగురుతోడి నీటి సోన వాసనల చేత సువాసనాభరితాలైన గంథాచలం సానువులనుంచి ప్రవహించే నిర్ఘర జలప్రవాహంలో ముఖ ప్రక్షాళన కావించుకొంది. విద్యాధరుడి శరీరంమీద పేర్చిన చితియందలి గంధపు చెక్కల లోపల రాజుకొని మద గజాల కర్ణతాళములు అనే వీవనల కదలికలవల్ల కల్గిన విస్తార వాయువుల చేత పెచ్చురేగి విచ్చలవిడిగా మండుతూ వున్న అగ్నికి ప్రదక్షిణం ఒనర్చి, నైజం చేతనే విభీతాలైన తనకడగంటి చూపులే పూల దోసిళ్లుగా వధ్యస్థలి అయిన రాతి తినె్న ఎక్కి నిలిచింది. నిరంతరం వేదాధ్యయన ఘోషతో ప్రతిధ్వనిస్తూంది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి