భక్తి కథలు

కాశీ ఖండం.. 98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోమధేనువుల అర్థచంద్రాకారపు కాలిగిట్టల చిహ్నాలచే నెమలి పించాలు పరచిన విధంగా వున్న ముఖశాలతో, త్రికాల శివార్చనారంభాన్ని తెలిపే పూరించిన శంఖధ్వానాలతో మార్మోగుతూ, ఆ కాశీపురంలోని నల్లిండ్లలో అగ్రగణ్యం అయిన నా పుట్టిల్లు సదా అభివృద్ధి చెందుగాక! నా జనని ప్రియంవద ముత్తయిదువ అయి వరలుగాక! అష్టాదశా మహావిద్యా సామ్రాజ్యం సింహాసనం పయిన నా జనకుడు హరిస్వామి సమానులలో ఉత్తమ శ్లోకుడు అవుతాడు గాక! కాశీనగరంలోని అనూచానం అయిన నా చుట్టపక్కాలు బంధూక లతలాగు కొనలు ననలు సాగి కలకాలం జీవింతురుగాక! అని ఆశీర్వదించింది.
నేను ప్రాతస్సమయాల్లో ఈశాన కుండికా తీర్థంలో ప్రతిరోజూ స్నానమాడిన పుణ్యఫలం, నేను విశే్వశ్వర స్వామి ముక్తి మంటపంలో భక్తితో పెట్టిన మ్రుగ్గుల ఫలం, ప్రతి చతుర్థి తిథినాడు నేను డుంఠి విఘ్నేశ్వరుణ్ణి అర్చించిన ఫలం, ఆనందకానన క్షేత్రంలో జన్మించినట్టి ఫలం ఇవి అన్నీ కూడి రాబోవు జన్మలో ఈ విద్యాధరుడికే నన్ను పత్నిని చేస్తాడుగాక!’’ అని పలుకుతూ చంద్రకాంతి సూర్యం తేజంలో లాగు ఆమె అగ్ని చొచ్చింది.
మూడు లింగాలు కుక్షిలో కల ఆ వనిత సాన్నిధ్యం వల్ల ఆ రాక్షసుడూ విద్యాధరుడూ ఆమె స్పర్శవల్ల పుణ్యస్ఫూర్తివల్ల స్వర్గ పదవి పొందారు. అంత కొంతకాలానికి ప్రియాస్మరణ చేసింది కావున విద్యాధరుడు మలయకేతుడు అనే పేరుతోను అగ్ని ప్రవేశ సమయంలో ఆ విద్యాధరుడు తనకి పతి కావాలని కోరింది కనుక ఆ సుశీల కళావతి అను పేర ధరణిలో జన్మించి సతీపతులు అయారు. ఆ దంపతుల్లో కళావతి పురాజన్మ వాసనావశం చేత- ఆ వక్రనీలాల కలుకల కళావతీ సతి మెడలో రుద్రాక్షమాలలు ధరిస్తుంది. ముత్యాల హారాలు అలంకరింపదు. రత్నాభరణాలు తాల్చదు. మేన విభూతి రేఖలు పెడుతుంది. ఒక్కదినమందయినా చందనం పూయదు. పన్నీరు చల్లుకొనదు. కస్తూరి గాని, కర్పూరంగాని కుంకుమగాని అలదుకోదు.
కలువ పువ్వు రేకుల కన్నుల కళావతి మలయకేతువనే రాచవలరాచవారికి భాగ్యము, సౌభాగ్యము, వైభవము, ప్రాభవము ఆది శుభ గుణ సంపన్నులయిన ముగ్గురు కుమారులను కడుపు చల్లగా కన్నది.
అప్పుడు ఒకనాడు చిత్రకారుడు ఒకడు కాశీస్థాన వృత్తాంతాన్ని చిత్తరువుగా గీసి, తెచ్చి, కళావతీ సమేతుడైన మలయకేతువు సన్నిధిలో వుంచాడు. అంత కళావతి ఆ చిత్రపటాన్ని కాంచి, ప్రాక్తజన్మ వాసనావశంవల్ల తనను తాను మరచి సమాధిలో వున్న దాని పగిది కన్నులు మూసికొని క్షణమాత్రం మిన్నకుండి కన్ను తెరచి ఆ చిత్రపటంలోని విశేషాలనన్నింటిని పూసగ్రుచ్చిన చందంగా చేతి తర్జనితో చూపి పతికి చెప్పసాగింది. ఆ విధం అగస్త్య మహర్షీ! నీకు విశదపరుస్తాను, వినవలసింది. ఓ మలయకేతు మహారాజా! కాశీనగరం ధనురాకాన్ని పోలి వుంది. గంగానది ఆ ధనువున సంధించిన నారి. ఆ ధనుస్సు దక్షిణ కోణం లోలార్కుడు. ఉత్తరకోణం ఆదికేశవుడు. ధర్మం ఎక్కుపెట్టిన బాణం. లక్ష్యం తూలగొట్టవలసిన పాపరాశి. విశే్వశ్వరుడు విలుకాడు.
భూపతీ! ఆకాశగంగ ఇదే. మణికర్ణికా తీర్థం ఇదిగో, సకల మంగళములకు నెలవైన కాశీ అదిగో! బ్రహ్మ కపాలం నేలపై పడ్డచోట అదే! కాల భైరవస్వామి వాడే! పంచ తీర్థస్నానం ఇదే! ఓంకారేశ్వర స్వామి అడుగో! మత్మ్సోదరీ తీర్థస్థాన మండలం ఇదే! కామేశ్వరుడు అతడే! స్కందేశ్వరస్వామి వాడే! అటు చూడు- వినాయకేశ్వర శివుడు వాడే! శశికిరీటుడు పార్వతీధవుడు అతడే! భృంగీశ్వర లింగం అతడే! యజ్ఞేశ్వరలింగం అతడే! అష్టాదశాంగుణేశ్వరుడు లేక పురాణేశ్వరలింగం వాడే!

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి