భక్తి కథలు

కాశీ ఖండం.. 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహోరాత్రం కన్నురెప్పలు మూయక మహాప్రయత్నంతో నైశ్చల్య దురంధరత్వాన్ని వహించి, నరుడికి తదేకమగ్న చిత్తంతో సదాచారం ఏ రీతిగా పాటించడం వీలుపడుతుంది? ఆ నరుడు కాశీవల్లభుడైన గౌరీవల్లభుణ్ణి సంస్మరిస్తూ ధర్మభ్రశం చెందక బ్రదుకవలసినవాడే కదా!
మహీసురుడు బ్రాహ్మ ముహూర్తంలో మేలుకోవాలి. ప్రతిదినం ధర్మలోప సంభావాలైన అనిష్టాలు పరిహరించుకోవడం కోసం తత్పరతో భక్తి సౌష్టవంతో శుభాలకి నిలయం అయిన వస్తు సంచయాన్ని సంస్మరించుకోవాలి.
అవనీసురుడు బ్రాహ్మముహూర్తంలో మేల్కొనాలి. మేల్కొని ఆచమనం చేసి, ఏకాంత ప్రదేశంలో భస్మాసను లేపనము, విభూతి త్రిపుండ్రాలు ధరించాలి. రుద్రాక్షమాలలు తాల్చాలి. పిమ్మట పద్మాసనాసీనుడయి మనస్సులో క్రింది దేవతల్ని సంస్మరించాలి. విఘ్నేశ్వరుణ్ణి, పార్వతీ సమేతుడయిన పరమ శివుణ్ణి, లక్ష్మీసహిత విష్ణుమూర్తిని, భారతీ సితుడైన బ్రహ్మని తొలుత క్రమంగా ధ్యానించాలి.
అనంతరం ఇంద్ర, యమ, అగ్ని, వరుణ, వాయు, కుబేర, పశుపతి ఈ అష్టదిక్పాలకుల్ని భావించాలి.
తర్వాత వశిస్టాది మునుల్ని, గంగ మొదలైన పుణ్యనదుల్ని, ప్రయాణాది తీర్థాలని, శ్రీశైలం మున్నుగాల పుణ్యశైలాలని, క్షీర సముద్రాదుల్ని మానస సరోవరం మొదలైన సరస్సుల్ని, జ్ఞానవాపి ఆదిగా గల బావుల్ని, నందనం వంటి వనాల్ని, మనస్సులో తలంచుకోవాలి.
అటుమీద పుష్కరాది ద్వీపాలని, ఆర్యావర్తాది దేశాల్ని, కోరికల్ని తీర్చు కామధేనువు మొదలైన ధేనువుల్ని కల్పవృక్షాదుల్ని, బంగారం మున్నయిన ధాతువుల్ని, లక్ష్మీదేవి మొదలైన పుణ్యస్ర్తిలని, గరుత్మంతాది ఖగాలనీ, శేషువు మున్నగు సర్పరాజుల్ని స్మరించుకోవాలి.
అంతేకాక ఐరావతం మొదలైన గజాల్ని, ఉచ్ఛైశ్శ్రవాది హయాల్ని, కౌస్త్భుది మణుల్ని, అనసూయ, అరుంధతి వంటి మహా పతివ్రతల్ని, రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరస వనితల్ని, నైమిశారణ్యాన్ని పోలిన పుణ్యారణ్యాల్ని, కాశీ, కాంచి, అవంతి మున్నగు పవిత్ర నగరాల్ని, విశే్వశ్వరాది శివలింగాల్ని, పాంచజన్య శంఖాదుల్ని, సుదర్శనాది దివ్యాయుధాల్ని భావించాలి.
అనంతరం వేదాది విద్యల్ని, పద్మాది అష్టాదశ పురాణాల్ని, మను, పరాశరాది స్మృతుల్ని, గాయత్రి, శివపంచాక్షరాది మంత్రాల్ని, సనక, సనందాది మహాయోగీంద్రుల్ని, ఓంకారాది బీజాక్షరాల్ని ధ్యానించాలి. పిమ్మట ఎర్రధాన్యం మున్నయిన ధాన్యాల్ని, నారదాది విష్ణు భాగవతుల్ని బాణాసురాది శివభక్తుల్ని, ప్రహ్లాది, ద్రువాది భాగవతుల్ని స్మరించాలి.
అంతేకాక మహాప్రమథుడు ఆదిగాల ప్రమధుల్ని, పద్మాది నవనిధుల్ని, దధీచి మున్నగు వదాన్యుల్ని హరిశ్చంద్రాది చక్రవర్తుల్ని, తల్లిదండ్రుల్ని, పితృదేవతల్ని, గురువుల్ని తలంచుకొని, ఈ అందర్నీ- నాకు ఆయురారోగ్యైశ్వర్యాదుల్ని అనుగ్రహిస్తారుగాక! అంటూ ప్రార్థించి, వందనం ఆచరించి, నిలుచుండి, నిత్యానుష్టానాదుల్ని, నైమిత్తికానుష్ఠానాదుల్నీ నియమ నిష్ఠలుగల వాడై విప్రుడు ఆచరించాలి.
అగస్త్య మునిప్రవరా! ఇల్లు బయల్వెడలి వూరికి నూరు విండ్ల దవ్వున నిరృతి దిక్కున బహిష్కత్మ తీర్చాలి. నాలుగు వందలవిండ్ల దూరంలో బహిఃప్రదేశానికి ఏగడం ధర్మం. తలకి ముసుగువేసుకొని పచ్చిక చిక్కగా మొలిచిన చోట మలమూత్రాల్ని విసర్జించాలి. మలము, మూత్రమూ విసర్జించే తరిని కుడిచెవియందు జందేన్ని తగిలించుకోవాలి.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి