భక్తి కథలు

కాశీ ఖండం.. 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాతస్సంధ్యల వేళల్లో ఉత్తర దిక్కు ముఖుడయి, రాత్రుల్లో దక్షిణ దిఙ్మఖుడు అయి వౌనం పూని అవనీసురుడు మలవిసర్జన చేయాలి.
ఇక నిలుచుండి మలమూత్ర విసర్జనం చెయ్యకూడదు. జలాలలో చేయతగదు. నాగలితో దున్నిన నేలలో పనికిరాదు. ఆవుల మందవున్న తావులో చెయ్యతగదు. ఆవు దగ్గర విడువకూడదు. అగ్నికి ఎదురుగా విడువకూడదు. విప్రుల ఎదుట తగదు. పైరు చేలలో విసర్జించరాదు. దేవుడి రథం తిరిగే వీధిలో కూడదు. జనుల ఎట్టఎదుర విడువ తగవు కాదు. నక్షత్రాలని, చంద్రసూర్యాదిగ్రహాల్ని చూస్తూ మలమూత్ర విసర్జన చెయ్యవద్దు. మల విసర్జన చేసి, జననేంద్రియాన్ని ఒక చేతితో పట్టుకొని, చెదపురుగులుగాని చీమలుగాని, ఇసుకగాని పుట్టమన్నుగాక, ఎలుక కన్నంలోనిది కాక- తదితరం అయిన మట్టిని తీసకొని శౌచవిధిని ఆచరించాలి.
కలశజన్మా! ముసుగు దగ్గరగా లాగికొని, చేతి రెండు వ్రేళ్లతోను, ముక్కును- కొనను- అదిమి పట్టుకొని మలాన్ని విసర్జించి, తొలగిపోయే సమయంలో అమేధ్యాన్ని చూడదగదు. ఉసరికకాయ అంత పరిమాణంకల మెత్తని మట్టి ముద్ద ముక్కని అపాన మధ్యభాగాన (గుద భాగాన) అయిదు మారులు, జననేంద్రియాగ్రభాగాన ఒక్కసారి ఆ పయిని ఎడమ చేతిలో పది పర్యాయాలు, ఇంకొక పదిసార్లు రెండు చేతుల్లోను, ఏడుమారులు పాదద్వయంలోను, మరల ఇంకొక పర్యాయం హస్తద్వయంలోను, మూడుసార్లు నడిమి వేళల్లో సద్దుచెయ్యక ప్రక్షాళనం చేయతగి ఉంటుంది. శౌచం మనస్సుకి తోచు విధంగా పూసుకొని పూసుకొని వాసన పిసరంత కూడా లేకుండా చెయ్యాలి. ఇంతవరకు చెప్పిన శౌచం గృహస్థుకి విహితం అయిన శౌచం, ఈ గృహస్థశౌచానికి రెండు రెట్లు, మూడు రెట్లు, నాలుగు రెట్లు బ్రహ్మచారి వానప్రస్థ యతీశ్వరులకి నియమింపబడి వుంటుంది.
ఓ మునివరేణ్య! పగటివేళ విధింపబడ్డ శౌచంలో సగభాగం రాత్రిలోను, రాత్రివేళ విహితమైన శౌచం సగం రోగబాధలోను, చోరక్రూర మృగాది బాధలు ఎదురయే అడవి త్రోవల్లో దానిలో సగభాగం అనీ శాస్త్ర నిర్ణక్షం.
అగస్త్యమునీశ్వరా! పురుషులకు విహితం అయిన శౌచంలో అర్థ్భాగం స్ర్తిలకు వ్రర్తిస్తుంది. నిష్కారణంగా శౌచ విధిని త్యజించటడం స్ర్తికిగాని మగవానికిగాని తగదు.
అనఘచరిత్రా! అగస్తి వౌనీంద్రా! పర్వతం అంత ఎతె్తైన మట్టిరాశి అయినా, సముద్రం అంత జలం అయినా బాహ్య శౌచం భావశౌచానికి సాటిరాదని శౌచక్రియావేత్తలయిన మునీంద్రులు వాకొన్నారు. అగ్నిహోత్రంలో వేల్వవలసిన ఆహుతులకున్ను చాంద్రాయణ వ్రతంలోని అన్నపు ముద్దకున్ను శౌచక్రియావిధికి నిర్దేశింపబడిన మట్టి ముద్దకున్నూ కర్మ రహస్యం తెలిసిన వృద్ధులు ఉసిరికకాయలంతేసి పరిమాణం అని వచిస్తారు.
వెచ్చనకానివిన్ని, నురుగులు లేనివిన్ని, బుడగలులేనివిన్ని, కారంలేనివిన్ని, ఉప్పనివికానివిన్ని, కలుషాలు కానివిన్ని, దుర్గంధం వెయ్యనివిన్ని, రసవంతాలు అయిన జలాలు, నవ్యకుండ, నిలుచుండక, మాటాడక, వెలుపలికి చూడక, వంగి వుండక, పరుండక, త్వరపడక, జందేన్ని విడువక, పాదాలు చాచికొనక, చేతులు మోకాళ్ల వెలుపల వుంచుకోక, సద్దు చెయ్యకుండ, ముమ్మారులు బ్రహ్మతీర్థంలో, హృదయం దిగువారునట్లుగా బుద్ధిశౌచం కోసం జలప్రాశన చెయ్యవలసి వుంది.
అనంతరం చేతి అంగుష్ఠమూలభాగంలో, కపోల భాగాన, రెండు మారులున్ను, బిగించిన ఓష్ట్ధారాల్ని ముమ్మారు స్పృశించాలి. పిమ్మట కుడి చేతి పుడిసిట పట్టిన ఉదకం ఎడమ చేతి దొప్పలో నింపి, కుడి, ఎడమ పాదాల రెంటిపయినా శిరస్సునా ప్రోక్షించుకోవాలి.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి