భక్తి కథలు

కాశీ ఖండం.. 103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యోదయ వేళ శిరస్నానం ఒనరించిన పిమ్మటనే మంత్ర తంత్ర అనుష్ఠాన విధులు నిర్వర్తించాలి. మున్ను, అక్షతలు, తిలలు, దర్బాంకురాలు, గోమయం ఇత్యాది ఋగ్వేద మంత్రాలున్ను స్నానానికి అంగాలు.
పవిత్రం అయిన మృత్తికాపిండం శుద్ధిచేసిన తావున నుంచి, ఉత్తర దిక్కు ముఖం కలవాడయి, ముడిపెట్టుకొన్న బ్రహ్మశిఖ కలవాడై జలాధి దైవత్యాలు అయిన మంత్రాలు ఉచ్చరిస్తూ ప్రవాహ జలాలలో స్నానం చెయ్యాలి. లోపాముద్రాపతీ! నియతి జలాంతర్భాగంలో నిలుచుండి ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం వేదత్రయి చేత ప్రవచింపబడ్డ యజ్ఞం.
ఆద్యంతాలలో ప్రణవ సహితం అయిన శిరోమంత్రంతో సప్తవ్యాహృతుల్ని అధిష్ఠించి కడుపార త్రరుూ విద్యని కన్నతల్లిగా గాయత్రీ మంత్రం మంత్రరాజమై మహిమతో కూడి ప్రకాశిస్తూ వుంటుంది.
గాయత్రీ మంత్రాన్ని మూడు మారులు జపిస్తే అది ఒక ప్రాణాయామం. గాయత్రిని పదిసార్లు చేసిన జపం తపస్సు అవుతుంది. జలమధ్యంలో ముమ్మారులు గాయత్రీ మంత్రజపంగాని, విష్ణుస్మరణంగాని చెయ్యాలి. స్నానాంతరం కారుణ్య పితరుల ప్రీతికోసం వస్త్రాన్ని పిండాలి. ఇది స్నాన విధానం.
ఉదికిన వస్త్రాన్ని తాల్చి, ప్రాతఃకాల సంధ్యని సేవించి, బ్రాహ్మణుడు దర్భపవిత్రం అనామికని ధరించి, సూర్యోదయం అవుతూ వుంటే సూర్యుడికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యప్రదానం కావించిన పిమ్మట గాయత్రీ జపం చెయ్యాలి. బ్రాహ్మణుడు వేదమాత అయిన గాయత్రిని పగటివేళ నిలుచుండి చెయ్యాలి. మాపటి వేళ కడు భక్తితో కూర్చుండి జపిస్తాడు. సంధ్య వార్వని బ్రాహ్మణుడు కేవలం కొస (కొంచెం) తక్కువగా శూద్రుడు.
ఈ ప్రకారంగా మధ్యాహ్న కాలంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, మరీచి మున్నగు మహర్షుల్ని, మన్వాది మానవుల్ని జలతర్పణాలతో సంతృప్తి పొందించాలి. చందనంతోను, అగురుతోను, కర్పూరంతోను మిశ్రీతం చెయ్యబడ్డ జలాలు తర్పణాలకి అర్హులు. దైవం, అర్షం, బ్రహ్మం, పైతృకం అనే తీర్థాలలో దేవాది తర్పణాలు ఆచరించాలి.
ఓ సకల విద్యాసనాధా! అగస్త్య మహర్షీ! సూర్యబింబం గగనం అనే సౌధాగ్ర కలశంలాగున మెరుస్తూ వుండగా గోచరించే మధ్యాహ్నకాల సంధ్యయందలి సావిత్రికి చందం త్రిష్టిప్పు. వెనె్నల వలె నిర్మల కాంతి, సుందరమైన నవ వనం, రద్రుడు దేవత, శుభకరమైన రూపం. కశ్యపుడు మహర్షి. నొసటి కన్ను, ఆపాదమస్తంగా సర్వావయవాలు కృష్ణ యజుశ్శాఖాక్షరాత్మకాలు. వాహనం వృషభం. అవతంస కుసుమం చంద్రకళారేఖ.
పచనార్థమైన అగ్నిని రగుల్కొలిపి నిష్ఠగా వైశ్వదేవం నిర్వర్తించాలి. వైశ్యదేవ విధులకి సెనగలు, మినుములు, అనుములు, నూనె, ఉప్పు నిషిద్ధాలు. అగ్నికార్యం ఒనర్చి ఆ తర్వాత హంతకారం నిష్ఠగా చెయ్యాలి. హంతకారం చేస్తే బ్రహ్మాదులైన ముఖ్యదేవతలు సంతృప్తి చెందుతారు.
కలశభవా! హంతకారం అంటే పదహారు కబళాల అన్నం. పుష్కలం అంటే ఒక కబళ మాత్రం. భిక్ష అనబడుతుంది. హవ్యాలతో సమానమైన హంతకార, పుష్కల, భిక్షారూపమైన అన్నదాన ఫలం బ్రహ్మాది దేవతల్ని సంతృప్తిపరుస్తుంది. కనుక క్షయింపచేయుట శక్యమైనదని అంటారు.
మునీశ్వరా! వైశ్వదేవకర్మ చివర ఇంటి వెలుపలి ప్రదేశంలో జలధారతో శ్రద్ధపరులై బలిహరణం కావించాలి. అలంకరించుకొని పిమ్మట మనశ్శరీరాల్లో త్వరపాటులేక పీటపై తూర్పు ముఖమైగాని, ఉత్తరం ముఖమై కాని కూర్చుండి, నేయి అభిఘరించినది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి