భక్తి కథలు

కాశీ ఖండం.. 107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజపాన మహా మంత్రం యొక్క సంకల్ప మాత్రం చేతనే దూర దేశ వార్తలు వినగల్గును. దూర దేశ దృశ్యాలని సందర్శించవచ్చు. నూరు యోజనాల దూరాన్ని గడియకాలంలో నడవవీలు అవుతుంది. అంతకుముందు వినివుండని శాస్త్రాన్ని కూడా వ్యాఖ్యానించవచ్చు. అణిమ, గరిమ, మహిమాది అష్టసిద్ధులని పొందవచ్చు. పరకాయప్రవేశం చేయ వీలుపడును. పక్షి, కీట, మృగాది వివిధ జీవజాతుల భాషలు తెలుసుకోవచ్చు. అతడి శరీరం దివ్య గంధంలా సువాసిస్తుంది. దివ్యతేజస్సులా వెలిగిపోతూ వుంటుంది.
దివ్యకర్మలని, దివ్యకళని తాలుస్తుంది. షడంగాలతో డియోగ విద్య నభ్యసించిన సాధకుడు మోక్ష నగరపు ద్వారకవాటాన్నా తెరవడానికి కుంచె కోల వంటిది’’. ఇంతవరకూ నీకు విశదం చేసినది అంతా షడంగయోగం. ఇటుపైన బాహ్యం అయిన షడంగయోగాన్ని వినిపిస్తాను. ఏకాగ్రతతో ఆలించు.
ఓ అగస్త్య మహామునీ! విశే్వశ్వరస్వామి, విశాలాక్ష్మీదేవి, అమరనది అయిన గంగ, ప్రమథసేనానాయకుడైన దండపాణి, డుంఠి విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు అనే ఆరుగురు షడంగాలు గల యోగవిద్య కాశీనగరం అని తెలుసుకోవలసింది.
విశే్వశ్వర లింగం, త్రివిష్టపేశ్వరుడు, వీరేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, కృత్తికాసేశ్వరుడు- ఈ ఆరు శిలలింగాలతో ఆరు అంగాలు కల యోగ విద్యామూర్తిగా కాశికానగరాన్ని తెలుసుకో.
రాగద్వేషాలు, అస్మిత, అవిద్య, అభినివేశం అనే అయిదు క్లేశాలు లేని అక్లిష్ట చరిత్రా! అగస్త్యవౌనీ! వారాణసీపుర వీధుల సంచారం ఖేచరీముద్ర. శీఘ్రంగా ఆనందకాననానికి (కాశీకి) రావడం ఉడ్డీయానం అనే మంగళకరమైన ముద్ర.
కాశీ చెంతవున్న గంగాజలం తలదాల్చుట జలంధరీ ముద్ర- మునివరేణ్యా! శివుడి రాజధానియైన కాశీలో చేసిన సద్య్రతాలు మూల బంధ ముద్ర. మహాశ్మశానం మీది భక్తిముద్రయే మహాముద్ర. షడంగాలతో, పంచముద్రలతో సమన్వితంగా నీకు పరమయోగ్య విద్యని చెప్పాను. ఈ విద్యని మరవక స్థిరంగా దీనిని ఆత్మలో నిలుపుకో! అని కుమార స్వామి విశదం చేశాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆయుస్సు అవసానకాలాన్ని ఏ ఉపాయంతో తెలుసుకోవచ్చునో నాకు ఎరిగించేది’’ అని కోరాడు. అరిష్టాలు ఏవి? అపశకునాలు చూచి తెలుసుకోవచ్చు? నాకు తెలుపవలసింది.
అంత షణ్ముఖుడు అగస్త్య సంయమీశ్వరుడితో ఈ విధంగా నుడవసాగాడు.
కాలజ్ఞాన కథనం
ఏ మానవుడికైనా ఎడమ వంక ముక్కుపుటంలో ఊర్పు వెలుపలకిన్ని లోపలికిన్ని సంచరిస్తుందో, పెద్దగా పింగళానాడిలో- అంటే కుడివైపు ముక్కు చెరమలో సంచరించునో అటువంటి మానవుడు మూడేండ్లలో మరణాన్ని పొందుతాడు.
సుధర్మిణి అయిన లోపాముద్రాపతీ! అగస్త్యవౌనీ! ఏ మనుజుడి మూడు రేయింబవళ్లుగాని, రెండు రేయింబవళ్లుగాని సూర్యుడు- అంటే పింగళనాడి- కుడి ముక్కు పుటంలో మాత్రమే సంచరిస్తుందో ఆ మానవుడు ఒక్క ఏడాది కంటె బ్రదుకడని చెప్పుతారు, ఆర్యులు- ఏ నరుడికి ముక్కుపుటాల రెండింటిలోను అంటే- కుడి, ఎడమ ముక్కు పుటాల్లో- ఉచ్ఛ్వాశ నిశ్శ్వాసాలు పది దినాలు సరిసమానంగా ప్రసరిస్తాయో ఆ నరుడు మాసత్రయంలో మృతి చెందుతాడు.
ఏ మనుష్యుడికి ప్రాణవాయువు రెండు నాసికాపుటాల్లోను ప్రసరించక క్షీణమై సన్నపడినది అయి నోటి నుంచి వెలువడుతుందో ఆ మనుష్యుడు మూడు దినాలలో ప్రాణాలు విడుస్తాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి