భక్తి కథలు

కాశీ ఖండం.. 108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్వలాసురవైరీ! ఎవడు ఆకస్మికంగా- ఆకాశంలో బంగారు వనె్నకల కృష్ణ పింగళవర్ణుడు అయి పురుషుణ్ణి వీక్షిస్తాడో వాడి ఆయుర్దాయపు గడువు రెండు సంవత్సరాలు మాత్రమే వుంటుంది.
ఏ మానవుడు అయినా బలధృడత్వం చాలక తుమ్ముని, రేతస్సుని, మలమూత్రాలకిగాని విడి విడిగా విడువక మూత్రాన్ని విసర్జించే తరిలోనే వీర్యం, మలం, తుమ్ముల్నిగాని- లేక తుమ్ము వచ్చినపుడే పైవానిని గాని ఒక్కసారియే విసర్జించడం జరుగుతుందో- అటువంటి మానవుడు ఒక సంవత్సరం గడచిన పిమ్మట రోజులో సగభాగం అయినా జీవించలేడు.
ఏ జనుడు అరుంధతీ దేవిని చూడలేదో, ధ్రువుణ్ణి కానలేడో, విష్ణువు పాదత్రయాన్ని చూడడో, మాతృమండలాన్ని కన్నులు కనబడుతూ వున్నా వీక్షింపలేడో, ఆ జనుడికి ఆరు నెలలు గడిచిపోగా యముడి సౌధశ్రేణులు కనవస్తాయి.
స్థిరవివేకీ! అరుంధతీదేవి అనగా నాలుక. ధ్రువుడు అంటే నాసికాగ్రభాగం విష్ణుపదం భ్రూమధ్యభాగం. మాతృ మండలం అంటే నేత్రరోమాలు.
నలుపు మొదలైన రంగున్ను, పులుపు, తీపి మొదలైన రుచిన్నీ అన్యథా భావాన్ని- అంటే నలుపు నలుపుగా కాక వేరొక రంగుగాను, పులుపు పుల్లగా కాక మరొక రుచిగాను పొందినా, దంతాలు, పెదవులు, కంఠము, దవుడలు, జిహ్వాగ్రమున్ను వేరొక రంగుని పొందినా, గోరులు, వీర్యము, కంటికొలుకులు పొగవలె ధూమ్రవర్ణాన్ని పొందినా, ఆకాశంలో రాత్రివేళ ఇంద్రధనుఃఖండం కనిపించినా మనుష్యుడు ఆమాసాల్లో మరణిస్తాడు. ఊసరవెల్లిగా మారిన తొండ తెలతెలవారుతూ వుండగా వచ్చి పాదాలనుంచి శిరస్సు వరకూ ప్రాకితే ఆ మానవుడు ఆరు నెలల్లో యముడి ముఖాన్ని దర్శిస్తాడు.
స్నానం ఆచరించిన అనంతరం ఎవడి పాదాలపైని, హృదయంపైని నీళ్లు వెనువెంటనే తడి ఆరిపోతూవుంటాయో, అద్దంలోని ప్రతిబింబం- లేక నీడ- ఎర్రగా కానవస్తుందో వాడు ఆరుమాసాల్లో స్వర్గలోకానికి అరుగుతాడు.
అంతేకాక తన నీడ కదలడం, మతిమరపు, ఇద్దరు చంద్రులు, ఇర్వురు సూర్యులు కనవచ్చుట, పగటి సమయంలో నక్షత్రాలు కనబడడం, రాత్రుల్లో నక్షత్రాలు కానరాకపోవడం, ఆకాశంలో గంధర్వ నగరాలు వీక్షించడం, పిశాచాల నృత్తాలు కానరావడం, శ్రవణాల విను కలి తగ్గిపోవడం, స్వప్నంలో పిశాచాలవల్ల, ఖరములవల్ల, కాకులవల్ల, భూతాలవల్ల, ప్రేతాలవల్ల, కుక్కలవల్ల, గ్రద్దలవల్ల, నక్కలవల్ల బాధయున్ను, ధూళిరాసుల మీదా, యూపస్తంభాలమీద, పుట్టలమీద ఎక్కడం, నూనె రాసుకోవడం, క్షురకర్మ చేయించుకోవడం మొదలైనవి మరణాన్ని సూచిస్తాయి.
ఈ అపశుకునాల్లో ఏదైనా ఒక అపశకునం కలలో చూసి, మనస్సులో కడు దుఃఖం పొందక మనుజుడు అత్యధిక ఆనందంతో కాశీనగరానికి అరుగుట మేలు’’ అని తెలియజెప్పాడు.
నెమలివాహనా! ప్రపంచ భావం లేనిదిన్నీ, నిర్వికల్పమున్ను, నిరాకారమున్ను, నశించిన సమస్త ఉపాధులు కలదిన్ని, నిత్యమున్ను అయిన పరబ్రహ్మక్షేత్రం ఏ క్షేత్రాన్ని ఆశ్రయించి వుంటుంది? ఏ క్షేత్రంలో మాత్రమే ఫాలాక్షుడు సంసారాన్ని తరింపజేసే తారకబ్రహ్మ విద్యని ప్రతిపాదించే ఏకాక్షరాన్ని కర్ణేజపుడై (చెవిలో ఊదువాడై) కీటకాలు, పక్షులు, క్రిములు, సర్పాలు మున్నయిన జంతువులకి ప్రాణావసాన సమయంలో అభయం ఒసగుతుందో, ఏ క్షేత్రానికి ఉత్తమ ముఖంగా ప్రవహించేది అయిన ఆకాశగంగ లేక గంగానది మిక్కిలి చేరువలో వౌక్తికహారం మాదిరిగా ప్రవహిస్తూ వుంటుందో.. ఇంకా....

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి