భక్తి కథలు

కాశీ ఖండం.. 109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ క్షేత్రానికి సమీపంలో మణికర్ణికాతీర్థం తీర్థరాజమో, చంద్రకిరణ సమూహం అనే సంశయంతో దాన దీక్ష పూనిక నిర్మల జలాల తరంగ మాలికలయొక్క- శత సహస్ర, లక్ష, కోటి, అర్బుద, న్యర్బుదాలు కలది అయి ఉత్కర్ష పొందిందో అటువంటి అవిముక్త కానన క్షేత్ర మహిమని ఇంకా విన కుతూహలంగా వుంది. ఆనతి ఇవ్వవలసింది’’ అని ప్రార్థించాడు. అంత కుమారస్వామి కరుణాళువై అగస్త్య మునికి ఇట్లు చెప్పసాగాడు.

దివోదాస వర్ణనము
విప్రవతంసా పద్మకల్పంలో స్వాయంభువు మనువు కాలంలో అరువై యేండ్లు అనావృష్టివల్ల ధరిత్రి అంటే భూతధాత్రి మిక్కిలి దుఃఖపడి గొప్ప ఉపద్రవాన్ని పొందింది. అప్పుడు మనుజులు నిప్పచ్చరంతో పేదలు అయి సముద్రాల్ని, పర్వతాలని, కాననాలని ఆశ్రయించారు. అంగళ్లలో- అంటే రచ్చలలో సంచరించడానికి మనుజుడు అన్నవాడు లేక గుడి, పాడుపడిన ఇల్లు, మిగిలేటట్లు జనపదాలు పాడుపడ్డాయి. ఉద్యానవనాలు, వాపిలలో దిగుడు బావుల్లో- జలాలు లేక చెట్ల తోపులు వాడిపోయాయి. బెబ్బులులు మొదలైన మాంసాహారాన్ని భుజించే క్రూర మృగాలు ఎక్కడ చూస్తే అక్కడ విజృంభించాయి. నిరంతరం తాను సృజించే జీవకోటి కరవుపాలపడి ముఖాలు, కాళ్లు వాచి వండుతూ వుండగానే్న తినిన బూరెల మాదిరిగా, నశించిపోగా, దిగ్భ్రాంతి చెంది, చేష్టలు ఉడిగి నివ్వెరపాటు పొందాడు.
రాజులేని కారణంగా అన్ని రాష్ట్రాలకి బాధ కలుగగా, భూమి లోపల అరవై యేండ్లు అనావృష్టి అధికంగా ఏర్పడింది. వెర్రి పుచ్చకాయలు మాత్రం అపరిమితంగా కాసాయి. అపుడు మనోవ్యధవల్ల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రజలు క్షీణించడం కారణంగా యజ్ఞాది క్రియలు నశించాయి. యజ్ఞయాగాది కర్మలు నశించడంవల్ల యజ్ఞ్భోక్తలు భూప్రజలట్లు హవిర్భాగాలు లేకపోయిన హేతువువల్ల ఆకలిచే నకనకలాడుతూ అలమటింపసాగారు. ఇటుపైన ఏమి చేయగలను? సర్వ సమర్థుడైన ఒకడికి పట్టం కట్టనినాడు సమస్త భూమండలం ఇంద్రుడు వర్షింప మండడంవల్ల ఎండిపోయి, బెండయి నిరర్థకం అయిపోతున్నది. సకల ధరణీ మండల రక్షణ దీక్షా దురంధరుడు అయినంతటివాడు- మహాపురుషుడు ఎక్కడ లభిస్తాడో అని వెదకి, మనువంశ ప్రభువైన రిపుంజయుణ్ణి కనుగొని, అతడి ఔదార్యం, ధైర్యం, శౌర్యం- ఆది గుణౌతృష్ట్యాన్ని వివేచన చేసి, బహుమానసహితంగా ఆ రిపుంజయుడితో ఈ గతి వచించాడు.
‘‘స్వాయంభువ మనువు వంశానికి కిరీట భూషణుడా! ఓ రిపుంజయ ప్రభువా! లవణాబ్ది సరిహద్దుగా ధరణిని పరిపాలించు. నా అనుగ్రహంవల్ల ఇంద్రుడిని మించిన సామర్థ్యం నీకు సర్వకాల సర్వావస్థల్లోను లభించగలదు. దేవతలతో సంపూర్ణమైన మైత్రివల్ల నువ్వు దివోదాసు అనే పేరు విఖ్యాతితో తాల్చుతావు. సర్పరాజైన వాసుకి కుమార్తె ‘అనంగమోహిని’ నీకు పత్ని అవుతుంది’’ అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు.
రిపుంజయుడు బ్రహ్మదేవుడి ఆదేశాన్ని మహాప్రసాదం అంటూ ఆదరించి- బ్రహ్మతో గంభీరవాక్కులతో ధరణీశ్వరుడు ఈ విధంగా నుడవసాగాడు.
నిండు కరుణతో నన్ను ఈ సముద్ర పరివేష్టితం అయిన భూమండలానికంతటికి ప్రభువుని చేయ నిశ్చయిస్తే బ్రహ్మదేవా! నీ మనసులో తప్పుగా ఎంచక నా ప్రతిజ్ఞ వినవలసింది. సర్పరాజులున్ను, దేవతలున్ను వారి వారి లోకాలైన పాతాళ స్వర్గలోకాలలోనే నిలిచి వుండాలి. భూమిపై ఒక్కడున్నా నేను రాజ్యం ఏలను. ఇది బాస- ఇది సత్యం’’ అని పలికాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి