భక్తి కథలు

కాశీ ఖండం.. 114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో భూపాలుడైన దివోదాసు సమక్షానికి చని వంటలవారి గుంపు శంకించి శంకించి మెల్లగా విన్నపము చేసింది- సంతాపం కలిగించే ఉక్తిని చెప్పేటప్పుడు వెరచి చెప్పటమే నీతి- రాజుల మనస్సులు దిరిసెన పువ్వులు, శిశువులు మాదిరిగా మరీ సుకుమారములైనవి. మా విన్నపాన్ని అవధరించు- మనస్సులో నిలుపుకో- నీ పరాక్రమాటోపానికి వెనుదీసియేమో కాని ఈ కాశీపురంలో నిలవడానికి పదిలమై వుండక అగ్ని పలాయనమయిపోయింది!
ఓ సూర్య వంశ నృపాలా! నేడు భోజనం సూర్యపాకం చేత చెయ్యబడింది. భోజనశాలలో పద్మలోచనలు అయిన స్ర్తిలు పళ్లెరం వుంచారు. రెండవ జాముని తెలియపరచే గంట మ్రోగింది. ఆరగించే వేళ అయింది’’ అని శీఘ్రంగా విన్నవించారు. ఇది వేల్పులు ఒనర్చిన దుర్వ్యాపారం అని గ్రహించి - ఇంతే కాక వేరేమి ఉంది’’ అని తలంచుతూ దివోదాసుడు సూర్య కిరణ తాపం చేత ఉష్ణం చేత పచనం అయిన పదార్థాలను ప్రీతితో ఆరగించాడు.
భోజనం అనంతరం ఆస్థాన మధ్యభాగంలో కొలువిచ్చి, దివోదాసు ఇంద్రాది దేవతలు కావించిన అపకారానికి ప్రతిక్రియ- లేక ప్రతికారం ఆలోచించే సమయంలో పురాల్లోను జనపదాల్లో నివసించే ప్రజలు అగ్నిదేవుడు అంతరార్థానం అవడానికి భీతిల్లి, ఆ మహోత్పాన్ని భూపతికి విన్నవించుకోవడం కోసం ఏతెంచారు. సూర్యవంశోత్తముడు ఆ పౌరులను అందరినీ ఆదరించాడు. వారి ఆత్మలు ఆనందం పొందేటట్లు ఈ విధంగా చెప్పాడు. ‘‘్భప్రజలారా! నాకలోకవాసులు ఒనర్చిన కీడు నాకు తాకుతుందా? మీరు వెరవకుండా వుండండి. నేడే నా యోగశక్తిచేత ఈ కాశీలో ఈ ఆనంద కాననంలో అగ్నికి ఒనగూర్చుతాను- ఏ మాత్రం సంశయింపక ఆ అధములైన దేవతలు మాయాకల్పన అనే వంచనతో సకల ప్రాణులను హింసించే తలంపుతో అగ్నిని హరించారు. సరే ఇంత మాత్రానికే నా యోగశక్తి మహిమకి లోటు వాటిల్లుతుందా? సనె్నకల్లు దాచినంత మాత్రం చేత పెండ్లి ఆగిపోతుందా? వారి దుష్ట స్వభావాలే బయటపడతాయి.
అగ్నిరూపాన్ని తాల్చి యజ్ఞాలలో హవ్య కవ్య ఆహుతులు నేనే కైకొంటాను. పర్జన్యుడి స్వరూపాన్ని కైకొని పంటలు పండే విధంగా సలిలధారల (వానలు) నేనే కురిపిస్తాను. సూర్యచంద్రుల రూపాలు తాల్చి నేనే గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తాను. వాయుదేవుడి ఆకృతి ధరించి నేనే ప్రాణుల లోపల వెలుపల వ్యాపించి వుంటాను. సర్వదేవతలు నేనే అయి వివిధ కృత్యాలతో సకల లోకాన్ని రక్షిస్తాను. వేయి మాటలెందుకు? ఇటుపైన భావికాలానికి ఇక్కడ నేనే యోగశక్తిచేత పాతాళ లోకాన్ని స్వర్గలోకాన్ని పరిపాలిస్తాను అని యోగ విద్యాబలం చేత సర్వదేవతామయుడై దివోదాసు రాజ్యంచేస్తున్నాడు. అంత అక్కడ పరమేశ్వరుడు మందరాచలం మీద నివసించి కాశీ వియోగ వేదనా బాధితుడైన ఆ కాశీకిపోయే ఉపాయాలు తలపోయసాగాడు. అపుడు శివుడు చల్లని చంద్రకళాధరించిన్నీ, గంగాధరుడయిన్నీ అవార్యం అయిన కాశీవియోగం అనే దెబ్బచే కలిగిన సంతాప భారాన్ని సైరింపలేకపోయాడు.
ఈశ్వరుడు యోగినులను కాశీకి పంపుట
అంత ఒకనాడు శంకరుడు గజానన, సింహముఖి, గృధ్వ్రాస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, హయగ్రీవ, వారాహి, శరభావన, ఉలూకిక, శివారావ, మయూరి, మకుటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన, శుష్కోదరి, లలజ్జిహ్వ, దంష్టోగ్ర, వానరానన, ఋక్షాక్షి, కేకరాక్షి, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్షాక్షి, శుకి, శే్యని, కపోతిక, పాశహస్త, దండహస్త, ప్రచండ అను యోగినులను మరియు...

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి