భక్తి కథలు

కాశీ ఖండం.. 118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తోడి స్నేహితులు, సఖులు దూరం నుంచి పాణి పద్మాలు ముకుళించి, ఫాలభాగాలపై మోపిన నమస్కారాలు ఒనరించారు. క్రీడాసక్తుడయిన ఆ సాంబకుమారుడు ఆటలాడసాగెనే కాని నారద మునీంద్రుడికి అంజలి చేయలేదు. పెద్దవారికి కూడా ఒక్కొక్క తరిని వివేకం కలుగదు.
దేవముని అయిన నారదుడున్ను తన మనస్సులో సాంబుడు నమస్కరింపలేదనే కోపం ఒక వంక వుంచుకొని యాదవ కుల సార్వభౌముడైన శ్రీకృష్ణుని కని, ఆతని పూజ కైకొని ఇష్టగోష్టిలో ప్రసక్తానుప్రసక్తంగా అన్న రీతిని, హెచ్చరిక చేస్తున్న విధంగాను, ‘‘స్ర్తిలను నమ్ముకొని ఏమరుపాటుగా వుంటే మోసం సుమా!’’ అని అంటూ సాంబుడిని ధూర్తుడిగా పేర్కొన్నాడు.
నారదుడావిధంగా పేర్కొని, కృష్ణుడిచే సత్కారం స్వీకరించి, ఆ సమయంలో దివికి అరిగాడు. శంఖ చక్రధారి అయిన శ్రీకృష్ణుడు ఎంతగానో శోధించి, శోధించి సాంబుడిమీద దోషం లేశం అయినా పొడగాంచలేకపోయాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకి చలపాది లేక కలహ భోజనుడు నారదుడు సాంబుని అణచివేసే వరకు వ్రతం పట్టాడు. శ్రీకృష్ణుడు- అంతఃపురంలో వుండే వేళ కనిపెట్టి ద్వారకానగరానికి అరుగుదెంచాడు.
ద్వారకకి ఏతెంచి నారదుడు సాంబుని వెదకిపట్టుకొని శ్రీకృష్ణుడికి తన రాకని ఎరిగింపుమని చెప్పాడు. ఆ సమయంలో అంతఃపురానికి వెళ్లడం అనుచితం అనీ, పోకుండా వుండడమున్ను తప్పదని తలచి సాంబుడు ఏమి చెయ్యాలని మనస్సున భయపడ్డాడు.
ఎట్టకేలకు అంతఃపురంలో వున్న తండ్రి సన్నిధి కరిగి- సమయం కాని సమయంలో రావడం అపరాధం అవడం కారణంగా శ్రీకృష్ణుడి చేత సాంబుడు కుష్ఠువ్యాధి బాధితుడుగా శప్తుడు అయాడు.
పిమ్మట తండ్రి అయిన శ్రీకృష్ణుడికి, దేవవౌని నారదుడుకి ప్రమాణాలు చేసి, ఆ జాంబవతి ముద్దుపట్టి శాపావసానం అడిగి తెలుసుకొన్నాడు. కాశీక్షేత్రానికి అరిగి అత్యంతమూ గాఢభక్తితో సూర్యుణ్ణి కొలిస్తే- అర్చిస్తే- ఈ కుష్ఠవ్యాధి మానుతుంది అని తెలుసుకొన్నాడు.
ఈ విధంగా నారద ముని అనుజ్ఞతో శ్రీకృష్ణుడి చేత శాప విమోచనం కలిగే విధానం తెలుసుకొని సాంబుడు కాశీకి ఏగి, వారిద్దరూ ఉపదేశించిన రీతిగా రవిని సేవించి కుష్ఠవ్యాధిని నిర్మూలింపజేసుకొన్నాడు.
గరుడాదిత్య మయుఖాదిత్య మహాత్మ్యము
సంయమివంతసుడైన కశ్యప ప్రజాపతికి, వినతా మహాదేవికి తనూజుడు గరుత్మంతుడు. ఆ ఖగరాజు సముద్రంలో వున్న జాలరి తతుల్ని భుజించేప్పుడు, బ్రాహ్మణుడిని ఉమిసిన వివేకి. గజకచ్ఛపాలని రోహిణి తరుశాఖతో ధరించి గగనం ఎగిరిన వాయువేగి- సర్పకోటిని గెలిచి, మంటలార్పి, వేగాతివేగంగా తిరుగాడే చక్రం దూరి అమృతాన్ని గ్రహించిన అమితబలుడు. ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి ఒక రెక్క ఈకను మాత్రం ఇచ్చిన దాత. విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడునున్న అతడి అన్నలు, తాను, తల్లియున్ను కాశీ క్షేత్రంలో నలుగురు అర్కుల్ని - ఆదిత్యల్ని సేవించారు’’.
అని తెల్పగా అగస్త్య సంయమి హస్తయుగళం ముకుళించి ‘‘పార్వతీ హృదయానంద వర్థనా! కుమారస్వామీ! ఒక సందేహం అడుగుతాను. తెలియచెప్ప. దక్షప్రజాపతి పుత్రి, కశ్యప బ్రహ్మ భార్య, గరుత్మంతుడి జనని అయిన వినత ఏ కారణంవల్ల దాస్యం చెయ్యవలసి వచ్చింది’’ అని అడుగగా కార్తికేయుడు అగస్త్యుడితో ఈ కరణి వాకొన్నాడు.
తన సవతియైన కద్రువ శేషుడు, తక్షకుడు మొదలుగా వేయిమంది సర్పశ్రేష్ఠుల్ని కన్నది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి