భక్తి కథలు

కాశీ ఖండం.. 125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివోదాసుని మెప్పించి, ఆ రేని పురోహితులలో ఒకడు అయి ప్రవర్తించమొదలుపెట్టాడు.
అంత ఒకనాడు- కాశీనగరంలో నలువంకల దినదినం ఎడతెగక పుట్టే దుర్నిమిత్తాలు పౌరులు విన్నవింపగా ఆలకించి, నరపాలుడు అచ్చెరువంది, వాటికి ప్రతీకారము ఆచరించడానికి తన హిత కాంక్షి అయిన డుంఠి విఘ్నేశ్వర భట్టారకుణ్ణి పిలిపించి, ఆసీనుడిని కావించి ప్రీతి చిగురించగా ఈ గతి వాకొన్నాడు.
ఓ డుంఠి భట్టారకా! కాశీపురంలో అపశకునాలు పుట్టుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? పాపం ఏ విధంగా వాటిల్లింది. ఏ వంక ధర్మం నశించినదో! వచింపుము అని ప్రశ్నించాడు. అప్పుడు డుంఠి భట్టారకుడు ఈ కరణి నుడివాడు.
‘నృపాలోత్తమా! ఈ గొప్ప అపశకునాలకి మంత్రరూప రక్షణ బలం చేత శాంతి కావిస్తాను. నాకు తోచిన విషయం చెప్పుతాను విను. నువ్వు కొన్నాళ్లు ఈ కాశీనగరాన్ని విడిచిపెట్టి వేరొక తావున నివసించడం మేలు!
ధనం ఆత్మార్థమే - ధ్యానం, పశువులు, హితులు, ఆప్తులు, బంధువులు కూడా తన కొరకే! గృహౌన్నత్యమున్ను ఆత్మార్థమే వీటిని తన కోసం ఆపదలు కల్గినపుడు పరిత్యజింపక తప్పదు. ఆత్మార్థపృథివీ త్యజేత్ (తనకోసం రాజ్యాన్ని అయినా విడిచిపెట్టాలి) అనే వాక్యం విని వుండలేదా? అని వచించి, ఇంకా పెద్దలతో విచారించవలసింది. నేను త్రికాలజ్ఞుడిని. ఈనాటికి పద్ధెనిమిదవది అయిన రోజుకి ఉత్తర దేశం నుంచి ఒక బ్రాహ్మణుడు రాగలడు. అతడు నీకు హితోపదేశం కావిస్తాడు. అతడి వాక్కులు ప్రమాణాలుగా స్వీకరించవలసింది’’ అని డుంఠి భట్టారకుడు నిజ నివాసానికి అరిగాడు.
శివుడు విష్ణువుని కాశీకి అనుచుట
విశే్వశ్వరస్వామి పుండరీకాక్షుడయిన విష్ణుమూర్తిని కనుగొని గజముఖుడున్ను నీవున్ను ఏక కార్యకరణ పరులై పరిశీలించండని, కాశీపుర వార్తలు అరసి చూడ పంపించాడు.
రాజీవాక్షుడు శివుడు చెప్పిన కార్యభారం వహించి, కాశీకి అరిగి, ఆ పుర వైభవ లక్ష్మిని పరికించే వేళలో విష్ణుమూర్తి విశాలాలు, పొడవులు అయిన కన్నులు కల్గిన ఫలాన్ని కనుగొన్నాడు.
గంగావరణా నదుల సంగమ స్థానంలో పాణితలాలు, పాతతలాలు ప్రక్షాళించుకొని లోపలికి దిగాడు. ఆ కారణంగా ఆ తీర్థం ‘పాదోదకం’ అని వనె్నకెక్కింది. పుండరీకాల వంటి లోచనాలు కల విష్ణుమూర్తి కాలానికి ఉచితాలైన క్రియలు నిర్వర్తించి, కాశీ ప్రజల ధర్మప్రవర్తనని హరించడానికి- పూర్వం త్రిపుర స్ర్తిల శీలాలు అపహరింప బుద్ధ వేషం తాల్చిన మాయగాడు విష్ణుమూర్తి బుద్ధవేషం ధరించాడు.
పుణ్యతీర్థుడు అనే నామం పెట్టుకొని న ముఖ్యభృత్యుణ్ణి గరుత్మంతుణ్ణి వినయకీర్తి నామధేయం వహించమని అతడిని శిష్యుడిగా చేసుకొన్నాడు. ఇక లక్ష్మీదేవిని పరివ్రాజికని కావించి ఆమెకి విజ్ఞాన కౌముది అనే నామధేయం కల్పించాడు. తానున్ను శిష్యుడు వినయకీర్తియున్ను ఒకవైపు నుండి, పురుషులని మోసగించడం కోసమున్ను- లక్ష్మీదేవి అనగా విజ్ఞానకౌముది పరివ్రాజక స్ర్తి జనాన్ని ప్రలోభింపచేయడానికిన్ని- వేరొక వంక నుంచి ప్రవేశించారు.
విష్ణువు మాయావేషంతో కాశిలో బౌద్ధమతం స్థాపించుట
వస్త్రం మీద దేవనాగరీ లిపిలో సుస్పష్టంగా మషీరసంలో ముంచిన తూలికతో వ్రాసిన బౌద్ధమత ఆగమ గ్రంథాన్ని శిష్యుడు ఆ తరంలో పఠించగా గురుడు బోధించాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి