తెలంగాణ

వైభవంగా ముగిసిన పెద్దగట్టు జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 16: సూర్యా పేట జిల్లాలో దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర గురువారంతో ముగిసింది. జాతర జరిగిన ఐదురోజుల పాటు పెద్దగట్టు ప్రాంతం భక్తుల నినాదాలతో హోరెత్తింది. ఈసారి జాతరకు చివరిరోజు కూడా భక్తుల రద్దీ అధికంగానే కన్పించడం విశేషం. ఐదవరోజు అమ్మవారికి బోనం సమర్పించి నైవేద్యంగా పెట్టి అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గొర్రెపిల్లను బలిఇచ్చి జాతర ప్రారంభానికి తెచ్చిన మకర తోరణాన్ని యాదవ కులపెద్దలు సూర్యాపేటలోని గొల్లబజారుకు తరలించడంతో జాతర పరిసమాప్తమైంది. జాతర ప్రారంభమైన ఆదివారం అంతంతమాత్రంగా ఉన్న భక్తులు అదే రోజు అర్ధరాత్రి అనంతరం ప్రవాహంలా తరలిరావడంతో అటు జాతర నిర్వహకులు, ఇటూ వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతర ప్రారంభమైన మొదటి రెండురోజులు యాదవులు తమ మొక్కులను చెల్లించుకునేందుకు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల గంపలను నెత్తినపెట్టుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలను విన్నవించుకొని జంతుబలులిచ్చారు. మిగిలిన రెండురోజులు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్త జనప్రవాహం గురువారం సాయంత్రం వరకు కన్పించింది. జాతర గురువారం ముగియడంతో అధికశాతం వ్యాపారస్తులు తమ దుకాణాలను తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరో ఒకటిరెండురోజులపాటు కొద్దోగొప్పో భక్తులు హాజరవుతారనే నమ్మకంతో కొంతమంది వ్యాపారులు మాత్రం తమ వ్యాపారాలను ఎత్తివేయకుండా కొనసాగించేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 60 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసికి మొత్తం ఎంత ఆదాయం వచ్చిందనే విషయం ప్రకటించాల్సి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిన గొల్లగట్టు జాతర మళ్లీ రెండేళ్ల తర్వాత 2019 సంవత్సరంలో జరగనుంది. జాతర చివరి రోజున జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ సుంకరబోయిన శ్రీనివాస్ దంపతులు నూతన వస్తల్రను అందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యవసాయ, విద్యుత్‌శాఖల మంత్రుల పిఎలు రాఘవేంద్ర, బుసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలతో పాటు కలెక్టర్, సూర్యాపేట డిఎస్పీ సునీతామోహన్ కుటుంబసభ్యులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.