భక్తి కథలు

కాశీ ఖండం.. 142

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవ్యచరిత్రా! ఈ హంసతీర్థాని డాసి అన్ని దిక్కులా పదివేల మూడు వందల శివలింగాలు ప్రతిష్ఠితాలై అలరారుతున్నాయి. అవి అన్నీ మనోభీష్టప్రదాలు సుమా!
లోమకేశ్వరలింగం, మాలతీశ్వరలింగం, అంతకేశ్వరలింగం, జనకేశ్వరలింగం, అసితాంగ భైరవ తీర్థం, శుష్కోదరీ తీర్థం, అగ్నిజిహ్వం, మణికుండం, మహాబలలింగం, శశిభూషణ లింగం, మహాకాళతీర్థం, యోగదేవేశ్వర తీర్థం, మహానాథ తీర్థాలున్ను, విమలేశ్వరలింగం, మహాదేవలింగం, పితామహేశ్వరలింగం, రుద్రస్థలీతీర్థం, చండీశ్వరలింగం, నీల కంఠేశ్వరలింగం, విజయేశ్వర, శ్రీకంఠేశ్వర, కపర్దీశ్వర, యక్షేశ్వర, జయంతేశ్వర, త్రిపురాంతక లింగాలు కుక్కుటేశ్వర త్య్రంబక హరిశ్చంద్రేశ్వర, చతుర్వేదేశ్వర, సహస్రాక్షేశ్వర, ఈశానేశ్వర, కాలకలశేశ్వర, కామేశ్వర లింగాలున్ను, కపాలమోచన తీర్థము, దీప్తేశ్వరామేశ్వర స్వయం భూమహాలక్ష్మీశ్వర, ధరణీవరాహేశ్వర లింగములున్ను, గణపతి క్షేత్రమున్ను, మత్స్యోదరీ తీర్థమున్ను, భూర్భువస్సర్లింగాలున్ను, హాటకేశ్వర, కిరాతేవ్వర, భారభూతేశ్వర, నాకులేశ్వర, నైరృతేశ్వర, జలప్రియ, జ్యేష్టేశ్వర, దేవేశ్వరోంకారేశ్వర ప్రాసాద లింగాలు ఇవి అరవై ఎనిమిది శివాయతనాలు.
శక్తిప్రకరణము
శీతకిరణ కళాధరుడున్ను, పరమశివుడున్ను అయిన మహాదేవుడి ధర్మపత్ని, పర్వతరాజకుమారి అయిన పార్వతి చేత, లలితాదేవి చేత, జగజ్జనని చేత, హ్రీంకారం అనే పద్మ సరస్సులో విహరించే హంస అయిన విశ్వభుజాదేవి చేత పశ్చిమా నాడీ వీధిందు పరమయోగులు దర్శించే ఫలం అయిన శివదూతి అయిన చిత్రఘంటాదేవిచే రాక్షసులకి భయంకరురాలైన భద్రకాళికాదేవి చేత కృపామయి అయిన నిగళ భంజనాదేవి చేత శ్రీకాశీనగర గరిమని కైకొన్నది. భక్తులు అనే చిలుకలకి గున్న మామిడి అయిన కుబ్జామహాదేవీ, విష్ణువు గారాబు రాణి అయిన మహాలక్ష్మి కాశీనగర గ్రామదేవతలు. ఐరావతం అధిరోహించి ఐంద్రి కాశీనగర రాజవీధుల్లో- వజ్రాయుధం చేపట్టి మెలగేవారు. కౌమారి అనే శక్తి శృంగారవనవీధుల్లో నెమలి పిల్లపై ఎక్కి విహరించేది. చంద్రశేఖరుడి ఆదిశక్తి మహేశ్వరదేవి వృషభాన్ని ఆరోహించి అసివారు వెడలేది. వాహ్యాళి చేసేది. బ్రహ్మదేవుడి భార్య సరస్వతి రాయంచనెక్కి అలవోకగా వినోదించేది. వైష్ణవి గరుత్మంతుడి మీదనెక్కి ప్రహరి తిరిగేది. పంచమీ అనే శక్తీ చాముండి అనే శక్తీ తమ తమ వాహనాలు ఎక్కి అహరహం కాశీపురంలో సంచరిస్తారు. ఏ జనుడు శివపురంధ్రి అయిన చిత్రఘంటా మహాదేవిని పూజిస్తాడో ఆ జనుడు ప్రాణాలు పోయే సమయంలో మమహిష కంఠంలోని కఠోర ఘంటారవాన్ని వినడు.
అహంభావపూరితులైన దానవుల మర్దించు వ్యాపారంలో పారీణ అయి హ్రీంకారం అనే మంత్ర హర్మ్య శిఖరాల క్రీడాకళాలోల, కాశీనగరపు అంకస్థలిని నెలకొని యున్న జాలేశ్వరీదేవి నిరంతరమున్ను భక్తజన విఘ్నతతిని తనతర్జనితో జంకేటట్లు చేస్తుంది. వింధ్యగర్వభంజనా! భద్రనాగ నామక మహాతీర్థ పరిసరంలోని భద్రనాసికాతీర్థంలో స్నానం ఆచరించి భద్రకాళీదేవిని సందర్శించుకొనే మనుజుడు శుభస్థితిని పొందుతాడు.సిద్ధి వినాయకుడి పజ్జనువున్న వరసిద్ధి దేవతను ముప్రొద్దును సేవకావిస్తే, శ్రద్ధ్ధానుడయిన మానవుడికి వైభవ సమృద్ధి, సంపత్సవృద్ధి సంపూర్ణంగా సిద్ధిస్తాయి.
కాశిపురికి పెన్నిధియున్ను, నిరవధికమూ, నిర్వ్యాజమూ, నిరభ్యంతరమూ అయిన దయాగుణంచేత అత్యంతమూ అధికురాలైన విధీశ్వరుడు అనే నామం కల శివుడి సన్నిధియందు అర్చించిన నరుడు నిరుపమాన సిద్ధులు పొందుతాడు.
-ఇంకాఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి