భక్తి కథలు

కాశీ ఖండం.. 145

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ సామ్రాజ్య లక్ష్మిని పోలిన నువ్వు ఎల్లవేళలా మాయింట వుండవద్దా? ఇందుకోసమే కదా ఋషీసమూహాన్ని దేవతా కోటిని పట్టితెచ్చి బందిఖానాలో పెట్టాను. ఓ పద్మాక్షీ! వంట యిల్లు కుందేలు చొచ్చినట్లు వుంది. విధి నన్ను ఇక్కడికి పంపినందుకే మెచ్చుకొన్నాం. అడవిలోపల వున్నా గృహంలో వున్నా మనుష్యుణ్ణి పొందవలసిన అదృష్ట లక్ష్మి పొందక తప్పదు అని తన అంతఃపుర గూఢచారులతో ఈమెని అంతఃపురంలోకి కొంపోవలసింది అని ఆనతిచ్చాడు. అయినా కాళరాత్రి కళవళపడక రాక్షసేంద్రుడితో ఈ క్రియ పలికింది.
‘‘ఓ రజనీచర వంశవరేణ్యా! దూతలుగా ఏతెంచిన వారు పలికిన మాటలకి కోపించ తగుతుందా? రాజనీతి విశారదులైన భూపతులు దూతలు తెలియక మాటాడినా తప్పుకాస్తారు. అభిలషిత కార్యసిద్ధికోసరం దూతలు రాజుల్ని తూలనాడడం దోషం కాదు. దిక్పాలురిని సమర భూమిలో జయించావు. నువ్వు దేశ కాలాలు వెదకి చూసి నీతి, పరాక్రమం ప్రయోగింపవా? నన్ను చెరబెట్టిన నీకేమి లాభం? నన్ను ఏలే దొరసానిని పట్టి బంధించకూడదా? నాతోపాటు నీకెందరు పట్టుబడరు? గిరి తనూజాత పట్టుబడినయప్పుడు? నేనిక్కడ చెరలో వుండగా ఆ చంద్రవదనని ఎవరు చూపుతారు నీకు? దీముని లేక మృగం ప్రతిరూపాన్ని కాల్చుకొని తినిన పిదప మృగాలు పట్టువడు త్రోవ ఏది? నన్ను పట్టుకొన్నంత మాత్రాన నగ తనయ నీకు లభిస్తుందా? కాంతని ఏకాంతస్థలంలో వుంచి, మేలి వార్త తెలుపడానికి నీకడకు ఏతెంచిన నన్ను శిక్షింపతగుతుందా? ‘‘ముందుకు దూకి హితం చేసినందుకు ముండముక్కు కోతపడింది’’ అనే సామెత దృష్టాంతానికి వచ్చింది. నీ ఆన పాటించి అంతఃపురంలో వుండే పలువురు శూరులు పయ్యెదని, తలకొప్పుని, చేతిని, చెట్టనీ పట్టి నన్ను మిక్కిలి బాధలు పెట్టుకుతున్నారు.
నీతివేత్తలైన రాజులు పరస్ర్తిలని ఈ విధంగా చేయిస్తారా? ఇది న్యాయమా? ఈ నిగ్రహాన్ని ఏ రీతినయినా మాన్పించు. నీకు ఏ విధంగానైనా మేలు కావిస్తాను’’ అని కాళరాత్రి దయపుట్ట పలుకగా క్రోధాంధుడై ఆ రాక్షస పతి వినీ విననట్లు మిన్నకున్నాడు. ‘పద పద’ అని అంతఃపురంలోని కంచుకులు (అంతఃపుర రక్షకులు) కరకంజాలు పట్టి లాగారు. అప్పుడు ఆ జలజాక్షి కరకంకణాలు ఝణఝణత్కారాలు చేస్తూ వుండగా కేంజేయి విదిలించి లాగుకొని భ్రుకుటులు ముడిచి ఎర్రజిగి తన్నిన కన్నులతో భయం గొల్పుతూ కలకలమని కట్టిక నవ్వు నవ్వి, కన్నుగవ విస్ఫులింగాలు కురియ ఒక్క హుంకారం కావించింది. కల్పాంతకాలంలో చని మేఘ పటలినుంచి రాలుతున్న పిడుగుల భీషణ ఘోషకి తాత అయిన ఆ మహోధ్వనికి గుండెలు అవిసి బెండుపడి ఆ కంచుకులు కాళ్ల కాళ్లతో పెనవేసికొని చాప కట్టు లాగ నేలమీద పడిపోయారు. ఆశ్చర్యమున్ను, మాత్సర్యమున్ను, కోపమున్ను, ఆటోపమున్ను సమగ్రంగా ప్రకాశించగా రాక్షసాధిపుడు దుర్గాసురుడు కరవాలమున్ను డాలున్ను ధరించి, శీఘ్రంగా గద్దెనుంచి క్రిందికి ఉరికాడు. అతడికి అడ్డంగా వచ్చి దుర్ముఖుడు, సీరపాణి, పాశపాణి, సురేంద్ర దమనుడు, ఖడ్గరోముడు, ఉగ్రాక్షుడు, దేవకంపనుడు అనే రక్కస దళపతులు తమ మనస్సంపుటాల్లో ప్రవృద్ధం అయిన గర్వం వహించి, పర్వత సదృశాకారులు గొడ్డళ్లు, బిండివాలాలు, ఖడ్గాలు, త్రిశూలాలు, ప్రాసలు, పట్టిసాలు, తోమరలు మున్నయిన ఆయుధాలు తాల్చి, ఆ కాళరాత్రిని చుట్టుముట్టి బంధించడానికి ఉరవడి చూపారు.
అది గమనించి ఆ మహాదేవి భద్రకాళి అధికం అయిన రౌద్రాటోపంతో తన కడ కంటి చూపు వెనె్నల కెంపారగా మూతిని బిగించి ఉహ్హని ఊదగానే మంటలు లేని నిప్పులు క్రమ్మి వెచ్చని ఝంఝామారుతాలు ఉప్పతిల్లి రాక్షస కోటిని ఒక్కుమ్మడిగా గగన వీధిలో జొన్న చొక్కాకునిలాగు (ఎండుటాకునువలె) ఎక్కడికో కొనిపోయాయి.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి