భక్తి కథలు

కాశీ ఖండం.. 147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురతో పాశపాణీ, త్రిజగన్మాతతో సురేంద్ర దమనుడు తలపడ్డారు. త్రిపుర భైరవిని దేవకంపనుడు ఎదిరించాడు. కామాక్షిని ఖడ్గరోముడు ఎదుర్కొన్నాడు. కమలాక్షితో వజ్రపాణి, త్రిపుర తాపనితో పింగళాక్షుడు, జయంతితో కుక్కుటాస్యుడూ తలపడ్డారు. విజయతో కపింజలుడు, అపరాజితతో కౌకవక్త్రుడు, శంఖినితో ఘాకరవుడు కయ్యానికి కాలుత్రవ్వారు. గజవక్త్రతో శంఖకర్ణుడున్ను, మహిషఘ్నితో జలంధరుడున్ను, రణప్రియతో బకుడున్ను మార్కొన్నారు. శుభానందతో కిమీరుడు, కోటరాక్షితో ధూమ్రవర్ణుడు, వివారావతో ధూమ్రాక్షుడు, త్రిణేత్రతో పింగాక్షుడున్ను తలపడ్డారు. సంగ్రామం ఘోరం అయింది.
కఠోరతరాలైన కంఠములనుంచి వెలువడ్డ సింహనాదం భూమ్యాకాశ మధ్య ప్రదేశంలో వ్యాపింపగా- వింధ్య శైల ఘంటాపథంలో శక్తుల, రాక్షసుల నిష్ఠుర భుజాల యందలి ప్రౌఢాలైన ధనుర్జ్యావల్లీ జనిత ఢాంకారాలు ద్రాఘిష్టాలై దీర్ఘాలై మారుమ్రోగాయి.
ప్రయోగించినవీ, ప్రయోగించనివీ, హస్తాలనుంచి విముక్తాలైనవీ, యంత్ర విముక్తాలైనవీ అయిన ఆయుధ సమూహాలతో రాక్షస కోటి శక్తులతో సరిసమానంగా పోరు సల్పింది.
శక్తిగణాలు, రాక్షస గణాలు సమరం సల్పే సమయంలో అత్యంతమూ శక్తిమంతాలైన వారి బాహువుల్లో వలయాకారాలు అవుతున్న దుర్దమ కోదండ నిర్గత క్షురప్రాసాయుధాలు, భీకర భల్లములు, నారాచాలు, అంజలికాలు, శిలీముఖాలు, అర్థచంద్రాలు అనే పేరులు కల నానా విధ బాణాలు పట్టపగలు కూడా హేరాళంగా అంధకారాన్ని సృష్టించాయి. ఈ క్రమంగా ఉభయ సైన్యాలు సరిపోరు సల్పుతూ వుండగా, ఆ తరిని వింధ్యవాసిని నామక మహామాయాశక్తి వాయవ్యాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగించి, రాక్షసుల అస్త్ర శస్త్రాలని ఎగురగొట్టగా ఆ రక్కసులు నిరాయుధులై విరిగి చెల్లాచెదరయారు. అంత దుర్గాసురుడు శక్తిని సమీపించి తన శక్తి ఆయుధంతో కొట్టాడు.
దుర్గాసురుడు ప్రయోగించిన ఆ ప్రబలమైన శక్తి ఆయుధాన్ని శివశక్తి శక్తి ఆయుధంతో ఖండించివేసింది. వింధ్యాచలవాసిని వైరాక్షసుడు చక్రం ప్రయోగించాడు. శైలసుత తన చక్రంతో దానిని త్రుంచివేసింది.
అమరద్వేషి విల్లు చేపట్టగా పార్వతి దానిని తుండెములుగా త్రుంచింది. శూలం ప్రయోగింపబోగా దానిని ఖండించింది. గత యెత్తి వ్రేయ దొరకొనగా తునుకులు తునుకలు చేసింది. ఖడ్గం కైకొనగా దాన్ని ముక్కచెక్కలు చేసివేసింది.
అంత ఆ రాక్షస రాజు వింధ్యాచలమందలి పెనుశిలలు తన మీద ప్రయోగించాలని ఏతెంచుతూ వుంటే చంద్రార్థమకుటుడి రాణి శర్వాణి అత్యుగ్రం అయిన ఆగ్నేయాస్త్రాన్ని ధనువున సంధించి ప్రయోగించింది. దుర్వారమైన వజ్రాయుధ ఘాతానికి అవనిపై పడే పర్వతాన్ని పోలి ఆ దుర్గాసురుడు నేలకూలాడు. హరి బ్రహ్మాది నిర్జరులు ఆ వింధ్యవాసి దేవిని బహుముఖాల ప్రశంసించారు.
‘‘దేవీ! జగద్ధాత్రీ! జగత్త్రరుూ జననీ! మహేశ్వరీ! మహాశక్తీ! దైత్య తరుకుఠారికా! త్రైలోక్య వ్యాపినీ! శివా! శంఖ చక్ర గదా శారధారిణీ! విష్ణు స్వరూపిణీ! హంసయానా! సకల సృష్టీ విధాయినీ, ఆద్యంత రహిత వాక్కులకి (వేదాలకి) జన్మభూమీ! చతురానన! ఐంద్రీ! కౌబేరీ వాయవి! వారుణీ! యామినీ! నైరృతీ! ఐశీ, పావకీ! శశాంక చంద్రికా, సూర్యశక్తీ! సర్వదేవమరుూ! పరమేశ్వరీ! గౌరీ! సావిత్రీ! గాయత్రీ! సరస్వతీ! ప్రకృతీ! బుద్ధిస్య రూపిణీ! అహంకార స్వరూపిణీ! బ్రహ్మాండాభ్యంతరస్థితా! మహాదేవీ! పరాస్వరూపిణీ! అపరాస్వరూపిణీ! పరాపర స్వరూపిణీ! పరాపర పరమ పరమాత్మ స్వరూపిణీ! సర్వ స్వరూపా! సర్వంగతా! జ్ఞానశక్తీ! మహామాయాస్వరూపిణీ! స్వాహా!

-ఇంకా ఉంది