భక్తి కథలు

కాశీ ఖండం.. 148

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వధా! శ్రౌషట్, వౌషట్ స్వరూపిణీ! ప్రణవ స్వరూపిణీ! సర్వ మంత్రమరుూ! పురుషార్థ స్వరూపిణీ! చతుర్వర్గ ఫలోదయా! అని ఈ క్రియ పలు విధాలుగా ప్రస్తుతించారు. భద్రకాళీదేవి అమరులకి అభీష్ట వరాలు అనుగ్రహించింది.
దురాసురుణ్ణి చంపి లోకాల దుర్గతి మాన్పటం కారణంగా శివగృహిణికి దుర్గ అనే అభిధానం కలిగింది. దుర్గాదేవి కాశీక్షేత్రంలో ఉత్పాతం మొదలైన దోషాలు ఉపశమింపజేస్తుంది. దుర్గాకుండంలో స్నానం ఆచరించిన జనుడి దుర్గతులు తొలగిపోతాయి. దుర్గాశరీరం నుంచి పుట్టిన శక్తులు దుర్గాదేవి చేరువని నివసించి కాశీ పంచక్రోశంలో ఆక్రోశాలు లేక దూషణలులేకుండా శాసిస్తారు.
మరి శతనేత్ర, సహస్రాస్య, అయుతభుజ, అశ్వారూఢ, గజాస్య, త్వరిత, శవవాహన, విశ్వసౌభాగ్య, గౌరి- ఈ తొమ్మండుగురూ నవశక్తులు.
రురుడు, చండుడు, అసితాంగుడు, కపాలి, క్రోధనుడు, ఉన్మత్త భైరవుడు, సంహారుడు, భీషణుడు- ఈ ఎనమండుగురూ భైరవులు-
విద్యుజ్జిహ్వుడు, లలజ్జ్విహ్వుడు, క్రూరాస్యుడు, క్రూరలోచనుడు, ఉగ్రుడు, వికలదంష్ట్రుడు, వక్రాస్యుడు, వక్రనాసికుడు, జంభకుడు, జృంభణముఖుడు, జ్వాలానేత్రుడు, వృకోదరుడు, గర్తనేత్రుడు, మహానేత్రుడు, తుచ్ఛనేత్రుడు, అంత్రమండనుడు, జ్వలత్కేశుడు, కంబుశిరుడు, పృధుగ్రీవుడు, మహాహనుడు, మహానాసుడు, లంబకర్ణుడు, కర్ణప్రావరణుడు, అన్జసుడు ఆదిగాల బేతాళురు అసంఖ్యాకులు. భూతాలురు అసంఖ్యాలు. నీరు అందరూ కాశీక్షేత్రాన్ని సంరక్షిస్తూ వుంటారు’’ అని వివరంగా విశదీకరించాడు.
కుమారస్వామి చెప్పిన విషయాలు ఆకర్ణించి, అగస్త్యమహాముని కాశీక్షేత్రంలోని దివ్య లింగాలు ఎన్ని? ఆ లింగాల ప్రభావాలు ఎటువంటివి? సెలవిప్పించవలసింది అని ప్రార్థించగా, పార్వతీదేవికి శివుడు ఆనతిచ్చిన ప్రకారంగా ఆ అగస్తికి కుమారస్వామి ఈ ప్రకారంగా చెప్పమొదలుపెట్టాడు.
ఓంకారేశ్వర మహాత్మ్యము
ఆనంద విపిన నగరంలో ఆదిమ బ్రహ్మ అత్యంత నియతితో తపం ఆచరించాడు. క్రమంగా వెయ్యి యుగాలు గడిచిపోయాయి. అంత పాతాళలోకంలోపలినుంచి అనేక కోట్ల సూర్యుల తేజస్సు చేత ప్రకాశించే ఒక దివ్యలింగం ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు తన మనోవీధిని ఏ తేజాన్ని భావించాడో ఆ తేజమే లింగస్వరూపాన్ని పొందింది. భూభువన శరోభాగం పెట్లిపోతున్నప్పుడు పుట్టిన ఛటచ్ఛటా శబ్ద శ్రేణి క్రమంతో సమాధియోగం విడిచి నలువ ఎనిమిది కన్నులు విప్పార్చుకొని చూసాడు.
ప్రథమ తేజంలో అకారము లేక అవర్ణం కైటభుణ్ణి పరిమార్చిన విష్ణువు ఆకార రేఖతో స్ఫురించింది. అక్కడ చూస్తూ చూస్తూ వుండగానే పద్మాసనుడు అయిన బ్రహ్మరూపాన్ని తాల్చి ఉకారం ప్రత్యక్షం అయింది. ఆ తరువాత చంద్రకళాశిఖావంతసుడి చందాన్ని కైకొని మకారం తోచింది. ఈ అఖిలమున్ను కలిసి, శబ్ద బ్రహ్మం అయిన నాదంలో జగత్సృష్టికి హేతుభూతం అయిన బిందువున్ను స్ఫురించింది. సమస్తమూ కూడి పిదప ఓంకారం అయింది. అగస్త్య మునీంద్రా! క్రమంగా అకారం, ఉకారం, మకారం అనే వర్ణాలున్ను, నాదమూ, బిందువూ ఆ బ్రహ్మ ఎట్టయెదుర నిలిచాయి.
ఏ ప్రణవం సంసార సాగరం నుంచి తరింపచేసేది కావున తారకం అనే పేరుగలది అయిందో ఏ ప్రణవం పరమోత్కర్షచేత సకల వికార విరహితత్వంతో కూటస్థమైన శాశ్వత వస్తువుయినా, ఆనంద స్వరూప ప్రకాశ లక్షణం చేత సర్వదా నిత్యనూత్నమైన పరబ్రహ్మ పదార్థానికి వాచకం అవడంవల్ల ప్రణవం అనే పేరుని తాల్చింది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి