భక్తి కథలు

కాశీ ఖండం.. 149

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకార ఉకార మకర బిందునాదాలు అయిదు అవయవాలవల్లా ఏబది కళలు (వర్ణాలు) నిజ రూపంగా గల మాతృకకి (వర్ణమాలకి) హేతుభూతం అయిందో, ఏది త్రరుూమయమో (ఋగ్యజుస్సామ వేదాలమయమ), తురీయం (నాల్గవది), తురీయాతీతమున్ను నిఖిలానికి ఆత్మ అయినదిగా ప్రసిద్ధిం అయి వుంటుందో- ఏ ప్రణవం నాల్గు శృంగాలుగలదీ, సప్తహస్తాలుగలదీ, రెండు తలలు గలదీ, మూడు పాదాలు గలదీ- మూడు విధాలుగా బంధింపబడ్డదయి, వృషభాకారం అయి మోగుతుందో, ఏ ప్రణవంలో బ్రహ్మస్థం అయిన బ్రహ్మమునందున్న జగం లీనమై వుంటుందో, ఏ ప్రణవం అకార, ఉకార మకారాలనే వర్ణత్రయంతో వేదచతుష్టయ స్వరూపమూ, గార్హపత్య, దక్షిణ, ఆవాహనీయ సంవర్తకం అనే అగ్నుల స్వరూపంగలదిన్నీ, పృథివి, అంతరిక్షం, ద్యులోకం, సోమలోకాల స్వరూపంగలదిన్ని, ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, ప్రచయం అనే స్వరూపాలుగలదీ, భూత, భవిష్యత్, వర్తమాన, సాధారణ కాలస్వరూపం అని చెప్పదగి ఉంటుందో, దేనిలో అద్దంలో ముఖంలాగు తనను ప్రకాశింపచేసే చిద్రూపుడు- పరమేశ్వరుడు ప్రతిబింబిస్తూ వుంటాడో, ఏ ప్రణవం అకారాది వర్ణాలు ఏకీభావం పొందే రీతిని ‘ఆదుణః’ అనే వాణిని మహర్షి వ్యాకరణ సూత్రం చేత విధింపబడిన గుణ సంధిలో కలిసిపోయి మంత్రత్వ సిద్ధిని పొందుతుందో- అటువంటి ఓంకార మంత్రం దివ్య లింగాకారమై ఆవిర్భవించగా కనుగొని, బ్రహ్మ నమ ఓంకార స్వరూపాయ, నమస్సర్వ స్వరూప స్వరూపిణే, నమోరుద్రాయ, నమో భవాయ, నమశ్శర్వాయ, నమ ఉగ్రాయ, నమస్సామర్గ్యజుస్స్వరూపాయ, నమోనాదాత్మనే, నమోబిందు కళాత్మనే, నమోలింగాయ, నమోలింగ స్వరూపాయ, నమోభీమాయ, నమః పశుపతయే, నమస్తార స్వరూపాయ, నమశ్శివాయ, నమఃకపర్దినే, నమశ్శిత్రికంఠాయ, నమోమీఢుష్టమాయ, నమోగర్విష్ఠాయ, నమశ్శిపివిష్టాయ, నమో హ్రస్వాయ, నమోబృహతే, నమోవృద్ధరూపిణే, నమఃకుమార గురవే, నమశే్శ్వతాయ, నమః కృష్ణాయ, నమః పీతాయ నమో రుణమూర్తయే, నమో ధూమ్రవర్ణాయ, నమఃపింగళాయ, నమఃకిర్మీరవర్చసే, నమఃపాటలవర్ణాయ, నమో హరిత తేజసే, నమో నానావర్ణ స్వరూపాయ, నమోవర్ణపతయే, నమస్స్వరరూపాయ, నమోవ్యంజనరూపిణే, నమ ఉదాత్తాయనుదాత్తస్వరితరూపాయ, నమోహ్రస్వ దీర్ఘప్లుతవిసర్గాత్మనే, నమో నుస్వర స్వరూపాయ, నమస్సానునాసికాయ, నమోనరనునాసికాయ, నమోదంత్యాయ, నమస్తాలద్యాయ, నమఓష్ఠాయ, నమ ఉరస్సాయ, నమఊష్మస్వరూపాయ, నమోంతస్థాయ, నమఃపినాకినే, నమో నిషాదాయ, నమోనిషాదపతయో, నమస్తారాయ, నమోమంద్రాయ, నమోమధ్యమాయ, నమోఘోరాయ, నమో ఘోరమూర్తయే, నమస్తానస్వరూపాయ, నమోమూర్ఛనాస్వరూపాయ, నమస్స్థాయి సంచార స్వరూపాయ, నమో లాస్య తాండవజన్మనే, నమస్తార్యత్రిక స్వరూపాయ, నమస్థూలాయ, నమస్సూక్ష్మాయ, నమో దృశ్యాయ, నమో పాచీనాయ, నమఃపరాచినాయ, నమో వాక్ప్రపంచస్వరూపాయ, నమఏకాయ, నమోనేకభేదాయ, నమస్సదనస్పతయే, నమశ్శబ్దబ్రహ్మణే, నమఃపరబ్రహ్మణే, నమో వేదాంత వేద్యయ, నమో వేదపతయే, నమఃపార్వతీశ్వరాయ, నమో జగదీశ్వరాయ, నమో దేవదేవాయ, నమశ్శంకరాయ, నమస్త్భ్యుం మహేశ్వర నమస్త్భ్యుం జగదానంద, నమస్త్భ్యుం చంద్రశేఖర, నమస్త్భ్యుం మృత్యుంజయ, నమస్త్భ్యుం త్య్రంబక, నమస్తే పినాక హస్తాయ, నమస్తే త్రిశూలధారిణే, నమస్తే త్రిపురఘ్నాయ, నమస్తేంధక నిషూదనాయ, నమఃకందర్పదర్ప దళనాయ, నమో జాలంధరాయ, నమఃకాలాయ, నమఃకాలకూట విషాదినే, నమోభక్త విషాద హంత్రే, నమోనమః అని అనేక ప్రకారాలుగా ప్రస్తుతించారు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి