భక్తి కథలు

కాశీ ఖండం.. 159

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలం ప్రవేశించింది. ఆ కాలంలో జడలు జడులుగా వానలు కురియసాగాయి. గురువు వానధారలుగా కురియకుండా నాకొక మందిరం నిర్మించి యిమ్మని కోరాడు. గురుపత్ని తన ఒడలికి చలిగాలి తగులకుండా నాకొక రవికెను కుట్టి యిమ్మని అడిగింది. గురుపుత్రుడు తనకి అడుసు లేక బురద అరికాళ్లకి అంటకుండా పావకోళ్లు చేసి యిమ్మన్నాడు. గురువు గాది తనయ నాకు వజ్రాలు పొదిగిన బంగారు నగలు ధరించాలని వుంది. కనుక చేసి తెమ్మని కోరింది. విశ్వకర్మ అవి అన్నీ చేసి ఇస్తానని బాస చేశాడు.
పిమ్మట గురువుకి, గురుపత్నికి, గురుపుత్రుడికి, గురుపుత్రికకి- వారు కోరిన వస్తువులు సమకూర్చే అనువు తెలియక మనోవ్యధాభరితడు అయాడు. అనంతరం దైవయోగంవల్ల ఒక పుణ్యాత్ముడి ఉపదేశంవల్ల కాశీక్షేత్రం చొచ్చి, శివలింగ ప్రతిష్ఠ కావించాడు. చిరకాలం నిష్ఠతో తపస్సు కావించాడు. అతడి తపస్సుకి మెచ్చి విరూపాక్షుడు ప్రత్యక్షం అయి అనుగ్రహించాడు. అంతటి నుంచి సర్వధాతువులకి, సర్వశిలలకి, సర్వదారువులకి (కొయ్యలకి) సమస్త మణులకి, సకల రత్నాలకి, సర్వ పుష్పాలకి, సమస్త వస్త్రాలకి, సర్వసుగంధాలకి, సర్వ కందమూల ఫలాలకి, సర్వ గ్రామ సమూహాలకీ తానే సృష్టికర్తగా వరం పొందాడు. తరువాత మరలివచ్చి గురుజనుల ఆన చెల్లించి విశ్వానికి ఉపకారపరుడు అయాడు. అతడి పేర కాశిలో విశ్వకర్మేశ్వరుడు సమస్త అభీష్టాలు నెరవేర్చేవాడయి వున్నాడు. ఇంక దక్షేశ్వరలింగ ఆవిర్భవాన్ని విశదం చేస్తాను, విను.
దక్షేశ్వర లింగ ప్రాదుర్భావము
గజాసుర దమనుడు శివుడు బ్రహ్మ విష్ణువు, ఇంద్రుడు ఆదిగాగల అమర సమూహం కొలుస్తూ వుండగా అనంతమైన లోక సమూహ రక్షణ పారీణతతో వెండి కొండ కైలాసం మీద వౌక్తిక మణిభూషితం అయిన బంగారు సౌధం మీద వున్న శిలాతలం పయిన కొలువుతీరి వున్నాడు.
అనంతరం సముచితంగా తరతమ భావంతో వేల్పులను అందరినీ క్రమంగా వీడ్కొలిపాడు. కాని తన మామ అయిన దక్ష ప్రజాపతిని వీడ్కొలుపడం మరచాడు. ఒక్కొక్క సమయంలో ఎంతటివారికైనా మరపు కల్గకుండా ఎలాగు వుంటుంది?
దక్షుడు ఖిన్నుడై ఏదో విధంగా ఉస్సురని నిట్టూర్పు పుచ్చి, తన నివాసానికి అరిగి తన అంతరంగంలో ఈ రీతి తలచాడు.
‘‘ఈ శివుడి వంశం ఏదో తెలుసుకొనడం ఎవరి తరం? ఇతని గోత్రం ఏదో ఎవడు తెలుసుకొన్నాడు? నివాసస్థలాన్ని గుర్తుపట్ట వశమా? ఈ శివుడి ప్రవర్తన ఏ విధంగా తెలుసుకొనగలం? ఇతడికి వాహనం వృషభం అట! విషం మ్రింగాడట! ఇతడి సమాచారం ఏమని చెప్పగలం? అస్త్రాన్ని ధరిస్తాడట! మరి తపస్వి అట! ఇటువంటి వెర్రి వెంగళప్ప వేషాలు లోకంలో ఎక్కడైనా వున్నాయా? శ్మశానంలో వసిస్తాడుట! మరి గృహస్థు అని పరిగణించడం ఏ విధంగా? బ్రహ్మచారీ గృహస్థుడూ కూడా ఏ భంగి కాగలిగాడు? చతుర్థ కులజుడో, బ్రాహ్మణుడో, వైశ్యుడో, క్షత్రియుడో! ఇతడి వున్న రూపు తెలియ అలవి అగునా?
అర్థనారీశ్వరుడు కనుక పురుషుడు కాడు. గడ్డం పెరిగింది కనుక కాంత కాడు. అర్చనీయం అయిన లింగాకారుడు కావడంవల్ల నపుంసకుడూ కాడు. చిరకాలంగా వున్నవాడు కావున బాలుడు కాడు, అనాదివాడు కనుక తరుణుడు కాడు. జరామరణాలు లేవు కనుక వృద్ధుడూ కాడు. మహాకల్పం ముగిసే కాలంలో బ్రహ్మాది దేవతల్ని సంహరించినా పాపి కాడు. ఇతడి చందం ఎవడు తెలుసుకొనగలడు? ఆ విషయం అలా వుంచుదాం.
నేను బిడ్డని ఇచ్చి పెండ్లి చేసిన మామని. గురుస్థానం అయినవాడిని కూడా!

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి