భక్తి కథలు

కాశీ ఖండం.. 166

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవించే విధానాన్ని సురగురువైన బృహస్పతి చేత తెలిసికొని వున్నవాడు కాడా మరి?
సూర్యుడి సుదీర్ఘాలు బలిష్టాలు అయిన బాహవుల్ని దయమాలి రంపంతో తరిగివేశాడు. వాయుదేవునికి అతడి అంతఃపుర స్ర్తిలు దుఃఖిస్తున్నా లక్ష్యం చెయ్యక, వధ్యశిలకి ఎక్కించాడు.
రణవీరుల్లో శిఖామణి అయిన ఆ వీరభద్రేశ్వరుడు రోహిణీప్రియుడైన చంద్రుడి సుందర శరీరాన్ని వెల్లకిల పడవైచి ముక్కుపుటాలనుంచీ, నోటినుంచీ అమృత రసం ఉబికి ఉబికి వచ్చునట్లుగా కాలితో త్రొక్కివేశాడు. ఆ వీరభద్రుడి పాదాహతులవల్ల కలిగిన మచ్చయే కదా నేడు చంద్రుడిలో కళంకమై పొడగట్టుతోంది!
ఫాలనేత్రుడి కొడుకైన వీరభద్రస్వామి ‘‘ఈశ్వర ద్రోహీ! గర్వాంధుడా! ఋషుల, దేవతల బంధు జనుల యొక్క నాశనానికి కారణమైన వాడా! పాప కర్ముడా! చావుమని ఒక్క దెబ్బతో చక్రం అంచుతో దక్షుడి శిరస్సుని త్రెవ్వతునిమాడు.
ఈ వడువున విష్ణుమూర్తి చక్రాయుధాన్ని విరిచి, ఇంద్రుడి భుజాన్ని స్తంభింపజేసి, భగుడి కనుగ్రుడ్లు పెళ్లగించి, సూర్యుడి పండ్లు డుల్లగొట్టి, యజ్ఞపశువు తల తెగగొట్టి దక్షుడి శిరస్సు త్రెవ్వత్రుంచి, పార్వతీ సుతుడైన వినాయకుడి పొట్ట గుజ్జు వెలికి ఉరికిపడత్రొక్కి, సరస్వతీదేవి ముక్కు చిదిమివేశాడు. వాయువుని శిక్షించాడు. యముడి మెడలో దండెను తగిల్చాడు.
అదితిదేవి చిగురు పెదవిని ఖండించాడు. అగ్నిదేవుడి నాలుకలు తునుకలుగా కోసివేశాడు. నిరృతి తలపట్టుకొని వంగదీశాడు. కుబేరుడి ముఖాన్ని బండరాతిని పెట్టి రాశాడు. అనంతరం గరుడుల్ని త్రోసివేశాడు. ఖేచరుల్ని జోకొట్టాడు. అప్సరసలను సిగ్గుపరిచి, కిన్నరుల్ని తునిమి, గుహ్యకుల్ని గీడు కుడిపి (దుఃఖపెట్టి) సాధ్యులని పారద్రోలి, ఏకాదశ రుద్రుల్ని పరుగులు పెట్టించి, మరుత్తుల్ని త్రోసివేయించి, విశ్వులను తపింపచేసి, విద్యాధరులను తోలివేసి, గంధర్వుల్ని బాధించి, యక్షుల్ని దూషించి, సర్పాలను శిక్షించి, చారణుల్ని జంకునట్లు చేసి, కింపురుషుల్ని పరాభవించి వీరభద్రుడు తనకు ఎదురులేక వీరవిహారం సల్పుతున్నాడు.
పద్మాసనుడై బ్రహ్మదేవుడి కూర్మి పట్టి అయిన మాతామహుడి (దక్షుడి) యాగ తంత్రాన్ని నిష్ప్రయోజనం కావించి, శివాజ్ఞచే అవక్ర విక్రముడైన వీరభద్రుడు పదంపడి తమ శరీరాలయందు గాయాలవల్ల ఏర్పడిన వికారాలనన్నిటిని ఉపశమించేటట్లు దేవతావరేణ్యులందర్నీ కాపాడాడు.
ఆ దేవుడి కరుణవల్ల దేవతలకి రణంలో అయిన శరీర వికారాలన్నీ ఉపశమించాయి. భవితవ్యతా బలంవల్ల దక్ష ప్రజాపతి కంఠనాళం పైభాగాన పొట్టేలు తలను ధరించాడు. శివద్రోహం ఆచరించడంవల్ల కలిగిన పాపాల ఉపశమనం కోరి దక్ష ప్రజాపతి కైవల్య సామ్రాజ్య పట్ట్భద్రులకి సింహపీఠం అయిన కాశీనగరంలో పెద్ద కాలం తపస్సు ఒనరించాడు. అంతేకాక తన పేర దక్షేశ్వర లింగం ప్రతిష్ఠించాడు.
అమ్మవారైన పార్వతికి హిమశైలం పుట్టిల్లు. కాశీ మహానగరం అత్తవారి యిల్లు. చంద్రకళాధరుడైన శివుడికి కాశి పుట్టిల్లు. హిమాలయం అత్తవారి యిల్లు.
నర్మదేశ్వరుడు, సరస్వతీశ్వరుడు రత్నేశ్వరుడికి తూర్పు భాగంలో వసిస్తారు. ఇకమీద వ్యాసేశ్వరుడి మహాత్మ్యం అభివర్ణిస్తాను. శ్రద్ధగా వినగోరుతున్నాను.
వ్యాసేశ్వర లింగ మాహాత్మ్యము
ఒకప్పుడు వేదవ్యాస మహర్షి సమస్త భూవలయంలోని సకల తీర్థాలలో స్నానమాడి ప్రశాంత చిత్తంతో నైమిశం అనే పుణ్య కాంతారానికి, శిష్య సంతతితో విచ్చేశాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి