భక్తి కథలు

కాశీ ఖండం.. 169

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునీంద్రా! కైవల్య ప్రదాత అయిన విశ్వనాధుడి కన్నా, నీలగ్రీవుడికన్నా, ముక్కంటికన్నా అధికమైన తీర్థాలు, దైవాలు భూలోక భువర్లోక సువర్లోకాల మూడింటిలోను లేవు. ఈ మాట ముమ్మాటికీ నిక్కం!
జీవితాంతం శంభుణ్ణి పూజించిన ఫలం ఒక్కమారు శివుడిని సందర్శిస్తే చాలు లభిస్తుంది. వేల జన్మల్లో సముపార్జించుకొన్న పుణ్యం, ఒకసారి ప్రదక్షిణానికి సాటికాదు. షోడశ మహాదానాల సమూహం కలిసి (్భదాన గోదాన, హిరణ్యదాన, విద్యాదానాదులు పదహారున్ను)- పుష్పాన్ని సమర్పించడాన్ని పోలవు. పంచామృతాలతో అభిషేకం ఆచరిస్తే అశ్వమేథయాగం చేసిన ఫలం సిద్ధిస్తుంది. నైవేద్యం పెట్టడంవల్ల వెయ్యి వాజపేయ యాగాలు నిర్వర్తించడంవల్ల కలిగే ఫలం అబ్బుతుంది. అగస్త్య మునీశ్వరా! ఇవన్నీ చిత్తగించి అభవుడు, కాశీకాధీశుడు అయిన విశే్వశ్వరుణ్ణి భజించు.
శ్రీ విశే్వశ్వరస్వామికి ఛత్రాలు, వింజామరలు, ధ్వజాలు, తాటాకు వీవనలు, పటవాసాలు (వస్త్రాలకి వాసన కట్టెడు సుగంధి చూర్ణాలు) శంభుడికి సమర్పించిన ధన్యుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా ధరణిని పాలిస్తాడు.
ఇక దైవానికి సంబంధించిన విషయాలపట్ల నమ్మిక గల్గివుండడం లేక ఆస్తిక్యబుద్ధి, వినయగుణం, గౌరవం కల్గినప్పుడు అవమానం కలిగినప్పుడూ ఎట్టి మార్పూ లేకుండడం, కోరికలు లేకుండడం, గర్వింపకుండటం, అహింస, ప్రతిగ్రహింపకుండుట (ఎవరినించీ దేన్నీ స్వీకరించకుండా వుండటం) లేని గుణాలను వున్నట్లు ప్రదర్శించే దంభం లేకుండటం, పిసినారితనం లేకుండడం, ఆలస్యం లేకుండడం, పురుషత్వం చూపకుండా వుండటం, దైన్యం లేకుండడం- ఆదిగాగల గుణాలు కాశీ తీర్థవాసికి తప్పక పాటింపవలసినవి.
అగస్త్య మహర్షీ! మరి బాదరాయణుడు లేక వ్యాస మహర్షి కాశీమీద ఎందుకు కోపించాడో చెప్పు అని అడిగావు. పారాశర్వుడి లేక వ్యాసుడి అధిక కోపానికి కారణం చెప్పుతాను. సమాహిత మనస్సుతో ఆలకించు.

వ్యాసుడు కాశిమీద కోపించుట
ఋగ్యజుస్సామధర్వణ వేదాలను నాలుగింటిని విభాగము చేసిన కుశాగ్రబుద్ధి. పరబ్రహ్మవేత్త. తొలుతటి అష్టాదశ పురాణాల కర్త. ‘్భరతం’ అనే నామం కల వేదమునకు మొదటి కవి. గంధవతి కుమారుడు అయిన పరాశరాత్మజుడైన వేదవ్యాస మహర్షి భాగీరథిలో త్రిషవణ స్నానం చేస్తాడు. (ప్రాతస్సవనం, మధ్యాహ్న సవనం, సాయం సవనం- ఇవి మూడు సవనాలు లేక యజ్ఞాలు- వీటికి పూర్వాంగ భూతాలైన స్నాన విధుల్ని శిష్యబృందానికి శివపురాణాలు పురాణిస్తాడు. మాధుకర వృత్తితో ఉదర పోషణ జరపుకొంటాడు. (పువ్వు పువ్వుకీ ఎగిరి ఒక్కొక్క తేనె బొట్టుని తుమ్మెద సేకరించిన విధంగా ఒక్కొక్క గృహనుంచి ఒక్కొక్క కబళాన్ని మాత్రమే గ్రహించడం మాధుకర వృత్తి). నియమంగా శివలింగార్చన కావిస్తాడు.
ముక్తిమంటపం మధ్యభాగంలో పురాణ ప్రవచనం కావిస్తాడు. శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తాడు. విభూతిని సర్వావయవాలకీ అలదుకొంటాడు. రుద్రాక్షమాలలు ధరిస్తాడు.
ఈ భంగి పెద్దకాలం కాశీనగరంలో కృష్ణద్వైపాయనుడు శిష్య వర్గమున్ను, తానూ ముక్తి పదవీ లాభార్థం నివసించి వున్నారు. ఈ ప్రకారం జరుగుతూ వుండగా ఆ వేదవ్యాస మహర్షి స్థైర్యాన్ని పరీక్షింపతలచి విశే్వశ్వర శ్రీమన్మహాదేవుడు విశాలాక్షితో ఈ లాగున వాకొన్నాడు.
‘‘వ్యాస మహర్షి భక్తి యేపాటిదో అరసి చూద్దాము- అతడు భిక్షాటనకి ఏతెంచినపుడు కాశిలో ఇంటింట భిక్ష పుట్టకుండా నువ్వు చెయ్యాలి సుమా!’’

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి