భక్తి కథలు

కాశీ ఖండం.. 172

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్ముఖ బ్రహ్మ నివసించే సత్యలోకం ఈ కాశీనగరానికి బడిసి వాటు లేక దిగదుడుపు. విష్ణువు నివసించే వైకుంఠం కాశీకి కుదువ పెట్టతగినది. పునీత చరిత్రా! ఇంద్రలోకం, చంద్రలోకం మొదలైన లోకాలు కాశీ పట్టణానికి సేవకుల, సేవకుల యొక్క బృందం.
ఈ కాశీనగరంలో నట్టనడిరేయి ఆదిశేషువు ఏతెంచి తన సహస్ర ఫణాలమీది మాణిక్య రోచులే సహస్ర దీపాలుగా నివ్వాళి పట్టుతుంది. కల్పవృక్షాలు అంతర్థానాలు అయి - అదృశ్యాలు అయి- ఫలపుష్పాలతో ఈశానుని అర్చిస్తాయి. కామధేనువులు అర్థచంద్ర శేఖరుణ్ణి తమ పొదుగుల క్షీరధారలతో ఓలలారుస్తూ వుంటాయి. పద్మమహాపద్మ, శంఖాది నవ నిధులున్ను స్వచ్ఛమణులు నీలకంఠుడికి కానుకలుగా సమర్పిస్తాయి. కాశీపురి శంకరుడి నివాస స్థలం. ఆనంద కాననంలో కలి ప్రవేశింపలేదు. వారణాసీపురం మోక్షలక్ష్మికి నివాసం. అవిముక్తక్షేత్రం ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రం అని శిష్యులు కాశీ మహాత్మ్యం వర్ణించారు. వ్యాస మహర్షి శిష్యులతో ఈ ప్రకారంగా నుడివాడు.
ఇంక భిక్షాటన మాని కడుపులో కాళ్లు ముడుచుకొని ఉపవాసం వుందాము. సూర్యుడు అస్తంగతుడు అవుతున్నాడు. రేపు బ్రాహ్మణుల గృహాల్లో మాధుకర భిక్ష పారణకైనా లేకపోతుందా
అని ఆ రేయి వెళ్లబుచ్చి మరుసటి రోజు మధ్యాహ్న కాలంలో శిష్యులున్ను, తానున్ను వేరు వేరుగా విడి విడిగా బ్రాహ్మణ వాటికల్లో భిక్షాటనం కావించారు. కాని ముందునాటి రాత్రివలెనే శంభుడి మాయచే ఏ మీనాక్షి అయినా భిక్షాన్నం పెట్టుకున్న కటకట పడి భిక్షాపాత్రని నట్టనడు వీధిని పగులగొట్టి- ఆగ్రహవేశం పొందాడు.
ఆ క్రోధం చల్లారక ‘్ధనమదం, వేద విద్యామదం, మోక్షలక్ష్మీ మదమున్ను ముదిరిపోయి కదా కాశీ పట్టణంలోని బ్రాహ్మణులు కరుణ లేక నన్ను ఈ రీతిగా అవమానించారు’’ అంటూ వ్యాస మహర్షి తన అంతరంగంలో కాశీనగరంలో నివసించే జనులకి మూడు తరాల వారిదాకా మోక్షలక్ష్మి లభించకుండునుగాక! విద్య కూడా మూడు తరాలదాకా చదువు అంటక నిరక్షరాస్యులై వుందురుగాక! అని ఆకలి దప్పులకి తట్టుకోలేక కాశిని శపించతలచే సమయంలో ఒక బ్రాహ్మణ భవనం వాకిలిలో పార్వతి ప్రాకృత స్ర్తి వేషంతో కనవచ్చింది.
కేశపాశం అక్కడక్కడ నరసిన కేశాలతో నువ్వులు, బియ్యం కలిసిపోయి అందాన్ని ఒలికించగా, బిగువు సడలిపోయి బరువైన స్తనద్వయం పాలవాకలు లేక పాలతిత్తులు అయి నడుము నిసుంత వణకించగా, విశాలములు, ధవళములు అయిన కన్నులు తారళ్యాన్ని విడచివేయగా ఒక నెచ్చెలి చెయ్యి పట్టుకొని ఒక మధుర భాషిణి వీధిలోపలికి వచ్చింది.
చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, షట్ఛాస్త్రాలు ఏ జ్ఞానమార్గాన్ని బోధిస్తాయో ఆ మార్గానికి మిక్కిలి దవ్వుగా లేక చేరువైన పెద్ద ముత్తయిదువ కాశికానగర స్వర్ణపీఠాగ్రం అధిరోహించి ఆ ఆదిమశక్తి ‘‘మునివరా! ఈ వంకకురా!’’ అని హస్త కంకణాలు ఘల్లు ఘల్లురని ధ్వనింపగా చేసన్న చేసి పిలిచింది. చేరువకు చేర పిల్చి ఆ ముత్తయిదువ సత్యవతీ తనయుడైన వ్యాసమహర్షితో ఈ విధంగా పలుకసాగింది.
కంఠందాకా భుజింప మాధుకర భిక్షాన్నం లభించనందువల్లనే కదా అంగలారుస్తున్నావు. ఇది మంచి పనేనా? శాంతుడవే! కటకటా! ఏ పూటకాపూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండుకొని తినే మునుల్ని నువ్వు చూడవా? శాకాహారులు, కందమూలాలు భుజించే వాళ్లూ, వరిమడులలో, రోళ్ల దగ్గర పడి వున్న బియ్యపు గింజలేరుకొని తిని జీవించేవారూ అయిన తపస్వులు నీకన్నా మతిలేనివారా?

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి