భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారంతా ఈ జహ్వర్‌ను ఎలాగైనా దూరం చేయాలనుకొన్నారు. దీనికి వారు ఒక ఉపాయం పన్నారు. మంచి పండితుడైన దేవిదాసు దగ్గరకు వారు వెళ్లారు.
నీకు నచ్చకపోతే నీవు ఇప్పుడు వెళ్లిపోవచ్చు. అంతేకాని మమ్ముల్ని అధిక్షేపించవద్దు అని ఖరాఖండీగా చెప్పేశాడు. దానితో అలీకి కోపం వచ్చి ఆ వూరు వదిలి వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ మహిల్సాపతి కనిపిస్తే మా హసన్ చాలా మారిపోయాడు. వాడు నన్ను వెళ్లిపొమ్మన్నాడు, అందుకే నేను వెళ్లిపోతున్నాను. ఇది హసన్‌కు శిరిడీకి కూడా మంచిది కాదు అని చెప్పాడు.
మహిల్సాపతికి హసన్ గురించి బాగా తెలిసి ఉండడంతో అలీ చెప్పింది విని ఇది మీ మధ్య వ్యవహారం కదా నేనేమీ చెప్పలేను అనేశాడు. ఈ వూరు ప్రజలందరూ ఇంతే వీరికి కాస్త కూడా జ్ఞానం లేదు అని తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
మహిల్సాపతి, హసన్ ఇద్దరూ కూడా ఏమీ జరగనట్టు ఉండిపోయారు.
ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒక రోజు ఉన్నట్టు ఉండి మళ్లీ జహ్వర్ అలీ శిరిడీలోకి వచ్చాడు. వచ్చినవాడు ఎవరింటికి వెళ్లక ఒక గుడిసె వేసుకొని అక్కడే ఉండసాగాడు. ఆ తరువాత కొద్ది రోజులకు చిన్న స్థలంలో ఒక మసీదు కడతాను. ఇక్కడ ముస్లింల కోసం ఓ మసీదైనా లేదు అని అందరిని పిలిచి చెప్పాడు. వారంతా ఇది మాకు నచ్చలేదు. నీవు ఎప్పుడూ ముస్లింలు, హిందువులు అని వేరువేరుగా చెప్తుంటావు. మాకు ఏది అక్కర్లేదు. మాకు మసీదు ఉంది. దానిలోనే మేము ప్రార్థనల చేస్తాము అని వారంతా చెప్పారు.
ఎక్కడ ఉంది. అందులో హిందువు అయిన బాబా కూర్చుని ఉన్నారు కదా అన్నాడు జహ్వర్.
అయితే ఏవౌతుంది. ఆయన్ను అక్కడే ఉండనివ్వు. నీవుకావాలంటే వెళ్లి అక్కడే ప్రార్థన చేయి ఆయన వద్దు అని చెప్పరు అని అన్నాడు హసన్. హసన్‌నే అందరూ సమర్థించారు. ఇక చేసేది లేక జహ్వర్ అలీ మసీదులోకి వెళ్లాడు. తన మకాం కూడా మసీదుకే మార్చుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే సాయిబాబాతో స్నేహం చేశాడు.
సాయిబాబా ఎప్పటిలాగే ఆయన పూలతోటలకు నీరు పోయడం, వచ్చినవారితో మాట్లాడడం, భిక్షాటన చేయడం, సాయంత్రం అవగానే దీపాలు వెలిగించడం చేస్తూ ఉంటే అట్లా కాదు ఇలా చేయి అలా చేయి అని జహ్వర్ సాయికి చెప్పేవాడు. సాయి మారు మాట్లాడకుండా జహ్వర్ చెప్పే పనులు చేసేవాడు.
కొన్నాళ్లు అలా ఉంటూ ఉండి శిరీడీప్రజలందరినీ ప్రార్థన చేద్దాం రండి అని పిలిచేవాడు. వారంతా కుల మత భేదాలు లేకుండా వచ్చి కూర్చునేవారు. అపుడు మీరంతా దేవుడు అనుకునే ఈ సాయి నాకు పూర్వకాలం నుంచి శిష్యుడే. అందుకే నేను చెప్పేదంతా చేస్తున్నాడు. అతడు నా శిష్యుడు, అతనికేమీ మహిమలు అవీ లేవు. అతడు ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు. కనుక మీరంతా నన్ను కొలవండి. నేను మీకు సర్వదా రక్షగా ఉంటాను అని చెప్పాడు.
దీన్ని విన్న శిరిడీ ప్రజలు ఒకరినొకరు చూసుకొన్నారు. ఇదేంటి నీవు ఇలా చెబుతున్నావు. సాయి మాకెప్పుడు నేను దైవం అని చెప్పనే లేదు. ఆయన గురువు వెంకుసా అని మాత్రం మాతో చెప్పారు. నీవు వెంకుసా కాదు కదా అని అడిగారు.
దానికి ఆయన అలా పిలిచేవాడు. నేనే అన్ని విషయాలు నేర్పాను. అసలు నేను జహ్వర్ వెంకుసా అని కావాలని పలకడానికి రాక అలా పిలిచాడు సాయి. రేపట్నుంచి చూడండి, కావాలంటే నేను చెప్పినట్లు ఈ సాయి వినకపోతే అప్పుడు చూసుకొందాం అని చెప్పాడు. ప్రజలంతా జహ్వర్ ఏదో విద్వేషాలు పుట్టించడానికి చేస్తున్నాడనుకొన్నారు. వారంతా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. అందరి ఎదురుగుండా సాయిని గట్టిగా పిలిచి నీవు నేను చెప్పినట్లు వినడంలేదు ఏమిటి? నీకు బాగా పొగరుపట్టిందా? ఇదిగో ఈ నీరు తీసుకొని వెళ్లి ఆ పశువుల కోసం ఉన్న తొట్టిలో పోసిరా అని ఓ రోజు సాయింతో జహ్వర్ చెప్పాడు.
సాయి మారు మాట్లాడకుండా జహ్వర్ చెప్పినట్లే చేశాడు. అందరూ చూస్తుండగా మాత్రమే గట్టిగా సాయిని కేకలు వేయడం చేస్తుండేసరికి మహిల్సాపతి, హేమాదిపంతు లాంటివారికి కాస్త బాధగా అనిపించింది. వారంతా జహ్వర్ లేనపుడు వచ్చి బాబా మీరు ఎందుకు వౌనంగా ఉన్నారు. మీరు ఈ జహ్వర్‌కు ఎందుకు భయపడుతున్నారు అని అడిగాడు. దానికి సమాధానంగా సాయి ‘మీరంతా పొరపాటు పడుతున్నారు. ఈ జహ్వర్‌కు కాస్త నోటిదురుసుతనం ఎక్కువ. మీరు ఏమీ పట్టించుకోకండి.’ -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743