భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఏమీ పట్టించుకోకండి. కొన్నాళ్లు పోతే ఈ జహ్వర్ మారిపోతాడు. దేవీదాసుతో విషయాన్ని చెప్పారు. మీరు ఎలాగైనా ఈ జహ్వర్‌ను వేదాంత చర్చలో ఓడించండి. ఖురాను అయినా భగవద్గీత అయిన చెప్పేది ఒకటే కదా. ఏ మతంలోనైన పరులను హింసించరాదు అనే కదా చెప్పారు. మనమంతా కలిసి ఉంటే ఈ జహ్వర్ మనలో మనకు పొరపొచ్చాలు కలుగజేస్తున్నాడు. కనుక మనం వీరికి దూరంగా ఉండాలి అని దేవీదాసుతో ఊరివారంతా చెప్పారు.
వీరి బాధ గమనించిన దేవీదాసు ‘‘సరే మీరు చెప్పినట్లు నేను వేదాంత చర్చ చేస్తాను. ఆపై భగవంతుని దయ ఎలా ఉంటే అలాగౌతుంది. మీరు భగవంతుడిని నమ్ముకోండి మనకు మంచే జరుగుతుంది’’ అని చెప్పాడు.
దానితో వారంతా హాయిగా ఊపిరి తీసుకొన్నారు.
మసీదుకు వెళ్లి ఓ రోజు జహ్వర్‌తో మీరు దేవిదాసుతో చర్చ జరపండి. అపుడు మాకు మీరిద్దరిలో ఎవరు తెలివిగలవారో తెలుస్తుంది అన్నారు. దానినితో మొదట జహ్వర్ కోపం తెచ్చుకున్నాడు.
కాని ఊరు ఊరంతా ఒకే మాట మీద ఉండేసరికి తప్పదనుకొని సరే మీరు చెప్పినట్లే దేవీదాసుతో చర్చిస్తాను. కాని నేను గెలిస్తే దేవిదాసు ఈ బాబా ఇద్దరూ ఇక శిరిడీలో ఉండకూడదు అని అన్నాడు.
వారంతా అపుడు సరే ఇదే పందెంగా పెట్టుకొందాం. మరి నీవు ఓడిపోయినట్లయితే నీవు కూడా ఈ శిరిడీని విడిచి వెళ్లిపోవాలి అన్నారు.
దాంతో పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టు అయింది. కాని చేసేది లేక సరే అన్నాడు జహ్వర్.
ఒక మంచి రోజు చూసుకొన్నారు.
దేవీదాసు, జహ్వర్ అలీ ఇద్దరూ వేదాంత చర్చలు ఆరంభించారు. ఒకరినొకరు వివిధ పురాణాలలో విషయాలను అడుగుతూ కూర్చున్నారు. ఇదంతా బాబా చిరునవ్వుతోనే చూస్తుండిపోయారు.
ఇలా రెండు రోజులు గడిచాయి.
వీరిద్దరి చర్చల్లో నిన్నటికన్నా ఈరోజు జహ్వర్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు దేవిదాసు అడగడం ఎక్కువైంది. దాంతో తనకు ఓటమి తప్పదు అనుకొన్నాడు.
వెంటనే ఈరోజుటికి ఇక చర్చలు చాలు రేపు మాట్లాడుకుందాం అని లేచేసాడు.
చేసేది లేక దేవీదాసు కూడా సరే అన్నాడు. ఊరందరూ ఎపుడు వీని పీడ విరగడ అవుతుందా అని చూశారు.
కాని మరుసటిరోజు చర్చలకోసం అందరూ పొద్దునే్న మసీదు చెంతకు వచ్చేసరికి వారికి జహ్వర్ అలీ కనిపించలేదు.
ఈ విషయంలో బాబా ఏమీ మాట్లాడలేదు.
దాంతో ఒక పీడ విరగడ అయ్యింది. జహ్వర్‌నే పారిపోయి ఉంటాడు అని అనుకొన్నారు.
అలా జహ్వర్ శిరిడీ వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
కొద్ది రోజుల తర్వాత హేమాది పంతు వారింటికి బీజాపూరు నుంచి చుట్టాలు వచ్చారు. వారి ద్వారా జహ్వర్ అలీ అక్కడ ఉన్నట్టు శిరిడీ వాసులు తెలుసుకొన్నారు.
హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పటిలాగే బాబా వారు యధేచ్చగా మాట్లాడసాగారు.
కొన్నాళ్లకు ఈ విషయం మరిచిపోయారు.
ఒక రోజు ఉన్నట్టు ఉండి మిట్ట మధ్యాహ్నం వేళ జహ్వర్ అలీ శిరిడీ వచ్చాడు.
వానిని చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. మళ్లీ ఏం చేస్తాడో అని భయపడ్డారు. కాని జహ్వర్ వస్తూ వస్తూనే మసీదుకు వెళ్లి బాబా కాళ్లమీద పడ్డాడు.
‘‘బాబా నన్ను క్షమించండి. మీ పట్ల నేను అమర్యాదగా ప్రవర్తించాను. చాలా తప్పు చేశాను. మీరు ఎంతో గొప్పవారు. నాకు మీరేమిటో ఈమధ్యనే తెలిసింది. నేను చేసిన పొరపాట్లను క్షమించండి. ఇక ఎప్పుడూ వీరితోనేకాదు ఎవరితోనైనా సరే నేను నమ్రతగా ఉంటాను’’ అని చెప్పాడు.
బాబా ఎప్పటిలాగే ప్రేమపూర్వకంగానే జహ్వర్ వైపు చూశాడు. ఏముంది జహ్వర్ నీవు ఎప్పటిలాగే ఉండు అన్నాడు. జహ్వర్ చెంపలు వేసుకొని నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడూ నేను తప్పులు చేయను. బాబా నీవే నన్ను రక్షించాలి అని మరీ మరీ వేడుకున్నాడు. మీరు క్షమించాను అని చెప్పనిదే ఇక్కడనుండి కదలను అని కూడా అన్నాడు.
ఇక అపుడు సాయి సరే నిన్ను క్షమించాను. ముందులే వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పాడు.-ఇంకాఉంది

జంగం శ్రీనివాసులు 837 489 4743