భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పిచ్చివాడా! భగవంతుడికి ఏమైనా రూపం ఉంటుందా? నీవేది కోరుకుంటే అలానే ఆయన కనిపిస్తాడు. అంతే’’ అన్నాడు బాబా.
‘ఇదేమీ అర్థంకాక నిమోన్కర్ వారిద్దరినీ చూస్తూండిపోయాడు. బాబాకు నమస్కరించి సోమనాథుడు తండ్రితో వెళ్లిపోయాడు. దారిలో సోమనాథుడు తండ్రికి ఇలా చెప్పాడు.
‘‘నాన్నా! నీవెప్పుడూ ఈ బాబా గురించి చెబుతుంటావు కదా. నేను అంతగా పట్టించుకోలేదు. కాని బాబా నిజంగా దేవుడు. నాకు బాబాగా కాదు నాకు ఇష్టమైన మారుతిలాగా కనిపించారు. మరలా నీతో మాట్లాడినపుడు బాబా అనిపించారు. నా వైపు తిరిగితే నాకు ఆయనలో ఆంజనేయస్వామినే కనిపిస్తున్నాడు. ఎర్రని మూతి నల్లని కళ్లుచేతులు కాళ్లు అంతారోమాలు.. పెద్ద తోక.. కాదు నాన్న ఆయన బాబా కాదు నా మారుతినే.. నాన్న నేను నువ్వు లేనపుడు కాదు. ప్రతిరోజు బాబా దగ్గరకు కాదు కాదు ఆ ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్తాను’’ అన్నాడు సోమనాథుడు.
అవును సోమనాథా! నిజంగా బాబా భగవంతుడే. ఆయన ఎవరేమి కావాలని కోరుకుంటే అలానే కనిపిస్తాడు. బాబా దగ్గరకు చాలామంది వచ్చి పండరిరంగని చూస్తామని, రాముడిని, కృష్ణుడిని చూస్తామని అంటుంటారు. వారంతా ఏమోలే ఏం చెబుతున్నారో అనుకునేవాడిని. కాని ఇప్పుడు స్వయంగా నీవు నా కొడుకవి, పైగా ప్రపంచం తెలియని పసివాడివి. నీకు మారుతిగా కనిపించారు. అంటే సందేహమేమీ లేదు. మనలను తప్పక సాయి కాపాడుతాడు. నిస్సందేహంగా మనం బాబా అని ఎలుగెత్తి పిలవవచ్చు. ఆయన సంతోషంగా పలుకుతాడు అని చెప్పాడు నిమోన్కర్.
అలా సోమనాథుడు బాబాను మారుతిగా భావిస్తూ సేవించడం మొదలుపెట్టాడు.
***
కొన్ని రోజులకు ఓ భక్త బృందం శిరిడీ వచ్చింది. అందరూ బావి దగ్గర స్నానాలు చేసి బాబా దర్శనం కోసం వచ్చారు. అందరూ మసీదులో కూర్చున్నారు. వారిలో ఒకామెను చూసి ‘‘పిన్నీ! నీకు తలనొప్పి ఎక్కువగా ఉందా? ఇక్కడ ఎక్కడైనా మందుల దుకాణం ఉందేమో చూసి వస్తాను. నీ మాత్రలు అయిపోయాయి తెస్తాను’’ అని చెప్పి అతడు బయటకు వెళ్లాడు.
అక్కడే కూర్చున్న బాబా ‘ఏమ్మా! నీ తలనొప్పి ఇంకా తగ్గలేదా? ఎప్పుడో తగ్గినట్టు నాకు అనిపిస్తోంది. సరిగ్గా చెప్పు!’’ అన్నాడు.
అవును బాబా నా తలనుంచి ఏదో బరువు తీసేసినట్టు ఉంది. నాకెంతో హాయిగా అనిపిస్తోంది అంది ఆమె.
అంతలో మందుల దుకాణం కోసం వెళ్లిన అబ్బాయి వచ్చాడు. పిన్నీ మందుల దుకాణం దగ్గరలో లేదట. కాస్త దూరంగా ఉందట. నేను స్నానం చేసి ఏదైనా తిని వెళ్లి తీసుకొస్తాను. బాగా ఆకలి వేస్తోంది అన్నాడు.
ఇంక ఏమీ అక్కర్లేదులే బాబు. నువ్వు వెళ్లి హేమాదిపంతు ఇంట భోజనం చేసిరా, వాళ్లందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు. వెళ్లు. మీ పిన్నిని కూడా తీసుకుని వెళ్లు అన్నాడు.
‘‘బాబూ ఈ బాబాతో మాట్లాడుతూ ఉంటే నాకు తలనొప్పే లేదు. అసలు మనం ఇక్కడకు వచ్చినప్పటినుంచి నాకు తలనొప్పి లేదు. పద నేను నీతో వస్తాను అని ఆమె వెళ్లింది.
****
శ్రీమన్నారాయణుని భక్తునిగా రేగే అనువానికి మంచి పేరుంది. ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుని పూజ చేస్తేగాని మంచినీరైనా తాగేవాడు కాదు. ఆయన అప్పుడప్పుడూ ధ్యానం కూడా చేసేవాడు. సూర్యబింబంలో శ్రీమన్నారాయణుడు ఆసీనులై ఉన్నట్లు భావించుకుని ధ్యానం చేసేవాడు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అదేంటంటే.. అతడు శరీరం నుంచి వేరుగా వచ్చేశాడు. అతని ఎదురుగా శ్రీమన్నారాయణుడు నిల్చుని ఉన్నాడు. ఆయన ప్రక్కన ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. రేగే ‘‘స్వామి మీ ప్రక్కన వున్నది ఎవరు?’’ అని అడిగాడు.
నారాయణుడు ‘‘ఇతడు సాయి. శిరిడీ అనే గ్రామంలో ఉంటుంటాడు. ఇక నుంచి నీవు ఇతడిని ధ్యానం చేయి’’ అని చెప్పాడు
రేగే ‘‘స్వామి ఆ శిరిడీ ఎక్కడో నాకు తెలియదు’’ అన్నాడు.
‘‘దానిదేముందిలే ఇదిగో ఇతడే నీకు దారి చూపిస్తాడు’’ అని శ్రీమన్నారాయణుడు అనగానే ఆ ప్రక్కనున్న వ్యక్తి చిరునవ్వుతో రేగేను చూసాడు. అంతే గాలిలో తేలుతూ చాలా దూరం వెళ్లారు వారిద్దరూ. కొద్దిసేపటికి ఒక పచ్చని చెట్లమధ్యలో నిల్చున్నారు వారిద్దరూ. రేగే ‘‘స్వామి నేను శ్రీమన్నారాయణుని భక్తుని గదా మిమ్మల్ని ఏమని పిలవను’’ అని అడిగాడు.
‘‘నీ ఇష్టం. నీకు ఏమని పిలవాలనిపిస్తే అట్లాగే పిలువు. అన్ని నామాలు నావే కదా!’’ అన్నాడు సాయి.-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743