భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇది శిరిడీ గ్రామమా! మీరు ఇక్కడే ఉంటారా? ఒకవేళ నేను రాలేకపోతే మీరు నా దగ్గరకు వస్తారా’’ అని రేగే అడిగాడు.
‘‘అది కూడా నీ ఇష్టం. నీ ఇష్టాన్ని బట్టి నీవు రా. లేకపోతే నీకు నన్ను చూడాలనిపిస్తే అపుడు నేనే నీ దగ్గరకు వస్తాను’’ అన్నాడు సాయి.
మరి ఇప్పుడు నేను నా స్వామి దగ్గరకు వెళ్లాలి అన్నాడు రేగే.
సరే అలానే అన్నాడు సాయి.
నేను కొద్దిసేపట్లోనే మళ్లీ శ్రీమన్నారాయంని దగ్గర ఉన్నాను. అంతలో రేగేకు మెలకువ వచ్చేసింది.
వచ్చినప్పటినుంచి ఈ సాయి ఎవరు? నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లాడో, కల ఎందుకిలా వచ్చింది. నేను ఏదైనా పొరపాటు చేసానా అని ఆలోచిస్తూ రేగే తాను పనిచేసే హైకోర్టుకు వెళ్లాడు.
అక్కడ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్లుగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు రేగే కోసమే చూస్తున్నట్లు రేగేకి అనిపించింది.
రేగేనే వారి దగ్గరకు వెళ్లి మీరు నా కోసం ఎదురుచూస్తున్నారా అని అడిగారు.
దానికి వారు ‘అవును. మా గురుగారు దీన్ని మాకు ఇవ్వమన్నారు. మీ సందేహాలన్నీ కొద్దిరోజుల్లోనే తీరిపోతాయి అని చెప్పమన్నారు’ అంటూ ఓ పెద్ద ఫొటో ఇచ్చారు. రేగే దానిపైన ఉన్న కాగితాలు విప్పి చూసేసరికి వెంటనే కలలో కనిపించి సాయి ఉన్నారు. నేను ఈ సాయిని కలలో చూశాను అని పైకి అంటూ కళ్లెత్తి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. తనకు ఈ ఫొటోను ఇచ్చినవారు ఎలా అని రేగే అంతా వెతికాడు. కాని వారెక్కడా కనిపించలేదు. సరేలే ఆ సాయినే నన్ను శిరిడీ తీసుకుని వెళ్తాడులే అనుకుని తన పని చేసుకుంటూ ఉండిపోయాడు.
కొన్నాళ్లు గడిచాయి. రేగే కల గురించి మరిచిపోయాడు.
ఒక లాయర్ జడ్జి అయిన రేగే దగ్గరకు వచ్చాడు.
రేగేగారు మీరు నాతోపాటు శిరిడీ వస్తారా.. నాకెందుకో శిరిడీ వెళ్లాలని చాలా రోజులుగా ఉంది. మళ్లీ ఇపుడు మీతో కలిసి వెళ్లాలని అనిపిస్తోంది అని చెప్పాడు.
రేగే ఎప్పుడో ఈ శిరిడీ అన్నమాటను నేను విన్నాను. కాని నాకు ఎంతకీ గుర్తురావడంలేదు. కనుక నేను వస్తాను. నా మనసెందుకో వెళ్దామనే అంటుంది అని రేగే ఆ లాయర్ గుర్నాధంతో కలిసి శిరిడీకి బయలుదేరాడు. దారిలో ఎంతోమంది సాయి గురించి శిరిడీ గురించి చెబుతూనే ఉన్నారు.
రేగే గుర్నాథం ఇద్దరూ శిరిడీ వచ్చారు.
మసీదులోకి అడుగుపెట్టడంతోనే బాబా చిరునవ్వుతో
‘‘రావయ్యా రేగే రా..రా.. ఎందుకు అన్ని సందేహాలు మతిమరుపులు నేను స్వయంగా నిన్ను ఇక్కడకు తీసుకుని రాలేదు. మళ్లీ నువ్వే కదా. నేను అనుకుంటే నువ్వు వస్తావా అని అడిగావు. సరే వస్తాలే అని కూడా వచ్చాను కదా’’ అన్నాడు.
అక్కడున్నవారంతా విస్మయంతో చూస్తున్నారు. ఇదేంటి ఇతడు ఎవరు? ఎక్కడనుంచి వచ్చాడు. ఇంతకుముందెప్పుడూ మేము చూడలేదు కదా. మరి ఇప్పుడు ఏంటి ఈ బాబా ఇలా మాట్లాడేస్తున్నాడు అని వింతగా బాబాను రేగే చూస్తున్నారు.
రేగే వచ్చి కళ్లలోనుంచి నీరు కారుతుండగా బాబా కాళ్లమీద పడి నమస్కారం చేసి సాయి సాయి అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు.
అందరూ అతడినే చూస్తున్నారు.
‘స్థిమితపడు. ఫర్వాలేదు. ఏం కాదు. స్థిమితం.. నేనేలే నీకు ఏమి అనుమానం అక్కర్లేదు. శ్రీమన్నారాయణుడే నాకు చెప్పాడు నిన్ను చూస్తుండమని’ అర్థం అయిందా? నాకు ఆ నారాయణుడికి భేదమేమీ లేదులే అన్నారు.
రేగే మరింత బాధపడుతున్నాడు.
అంతలో హేమాదిపంతు అక్కడికివచ్చాడు.
హేమా! ఇదిగో ఇతడికి కాస్త నీరు ఇవ్వు. చాలా అలసటతో ఉన్నాడు. మీ ఇంటికి తీసుకుని వెళ్లి కాస్త ఏదైనా తినడానికి పెట్టు. స్థిమితపడిన తరువాత తీసుకునిరా అప్పుడు మాట్లాడుతాడు. ఇప్పుడు ఏదోగా ఉన్నాడులే. నీవేమీ ఆలోచించక ఇతడికి తీసుకుని వెళ్లు అన్నారు బాబా.
హేమాదిపంతు బాబా చెప్పింది దాన్ని తుచ తప్పకుండా చేసేవాడు కనుక అతడిని తీసుకుని వెళ్లాడు. రేగేకు స్నానం నీళ్లు ఆహారం ఇవన్నీ ఇచ్చాడు. రేగే కాస్త అన్నం తిని ఓ కునుకు తీశాడు. లేచేసరికి ఎదురుగా హేమాదిపంతు కూర్చుని ఉన్నారు.
‘నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను. నన్ను క్షమించండి’ అన్నాడు రేగే.
‘అయ్యో! ఎంతమాట. ఎందుకండీ అలసిపోయారు. అంతేకదా. కాసేపు పడుకుంటే ఎంతో ఓపిక వస్తుంది. మళ్లీ మనం పనిచేసుకోవచ్చు అన్నాడు పంతు.
అసలు ఏమి జరిగిందంటే అంటూ తనకు కలిగిన అనుభవాలన్నీ రేగేతో పంచుకున్నాడు. అపుడు తనతో వచ్చిన గుర్నాథం కోసం వెతికాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743