భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా చిరునవ్వు నవ్వుతూ ‘మనోవాంఛాఫలసిద్ధిరస్తు’ అని దీవించారు. ఠాకూర్ నమస్కారం చేసి బాబా నాకు నీవు తోడు నీడగా వుండు అని నమస్కారం చేసి వెళ్లిపోయారు.
అక్కడ ఉన్నవారంతా కూడా బాబా ఎక్కడికి వెళ్లకపోయినా అన్ని సంగతులు ఎలా తెలుస్తున్నాయి అని అనుకోసాగారు.
ఆ మాటలు విన్నా కూడా బాబా వౌనంగా కూర్చుని ధునిలోకి కట్టెలను జరుపుతూనే ఉన్నారు.
****
మరో రోజు...
బాబా దగ్గరకు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీశా వచ్చారు.
ఆ రోజు ఎందుకో కాని బాబా అక్కడకు వచ్చిన వారినందరినీ దక్షిణ అడుగుతున్నారు.
పదే పదే చేయి చాచి నాకు దక్షిణ ఇవ్వండి అని అడుగుతున్నారు.
రోజు మామూలుగా వచ్చేవారు సైతం బాబాకు కొంత పైకాన్ని ఆ రోజు ఇచ్చారు. కాని అక్కడే కూర్చున్న శాగారు బాబానే చూస్తున్నారు.
దక్షిణ అడుగుతూ వస్తున్న బాబా ఉపాసినీశాగారి దగ్గర ఆగారు. చేయి చాచారు. అపుడు శాగారు రెండు చేతులెత్తి నమస్కరించారు. బాబా దానిని చూసి నవ్వి శాని దీవించారు.
అక్కడ ఉన్నవారంతా ఇదేంటి మేమంత డబ్బులు ఇస్తే మమ్మల్ని దీవించలేదు. కాని మిమ్మల్ని మాత్రం నమస్కారం చేస్తేనే దీవించారు అని అన్నారు.
ఈ మాటలు విన్న బాబా వెనుదిరిగి వెళ్లి ఎప్పుడూ కూర్చునే దగ్గరే కూర్చున్నారు.
అపుడు ఉపాసినీశాగారు ‘మీకంతా నేనో విషయం చెప్తాను, వినండి. ఈ బాబా చేయి చాచి దక్షిణ అడిగారు అంటే దానర్థం డబ్బులు ఇవ్వమని కాదు. మీకు నా జీవితంలో జరిగిన విషయం చెప్తాను వినండి అని ఉపాసినీశాగారు ఇలా చెబుతున్నారు.
ఓసారి నేను మా కళాశాలను ప్లేగు వ్యాధి ప్రబలడంవల్ల కొన్నాళ్లు మూసివేశారు. ఎపుడు తెరుస్తారో కూడా తెలియదు. అందుకని నేనే స్థలం మార్పు కూడా ఉంటుందని అనుకొని మా అమ్మను తీసుకొని ఋషికేశ్‌కు వెళ్లాను. అక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది కదా అక్కడ కొన్నాళ్లు ఉండి వస్తే బాగుంటుంది అనుకొని అక్కడికి నేను మా అమ్మ వెళ్లాము.
ఒక రోజు మా అమ్మను బసలో ఉండమని చెప్పి నేను అలా తిరగడానికి వెళ్లాను. అక్కడ నాకొక సాధువుకనిపించారు. ఆయన నన్ను చూడగానే నేను నమస్కారం చేశాను. ఆయన ‘మీది సత్నా గ్రామం కదా’ అని అడిగారు. నేను ‘అవును’ అని సమాధానం చెప్పాను. కాని నేను ‘స్వామి మీరు ఎవరో నేను తెలుసుకోవచ్చా’ అని అడిగాను. ఆయన వెంటనే నా గురించి తెలుసుకోవాలని నీకు ఉందా, రేపు రా అన్నారు.
నేను ఎంతో సంతోషంగా బసకు వెళ్లాను. మా అమ్మతో జరిగిదంతా చెప్పాను. అపుడు మా అమ్మ ‘ఆయన తప్పక ఉద్దవ్ మహారాజ్ అయి’ ఉంటారు అని అంది.
నేను ‘అమ్మా ఆయన కాలధర్మం చెందారని విన్నాను’ అని అన్నాను.
‘‘కాని ఆయన హిమాలయాలకు వెళ్లి అక్కడ సమాధి పొందారు. కాని, కోరుకున్నవారికి ఆయన దర్శనం ఇవ్వాలనుకొన్నవారికి ఇస్తారు. నిన్ను అర్హుడవని తలిచి ఉంటారు. అందుకే నీకు దర్శనం ఇచ్చారు. మళ్లీ రేపు కూడా దర్శనం ఇవ్వచ్చు. నేను కూడా నీతో వస్తాను. నాకు ఆ మహారాజ్ దర్శనం పొందే భాగ్యం అబ్బుతుంది’ అంది.
అట్లా మేమిద్దరం మళ్లీ గురువుగారికోసం వెళ్లాము. కాని ఆయన జాడ మాకు ఎంత సేపు చూసినా కలుగలేదు. మేము ఇక సాయంత్రం అయిపోయిందని చెప్పి తిరిగి వచ్చేశాము. ఆ తరువాత నేను ఒక్కణ్ణే అలా బయటకు రాగానే ఆ సాధువు కనిపించాడు. నేను ఆశ్చర్యపోతూ చూస్తుండగానే ఆయన దగ్గరకొచ్చి ‘‘నేను ఎవరిని రమ్మంటే వారే రావాలి. నీవు మాత్రం అట్లా చేయలేదు, కనుకనే నేను నీకు కనిపించలేదు’ అన్నారు. నా తప్పు నాకు తెలిసింది. అపుడు నేను క్షమించమని ఆయన్ను వేడుకున్నాను. అపుడు ఆయన నేను నీ గురువుయైన ఉద్దవునికి మీ ఇంట్లో పూజించే ఆ సాలగ్రామాలకు మీకివ్వమని ఇచ్చాను. మీరు వాటినే పూజిస్తున్నారు కదా అని అడిగారు. నేను అవును అంటూనే ఆశ్చర్యంగా ఆయనవైపు చూశాను. ఆయనకు సుమారు 60 ఏళ్ళు ఉండవచ్చు. నా మదిలో మా గురువుగారు జ్ఞప్తికి వచ్చారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743