భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి దశలో దుర్యోధనుడు పాండవులకు భయపడి నీటి మడుగులో దాక్కొన్నాడు. చిరంజీవి అయిన అశ్వత్థామ దుర్యోధనుని దురవస్థను చూసి జాలిపడ్డాడు. తాను ఎలాగైనా దుర్యోధనునికి సంతోషం కలిగించాలని తలచాడు. వెంటనే ఆయుధాలు పట్టుకుని పాండవుల శిబిరానికి అర్థరాత్రి వెళ్లాడు. అక్కడ పాండవులు ఎవరూ కనిపించలేదు. కాని పాండవుల బిడ్డలు నిద్రపోతూ కనిపించారు. వీరిని చంపేస్తే చాలు పాండవ వంశం నిర్మూలనం అవుతుంది కదా అనుకుని నిద్రపోతున్న పసివారిని యుద్ధనీతి మరిచి సంహరించాడు. అక్కడనుంచి పరుగెత్తుకుంటూ వచ్చి దుర్యోధనుడికి ఈ విషయం చెప్పాడు. కాని దుర్యోధనుడు అంతగా స్పందించలేదు. నిద్రపోతున్నవారిని ఎలా చంపావు అని అడిగాడు. అంతలో విషయం తెలుసుకుని పాండవులు అశ్వత్థామను వెతుకుతూ వస్తున్నారని అశ్వత్థామ తెలుసుకుని తన్ను తాను రక్షించుకోవడానికి ఐషికాస్తమ్రనే దాన్ని ప్రయోగించాడు. కృష్ణుడే తమ పక్షం ఉన్న పాండవులు ఆ అస్త్రాన్ని తప్పించుకుని అశ్వత్థామను పట్టుకుని వచ్చి ద్రౌపది దగ్గర నిలబెట్టారు. ఆమె వానిని చంపవద్దని చెప్పింది. తాను అనుభవించే పుత్రశోకాన్ని గురుపత్ని అనుభవించకూడదని అతడిని వదిలివేయమని చెప్పింది.
ఈ అశ్వత్థామ వదిలిన ఆ ఐషికాస్త్రంవల్ల అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో శిశువు విగతజీవుడు అయ్యాడు. పాండవులందరూ విషయం తెలిసి భోరుమని విలపించారు. నీవే శరణు అంటూ కృష్ణుని వేడుకున్నారు. అపుడు కృష్ణుడు ఉత్తర కుమారుడిని స్పృశించాడు. వెంటనే అతడు నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచాడు. పాండవుల ఆనందానికి అవధులు లేవు. కృష్ణుడు అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు కదా. అందుకే ఆ పిల్లవాడికి విష్ణురాతుడని పేరు పెట్టారు. అతడే పరీక్షిత్తు అంటూ మహిల్సాపతి చెబుతున్నారు. మెల్లమెల్లగా సగుణ్ మేయర్ స్నేహితుల్లో భగవద్గీతపైన ఆసక్తి కలిగింది. వారు రోజు చదవడం ఆరంభించారు. అప్పుడప్పుడు వచ్చి దాసగణును, మహిల్సాపతిని అడిగి విషయం వివరం తెల్సుకునేవారు. వారు నాస్తికులైనా సరే బాబా ముందుకు వచ్చినవారందరూ బాబాకు భక్తులుగా మారేవారు. దీనికోసం బాబా ఏమి చేసేవారు కారు. వారితో కనీసం మాట్లాడేవారు కూడా కాదు.
బాబా దగ్గర కూర్చుని దాసుగుణ అందరికీ గీతను బోధిస్తున్నాడు. కొందరు తమ సందేహాలను అడుగుతున్నారు. బాబా కూడా దీనినంతా వౌనంగా చూస్తున్నారు. అంతలో ఒకరు దాసగణు సర్వప్రాణిని పుట్టించేది విష్ణువుని, సంహరించేది శివుడని అంటారు కదా మరి వీరిద్దరినీ మనం పూజించవలసిందేనా’ అని అడిగారు.
మరొకరు లేచి ‘‘పూర్వకాలంలో అయితే అసురులు దేవతలు, దానవులు అని వేరు వేరుగా ఉండేవారు కదా. ఇపుడు రాక్షసులు అంటూ ఎవరూ లేరు. కాని కొందరివల్ల బాధపడుతున్నాము. ఇలా ఎందుకు జరుగుతుంది’’ అని అడిగారు.
బాబా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః ఆ శ్లోకం ఉంది కదా మరి.
దాసగణూ దాని అర్థం ఏమిటయ్యా అని అడిగారు.
బాబా ఈ సృష్టిలోని మానవులందరూ ఈశ్వరుని పుత్రులే అని అర్థం బాబా అన్నాడు దాసగణు.
ఎప్పుడు కూడా రాక్షసులు దేవతలు అనేవారు ఇద్దరూ ఉన్నారు. ఎవరిలోనైతే సత్వగుణం అభివృద్ధిలో వుంటుందో ఎవరిలోనైతే దైవీ లక్షణాలు ఉంటాయో వారంతా దేవతలే. ఎవరు తామస రజోగుణాలకు బానిసలు అవుతారో, ఎవరిలోనైతే రాక్షసబుద్ధి అంటే ఇతరులను దోపిడీ చేయాలనో లేక ఇతరులను ఏదో ఒక విధంగా బాధించాలనో చూసేవారినే రాక్షసులు అంటారు. ఇదే విషయం గీతలో 16వ అధ్యాయంలోని ద్వౌభూతస్వర్గో లోకేస్మిన్.. అన్న 6వ శ్లోకం వివరణ ఇస్తుంది కదా అన్నారు బాబా.
మరొకరు బాబా రాక్షసులను గుర్తించడమెలా అని అడిగారు.
ఏ మనుష్యుడైతే నిద్ర బద్ధకం అశ్రద్ధ గలవాడు అవుతాడో అతడిలో తామస గుణం ప్రభావవంతంగా ఉన్నట్లు అనుకోవచ్చు గదా బాబా అని మహిల్సాపతి అన్నాడు.
తామస్ మహుత్ రజోగుణథోరా!
కలి ర్పభాస్ విరోధ్ దహుఁఓరా!
అని తులసీదాసు చెప్పనే చెప్పాడు కదా అన్నారు బాబా.
అంతలో మరి గీతలో శ్రీకృష్ణుడు నేనే పరమాత్మను అని చెప్పాడు కదా! ఆయన్ను ఒకరినే పూజించాలా అని అడిగాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743