భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు- తాను అదితి పుత్రులల్లో విష్ణువును, వాయువుకున్న రకాలల్లో మరీచి అన్న వాయువును, ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ణి, పురోహితుల్లో బృహస్పతిని ఆఖరికి వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, నేను నాగుల్లో అనంతుణ్ణి అంటూ అన్నింటిలోను శ్రీకృష్ణుడే నేను అని చెప్పాడు కదా. మరి ఇన్నింటిలో ఉన్న భగవంతుడి అన్ని రూపాలను పూజించాలా లేక ఒక్క రూపానే్న పూజించాలా స్వామి అన్నాడు.
బాబా చిరునవ్వు నవ్వారు.
య్యే పన్యదేవతా భక్తా యజనే్త.. తొమ్మిది అధ్యాయం 23వ శ్లోకంలో- మీకిష్టమొచ్చిన దేవతలనెవరినైనా పూజించుకోవచ్చు. కాని ఆ పూజలన్నీ కూడా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికే చెందుతాయి అని ఇంతకుముందు కూడా చెప్పారు కదా. సర్వమూ భగవంతుడే ఉన్నాడు. ఎక్కడ కూడా నీవు నేను అనేవారు లేనే లేరు. సర్వమూ భగవంతుడే కాని అన్య పదార్థమే లేదు కనుక నీవు ఎవరిని భగవంతుడని అనుకుంటావో వారే నీకు భగవానుడు అని దాసుగణు చెప్పాడు.్భగవంతుడనేవానికి ఒక రూపం గాని ఒక గుణం కాని, ఒక సంగతి కాని లేవు కదా. భగవంతుని విశ్వరూపాన్ని చూచిన అర్జునుడు కూడా
అనాది మధ్యాన్త మనన్త వీర్య మనన్త బాహూం శశిసూర్యనేత్రమ్- 11వ అధ్యాయంలో 9 శ్లోకంలో.
ఆది మధ్యాంత రహితుడు, అనంత సామర్థ్యం ఉన్నవాడు అనంత హస్తములువాడుగా భగవానుడు కనిపించాడు. అన్ని దిశలనూ వ్యాపించినవాడుగా భగవానుడిని చూసానని చెప్పాడు కాని ఏదో ఒక దిక్కులోనో లేక ఏదో ఒకరిలోనూ భగవానుడున్నట్లు చెప్పలేదు కదా అని మహిల్సాపతి అన్నాడు.
ఇలా చర్చ జరుగుతుంది.
అంతలో డా గణే వచ్చారు.‘‘ఏమిటయ్యా నీవు గోపాల్‌దాస్ మహారాజ్ గారు నిన్ను అడిగి మరీ 5 రూపాయలు తీసుకున్నారు. అవి నా దగ్గరకు వచ్చేశాయిలే. నీవు దిగులు పడకు. ఇవే ఆ ఐదు రూపాయల్తు’’ అని 5 రూపాయల నోటును చూపించారు బాబా.
పైగా ఆయన చేసిన అన్నదాన కార్యక్రమం అంతా బాగా జరిగిందా అని కూడా అడిగారు. గణే ఆశ్చర్యపోతూ ‘‘బాబా ఇదే నేను గోపాల్‌దాసుగారికి ఇచ్చాను. అది మీ దగ్గరకు అపుడే ఎలా చేరింది. నేను మనసులో మీకు ఇద్దామనుకున్నాను. గోపాల్‌దాసు అడిగి తీసుకుంటే ఇచ్చాన్తు’’ అన్నాడు.
అందుకే ‘‘ఆయనే స్వయంగా వస్తాను అనుకుంటుంటే నేను వెళ్లి ఆ ఐదు రూపాయలు నా భక్తుడు ఇచ్చాడు కదా అని తీసుకొచ్చుకున్నాను’’ అన్నాను.
ఆ మాటలకు అక్కడి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాబా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికీ వెళ్లలేదు. బాబా ఎక్కడ కూర్చుని ఉన్నా అంతటా ఆయనే ఉన్నారు కనుక ఏ రూపంలో ఎక్కడ ఇచ్చినా అవి బాబాకిచ్చినట్లే అని దానికి ఇలా చూపిస్తున్నారేమో అని అందరూ అనుకున్నారు.
ఇట్లానే ఒకసారి బాపూజీ శాస్ర్తీ అని ఒకరు బాబా దగ్గరకు కాశీనుండి గంగాజలాన్ని తీసుకొచ్చాను అని చెప్పి ఆ గంగాజలంతో బాబా కాళ్ళు కడిగారు.
ఆ తరువాత ఆ నీటిని తమపై చల్లుకుని కాశీ విశే్వశ్వరునివిగా నేను మిమ్మల్లు భావిస్తున్నాను అని చెప్పారు. కొద్దిసేపు అక్కడే కూర్చుని బాబా నేను సమర్థ రామదాసు పుణ్య తిథి దాస నవమి రోజు సజ్జన్‌గడ్‌కు వెళ్లాలనుకుంటున్నాను. దానికి మీరు నాకు అనుమతినివ్వాలి అని అడిగారు. బాబా చిరునవ్వు నవ్వి ‘‘అక్కడ కూడా నేనే కదా ఉన్నాను. ఇక్కడ చూస్తున్నావుకదా మరలా అక్కడికి వెళ్తానంటావే, ఎందుకు’’ అని అడిగారు.
దానికి బాపూజీ శాస్ర్తీ సమాధానం చెప్పలేకపోయారు.
‘‘సరే వెళ్లిరా నీ కోరికను నేను ఎందుకు కాదనడం’’ అన్నారు. బాపూజీ బయలుదేరి సజ్జన్‌గడ్ వెళ్ళారు.
అక్కడ సమర్థ రామదాసుకు నమస్కరిస్తుంటే భౌతికంగా సాయి కనిపించి- ‘‘ప్రయాసతో వచ్చావా? ప్రయాణం బాగా జరిగిందా బాపూజీ, ఏం ఫర్వాలేదు కదా? ఏమన్నా ఇబ్బంది వుంటే చెప్పు్త’’ అన్నారు.
బాపూజీ శాస్ర్తీకి నోట మాట రాలేదు. ఇదేంటి సమర్థ రామదాసుగారు కూడా బాపూజీ రూపమేనా? సర్వ సద్గుణ రూపాలు సాయిబాబావే అని నమస్కరించారు. భగవంతుడిని గురించి ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని చెప్పడానికి వీలు లేదు. ఆయన సర్వాంతర్యామి అని దాసగణు చెప్తున్నాడు. అంతలో ఒకరు లేచి ‘‘దాసు.. ఈ విషయాన్ని వివరించే ఓ భగవత సంఘటన మాకు వివరించవచ్చుకదా ’’ అని అడిగాడు. తప్పకుండా అని దాసుగణు ఇలా చెప్పడం ఆరంభించాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743