భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరణ్యకశ్యపుడు ఉండేవాడు కదా. ఆయనకు లేక లేక ప్రహ్లాదుడు కలిగాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేవాడు. కాని ఆ ప్రహ్లాదుడు నారదుడు చేసిన ఉపదేశంవల్ల నిరంతరమూ విష్ణునామ సంకీర్తనలో మునిగిపోయి ఉండేవాడు. ఈ విషయం రాక్షసులంతా కలిసి హిరణ్యకశపునికి చెప్పారు. తాను కూడా ఈ విషయమే ఆలోచిస్తున్నానని గురువుల దగ్గరకు పంపితే అపుడు ప్రహ్లదుడు మారవచ్చని ఆలోచిస్తున్నట్లు శిరణ్యకశపుడు వారికి చెప్పాడు.
అందువలన చండామార్కుల వారిని పిలిచి విషయం అంతా చెప్పి ప్రహ్లాదుణ్ణి వారికి అప్పగించారు. కాని ప్రహ్లాదుడు నిరంతరమూ తింటున్నా, తాగుతున్నా, నిద్రిస్తున్నా, నడుస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నపుడు కూడా శ్రీహరి నామానే్న జపిస్తూ ఉండేవాడు. అందులోని మాధుర్యాన్ని గ్రోలుతూ ఉండేవాడు.
చదువు పూర్తిచేసుకుని తండ్రి దగ్గరకు వచ్చి చదువుల మర్మమెల్లా తెలుసుకున్నాను అని చెప్పాడు కాని హరినామోచ్ఛారణ మాత్రం మానలేదు. అందుకే ఓసారి ఉగ్రరూపంతో హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి ఆ హరి గిరి ఎక్కడున్నాడు అని, నిజంగా ఉన్నవాడైతే ఇప్పుడే ఇక్కడ చూపు అని అడిగాడు.
ప్రహ్లాదుడు ఇందుగలడు అందు లేడను సందేహం ఎందుకు అంటూ తండ్రి అడిగినట్లుగానే స్తంభంలో చూపాడు. అది కూడా అటు మనిషిగాకుండా ఇటు జంతువుగాకుండా నరసింహావతారంలో కదా. అట్లా భగవంతుడిని ఏ రూపంలో కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ చూడవచ్చు.
చూడాలన్న ధ్యాస ఉండాలి కాని భగవంతుడు లేని ప్రదేశం కాని లేని ప్రాణి కాని ఉండదు. సర్వమూ భగవంతుడే అని చెప్పాడు.
అంతలో మరొకరు లేచి అంటే కుక్కలోను పిల్లిలోను చీమలోను భగవంతుడు ఉంటాడా అని అడిగాడు.
అవును సర్వమూ భగవంతుడని చెప్పాను కదా. అసలు ఈ రూపంలో లేడు ఈ ప్రదేశంలో లేడు అని మనమెవరమూ చెప్పలేము అని చెప్పాడు. శిరిడీలోని రచ్చబండపైన దాసుగణు ఉపన్యాసం సాగుతోంది.
మసీదులో బాబా కారణమేమీ లేకుండానే చిరునవ్వు నవ్వారు. అట్లా ఎందుకు నవ్వుతున్నారో అక్కడ కూర్చున్నవారికి అర్థం కాలేదు. వారు అంతా ఎక్కడ ఏ లీలను బాబా తిలకిస్తున్నారో అని చూస్తున్నారు.
అంతలో శ్రీమతి తార్కాడ్ వచ్చింది. ఆమె చేతిలో వేడి వేడి జొన్నరొట్టెలు ఉన్నాయి. వాటిని సాయి దగ్గర పెట్టి ‘‘బాబా తినండి, వేడిగా ఉన్నాయి. మీ కోసం తెచ్చాను’’ అంది.
‘‘అమ్మా! నా ఆకలి తీరింది. ఇందాక నీవు పెట్టిన రొట్టెతో ఈ నా ఆకలి తీరింది’’ అన్నాడు బాబా.
ఆమె ఆశ్చర్యంగా ‘‘బాబా నేను ఇపుడే కదా వస్తున్నాను. మీరు ఆకలి తీరిందంటారేమిటి’’ అంది.
‘‘అమ్మా! నీవు వడ్డన చేసేటపుడు అక్కడికి ఓ కుక్క వచ్చింది కదా. దానికి నీవు ఓ రొట్టె ఇచ్చావు కదా. ఆ కుక్క ఎంతో ఆకలి గొని వచ్చింది. దాని కడుపు నిండింది. మరి నా కడుపు నిండినట్లే కదా!’’ అన్నారు.
అక్కడ వారు ఇందాక బాబా నవ్వుకు అర్థం అదేనేమో అని అనుకున్నారు అక్కడివారు.
అంతలో లక్ష్మీబాయి షిండే బాబా దర్శనానికి వచ్చింది.
కొద్దిసేపు ఈ మాట ఆమాట మాట్లాడుకున్నారు. ఇక నేను వస్తాను అంది. బాబా అమ్మా లక్ష్మీబాయి ‘‘నీవు రేపు వచ్చేటప్పుడు రొట్టెలు మంచి కూర చేసుకుని రామ్మా!’’ అని చెప్పారు.
ఆమె ఎంతో సంతోషంతో ఆట్లానే చేసుకొస్తాను బాబా అని చెప్పి వెళ్లింది.
మరుసటి రోజు లక్ష్మీబాయి రానే వచ్చింది. రొట్టెలు కూర తీసుకుని వచ్చింది. అంతకుముందే అక్కడికి ఓ కుక్క చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంది. అది ఇది వాసన చూస్తూ తిరుగుతూ ఉంది.
లక్ష్మీబాయి వేడి రొట్టెలు తీసుకుని రాగానే వెంటనే బాబా ఆ కుక్కను పిలిచి దానికి ఆ రొట్టెలు చేతిలో పెట్టుకుని పెట్టాడు. అది ఎంతో ఆత్రంగా తినింది. అట్లా ఆమె తెచ్చిన రొట్టెలన్నీ ఆ కుక్క తినేసింది. ఆమె మొహం అంతా చిన్నబుచ్చుకుంది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743