భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతను మా గురువుగారి గురువు అయితే ఈయనకు ఎన్ని ఏళ్లు ఉండవచ్చు. ఈ గురువుగారు ఏమి ఇలా కనిపిస్తున్నారని అనుకొంటూ ఉన్నాను. అంతలో ఆ సాధువు ‘నీవు ఎక్కువగా ఆలోచించకు. నీకు ఇంకోసారి దర్శనం ఇస్తానులే. కాని నేను అపుడు దక్షిణ అడుగుతాను’ అన్నారు.
నేను అప్పట్నుంచి ఏ సాధువు కనపడినా నమస్కారం చేస్తూనే ఉన్నాను. కాని నన్ను ఇంతవరకూ ఎవరూ దక్షిణ అడగలేదు. కాని ఇక్కడకు రాగానే ఈ బాబా దక్షిణ అడిగారు. అంటే ఈ బాబానే మా గురువుగారు అని నాకు అనిపిస్తోంది. మళ్లీ నన్ను మాయలో పడవేయడానికే ఇన్నిసార్లు అందరినీ దక్షిణ అడిగారు. నాకు తెలిసింది ఈ బాబానే గురువుగారు అని నేను నిస్సందేహంగా అనుకొన్నాను. వెంటనే నన్ను దీవించారు.
అది అసలు సంగతి. గురుకటాక్షం నాకు దొరికింది అని చాలా సంతోషంగా ఉంది అని ఉపాసినీశాగారు చెప్పారు.
బాబా అపుడు చిరునవ్వుతో చూస్తూ ‘ఓ శా! ఎందుకోయి అంత అపనమ్మకం. నమ్మకం అంటూ అటు ఇటూ ఊగిసలాడుతుంటావు కదా. అందుకే నీ బుద్ధి స్థిరమైందా లేదా అని నేను అడిగాను’.
వెంటనే ఉపాసినీశా లేచి బాబా దగ్గరకు వచ్చి కాళ్లమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా చిరునవ్వుతో లేపి దగ్గర కూర్చోబెట్టుకుని నీవు ఎంత శ్రద్ధగా నీ గురువును నమ్ముతావో అంతే శ్రద్ధగా నీ గురువు నీ దగ్గరే ఉంటారు కదా అని అన్నారు.
ఉపాసినీ కళ్లనిండా నీరు నింపుకుంటూ మాట్లాడలేక వౌనం వహించారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ శా శిరిడీ వచ్చారు. శిరిడీ వాసులు ఆయనకు గురుకటాక్షం ఉందని ఎంతో ఆత్మీయంగా పిలిచారు. ఎప్పటిలా బాబాను దర్శనం చేసుకోవడానికి ఆయన వెళ్లారు.
ఈసారి బాబా శాని చూడగానే ఎన్నాళ్లని వెతుకుతూ ఉంటావు. మరేం పర్లేదులే అతడు వస్తాడు. ఒక చెట్టును ఇద్దరు చూశారు. కాని ఒకరు చెట్టు పైకి ఎక్కారు. రెండవవారు చెట్టు మొదట్లోకి వచ్చారు’ అన్నారు. అక్కడున్నవారు మరలా ఏదో శాగారితో మాట్లాడుతున్నారని అందరూ ఆసక్తిగా గమనించారు.
అపుడు బాబా ఏమీ లేదు, మీరంతా ఇంత ఇదిగా ఈ శాని చూస్తున్నారు కదా.
కాని ఇతడు తమ్ముని వెదకడం కోసం వచ్చాడు కాని మనకోసం కాదు. ఎవరో రైలులో మిత్రులు కనిపించి ఇక్కడకు వెళ్లు అని చెప్పినందువల్ల ఇక్కడిదాకా వచ్చారు అని అన్నారు.
శాగారు ‘నిజమే బాబా, మా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే శ్వాస ఇబ్బందిగా మారింది. ఆ తరువాత అతడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నేను ఆయన్ను వెతుకుతూ ఊరూరు తిరుగుతున్నాను. కాని మా తమ్ముడు మాత్రం కనిపించలేదు’’ అన్నాడు.
‘నీవెందుకు ఊరూరు తిరగడం. మరేం పర్లేదులే మీ తమ్ముడే వచ్చేస్తాడు. కపోయినా ఇబ్బంది ఏముంది. క్షేమంగానే ఉన్నాడు అన్నాడు.
శా మీ ఆజ్ఞ నేను కోపరగాం వెళ్లాను. అక్కడ మా మిత్రుడొకాయన మీరే మా తమ్ముని గురించి చెప్తారని చెప్పారు. దానివల్లనే ఇపుడు మీ దగ్గరకు వచ్చాను అన్నాడు.
‘నీవు అడగకముందే చెప్పాను కదా. ఇంకా ఏం కావాలి. మీ తమ్ముడు ఏదో సాధించాలని తపస్సులు అవీ చేస్తున్నాడు. పర్లేదు. వచ్చేస్తాడు’ అన్నాడు.
అక్కడున్నవారికందరికీ చాలా ఆనందం కలిగింది. బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. కాని ఎక్కడెక్కడి విషయాలో ఎలా తెలుస్తున్నాయో అని అందరూ శాని బాబాని చూశారు.
***
బాబా ఒక రోజు భిక్షాటన చేస్తున్నాడు. ఒక వీధిలో ఒక వృద్ధురాలు ఆమె బాధలేవో బాబాకు చెబుతోంది. బాబా ఆమెకు ఉపశమనం కలిగించే మాటలు చెబుతున్నాడు. అంతలో వెనుకనుంచి ఒక ముస్లిం వచ్చాడు. అతడు బాబా వెనుక నిలబడ్డాడు. మంత్రాలు పఠిస్తున్నట్లు పఠించి చేతిలో నీళ్లు వదిలిపెట్టాడు. వెంటనే బాబా వెనక్కు తిరిగాడు. తిరిగి ఏమిరా బుద్ధిలేనివాడా ఇక్కడకు ఎందుకు వచ్చావు. పని పాటు లేదా నీకు అని పెద్దగా తిట్టాడు.
అందరూ అవాక్కు అయి చూస్తున్నారు. వచ్చినతను మ్రాన్పడి బాబానే చూస్తున్నాడు. ‘్ఫ ఇక్కడ్నుంచి నా కంటికి కనిపించకు’ అని గట్టిగా తిట్టారు. ఆయన పోకుండా అక్కడే ఉండేసరికి బాబాతో కలిసి తిరిగేవారిలో కొందరు మీరు ఇపుడు కాస్త దూరం వెనక్కు వెళ్లండి. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743