భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా నవ్వుతూ ‘‘నాలుగు రోజులు ఉన్నా, నలభై రోజులు ఉన్నా ఒకటే. ఎన్ని రోజులు ఉన్నామని కాదు కావాల్సింది. ఇతరులను దోపిడీలు చేయకుండా ఇతరులమీద చాడీలు చెప్పకుండా ఉండాలి. నేను ఏమని చెపుతున్నానో అర్థం చేసుకుని జీవితంలో వాటిని ఆచరించాలి, అదే ముఖ్యం’’ అన్నాడు.
బాబా అట్లా ఎందుకు అన్నాడో తెలియక అక్కడివారు ఊరుకున్నారు. మహిల్సాపతి ఇంటికి మూర్తి ప్రసాదు ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు వారి దగ్గరే ఉంటామని బాబా ఇక్కడే ఉండమని చెప్పారని చెప్పి అక్కడే ఉన్నారు.ఒక రోజు మహిల్సాపతి దగ్గరకు నాసిక్ నుంచి ఒక గోవింద్‌రాజు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి ఏవో బాధలున్నట్లు మహిల్సాపతి చెప్తున్నాడు. దానిని వీరిద్దరూ కూడా వింటున్నారు. నేను ఒక పరీక్ష వ్రాశాను. దానిలో పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది బాబాను ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. కాని బాబా నాకే విషయమూ చెప్పలేదు. బాబా పాస్ అవుతాను అంటే అయిపోతాను కదా. దానివల్లనే ఇంత వ్యాకులంగా ఉంది నా మనసు అంటూ ఆ వచ్చినతను మహిల్సాపతితో అన్నాడు.
దానికి మహిల్సాపతి ‘మీరు ఏమీ బాధపడకండి. మీరు పరీక్ష బాగా వ్రాసారు కదా. బాబా మీ మొర ఆలకించి ఉన్నారు కదా. అది మంచిదైతే మీకు దానివల్ల లాభం వస్తుందని బాబా అనుకుంటే తప్పక మీకు బాబా సాయం చేస్తారు. దీని గురించి మీరు హాయిగా మర్చిపోండి. సాయిని నమ్ముకుంటే రానిది ఏదీ లేదు అని చెప్పాడు. ఆ మాటలు విన్నా కూడా ఆ గోవింద్‌రాజు అంత సంతోషం వ్యక్తం చేయలేదు. మరికొద్దిసేపటికి నేను మరలా బాబా దగ్గరకు పోయి వస్తాను అని ఆ గోవింద్‌రాజు మహిల్సాపతితో చెప్పాడు. మహిల్సాపతి మీ ఇష్టం వెళ్లిరండి అని చెప్పాడు. ప్రసాద్, మూర్తి ఇద్దరూ ఆయనతో మేము కూడా మీతో వస్తాము. దారిలో అలా మాట్లాడుతూ వెళ్లవచ్చు కదా అన్నారు.
అలా వాళ్ళు ముగ్గురూ బాబా దగ్గరకు బయలుదేరారు. మాటల మధ్యలో ప్రసాద్ ఆ బ్రాహ్మణుడితో ఇలా చెప్పాడు.
‘‘చూడండి. మీ వ్యాకులం చూసి నేను చెప్తున్నాను. నేను బాబా పటానికి హారతి మూడు వేళలా ఇస్తాను. నేను అలా హారతి ఇచ్చి నా దగ్గర ఓ ప్రశ్నల పుస్తకం ఉంది. దాన్ని నేను బాబా పాదాలముందు పెట్టి బాబాను ధ్యానిస్తాను. నేను ఏదైనా ఒక కోరిక కోరుకుంటే బాబా నాకు ధ్యానంలో కనిపించి ఇదిగో నీవు ఇది చేయి అని చెప్తారు. దాన్ని చేస్తే తప్పక అనుకున్న పని అయిపోతుంది’ అని చెప్పాడు.
నా దగ్గరకు చాలామంది ఇలా వ్యాకులపడేవాళ్లు ఎంతోమంది వస్తారు. వారినందరినీ నేను ఇలా బాగుచేస్తాను. వారికి నేను బాబా చెప్పిన దాన్ని చెప్తాను. బాబా అందరి సుఖమూ కోరుకోవాలి అని కదా చెప్పింది అని చెప్పారు.
వచ్చినతను అయితే నాకు అలా చెప్తారా అని అడిగాడు.
దానిదేముంది మీకు నమ్మకం ఉంటే అలానే చెప్తాను. ఇదిగో ఇపుడు హారతి సమయమే కదా. పదండి మనం మన బసకు వెళ్దాం, అక్కడే హారతి ఇచ్చి అపుడు మీ ప్రశ్నకు బాబా ఏ సమాధానం ఇస్తారో చూద్దాం పదండి అన్నాడు.వెంటనే వారు మహిల్సాపతి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఇంటికి వచ్చేసరికి మహిల్సాపతి ఎదురు వచ్చి అదేంటి అపుడే హారతి అయిపోయిందా నేను అక్కడికే బయలుదేరాను అని చెప్పాడు.
లేదు లేదు అని ఆ గోవింద్‌రాజు ప్రసాద్ చెప్పినవి చెప్పాడు. దానికి మహిల్సాపతి ఇవన్నీ ఎందుకు, మనం బాబా దగ్గరకే కదా పోతున్నాం. ఆయనే దారి చూపుతారు. ఇవన్నీ నమ్మకు అని చెప్పాడు. అయినా ఆశ చావని గోవింద్‌రాజు ప్రసాద్ మూర్తిలతో ఉండిపోయాడు.
వారు బాబా పటాన్ని పెట్టి హారతి ఇచ్చారు. ప్రశ్నల పుస్తకాన్ని తీసి గోవింద్‌రాజు సమస్యకు పరిష్కారం చూపమని బాబాను కోరారు. పుస్తకం తెరిచి చూశారు. దానిలో బాబా చరిత్ర పారాయణ చెయ్యి. మూడు కిలోల మిఠాయి అందరికీ పంచు అని వచ్చింది.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743