భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా మారు మాట్లాడలేదు.
మళ్లీ వచ్చినతను ‘బాబా నేను నీ కోసం మంచి ఖరీదైన స్వీట్లు కనుక్కొచ్చాను. ఇవన్నీ మీరు తినాలి. ఇక్కడ అందరికీ మీరు పంచుతారని విన్నాను. అందుకే పంచడానికి ఈ స్వీట్లు తెచ్చాను. మీరు తినడానికి వీటిని ప్రత్యేకంగా తీసుకొచ్చాను. రెండు రకాల స్వీట్లు బాబా ముందు పెట్టాడు. బాబా చిరునవ్వు నవ్వారు కానీ ఏమీ మాట్లాడలేదు. అందులో బాబాకోసం తెచ్చిన స్వీట్లపైన చీమలు పాకాయి. మరికొంతసేపటికి ఈగలు కూడా వాలుతున్నాయి.
ఆ వచ్చినతను ఛీ ఛీ ఏం ఈగలు, ఇక్కడ పరిశుభ్రంగా లేదు. అంతా ఈగలు దోమలు ఎక్కువ వున్నాయి. నేను మీ కోసం తెచ్చిన వాటిమీద ఇవి వాలుతున్నాయి అంటూ వాటిని దులపబోయాడు.
నీవు అంతదూరం నుంచి నాకోసం తెచ్చావు కదా, మరి నేను తింటూ వుంటే నీవు ఎందుకు నన్ను పారద్రోలుతున్నావు అన్నారు.
వచ్చినతనికి ఏమీ అర్థం కాలేదు. ఎవరిని బాబా అంటున్నాడో అర్థం కాక అలా చూస్తున్నాడు. అంతలో అక్కడికి మహిల్సాపతి వచ్చాడు. బాబా చిరునవ్వుతో చూస్తున్నాడు.
‘మహీ వచ్చావా.. ఇదిగో ఇతడు భాగ్యనగరం నుంచి ఈ స్వీట్లు తెచ్చాడట. అవి మీరు తీసుకోండి’’ అన్నాడు.
అతడు వెంటనే బాబా అదేంటి అట్లా అన్నారు. మీరు ఇంకా తీసుకోలేదు కదా. పైగా ఇవి నేను తెచ్చాను. నేను పంచితే నాకు పుణ్యం వస్తుంది కదా. మరి మీరేంటి ఇతనిని పంచమంటారు. మీరు ఏమో తినరు అని సణుగుతూ ఉన్నాడు. బాబా పట్టించుకోనట్లే వేరే ఎవరో వస్తే వారితో మాట్లాడుతున్నాడు.
మహిల్సాపతి ఊరక కూర్చున్నాడు. బాబా కోసం తెచ్చిన సీట్లల్లో ఒకటి పూర్తిగా చీమలు తినేశాయి. పూర్తిగా అయిపోయింది. అతడు దానిని తీసుకొని ఛీ ఛీ అంటూ జాగ్రత్త చేయబోయాడు.
వెంటనే బాబా ‘‘్భగ్యనగరవాసా!’’ అన్నాడు. అతడు ఆశ్చర్యపోతూ చూశాడు.
నన్ను భగవంతుని రూపు అని ఇక్కడు వచ్చావు కదా. మరి నాలో తప్ప భగవంతుడు ఎక్కడా లేడా? అని అడిగారు. అతడు ఏమీ చెప్పలేక మాటలు తడుముకోసాడు.
మళ్లీ బాబానే ‘మీరంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సర్వవ్యాపి. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ భగవానుడు తప్ప వేరెవరూ లేరు. అది నమ్మినపుడు భగవంతుని తత్వం తెలుస్తుంది. భగవంతుడికే ఇవ్వాలని ఏముంది. ఏ ప్రాణికిచ్చినా అది భగవంతునికి ఇచ్చినట్లే అవుతుంది.
చీమ దోమ ఈగ ఇవి కూడా ప్రాణులే. అవి కూడా భగవంతుని అంశలే అన్నాడు. భగవంతుడిని నేనే అని చెప్పిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు. మీ కర్తవ్యాన్ని మీ బాధ్యతను మీరు నెరవేర్చండి. మీరే పని చేసినా దాని ఫలాన్ని గూర్చి ఆలోచించకండి. ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో అది నేను ఇస్తాను అని చెప్పాను కదా అని అడిగాడు.
వచ్చినతను అవును అన్నాడు.
మరి నీకు ఈ విషయం తెలిస్తే నీవు ఇవ్వాలనుకొన్న స్వీట్లు ఇచ్చేసావు. నీకు భగవంతుడు ఏమి ఇవ్వాలనుకొంటాడో దానిని ఇవ్వనే ఇస్తాడు కదా. మరి ఇపుడు మహిల్సాపతి వాటిని అందరికీ పంచితే పుణ్యం నీకొక్కడికి ఇవ్వకుండా మహికి పోతుందని ఎందుకు అనుకొంటున్నావు అన్నారు.
ఏం చెప్పాలో తెలియక వచ్చినతను కూర్చున్నాడు.
మీరు ఏం చేయాలనుకొంటారో అది చేయండి. ఫలితాలను ఆశించకండి. ఏది మీ చేత చేయించాలో దానినే భగవంతుడు చేస్తాడు. చేసేవాడు చేయించేవాడు రెండూ భగవంతుడే అని మీరు తెలుసుకోవాలి అన్నారు.
ఆ భాగ్యనగర వాసుడు బాబాకు నమస్కారం చేసి ఇప్పటినుంచి నేను ఎవరినైనా భగవంతుని రూపుగానే భావిస్తాను అని చెప్పాడు.
బాబా చిరునవ్వు నవ్వి ఆ చీమలు తిన్నా అది నేను తిన్నట్లే, నీవు ఏమీ బాధపడకు. ఇక్కడదాకా అప్పు చేసి రానక్కర్లేదు. నీవు చూడాలనుకొంటే అక్కడే కనిపిస్తాను. ఉన్నంతలో తిని దానిలో ఎదుటివానికి కాస్త సాయం చేస్తే సరిపోతుంది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743